Sandeep Reddy Vanga: స్పిరిట్ సాంగ్ చింపేసిండు.. ఈ సినిమా తర్వాత బిజీ అవుతాడు: మ్యూజిక్ డైరెక్టర్‌పై సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన మూవీలోని ఓ ట్రాక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ గురించి మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన ట్రాక్ చింపేసిండు అని చెప్పడం విశేషం.

Published on: Sep 2, 2026, 16:23:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sandeep Reddy Vanga: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్పిరిట్' (Spirit) గురించి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఊహించని సంచలన అప్‌డేట్ ఇచ్చేశారు. రీసెంట్‌గా జరిగిన 'రోమాంచకం' ప్రమోషన్స్ కార్యక్రమంలో సందీప్ వంగా మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ ఆల్రెడీ ఒక మైండ్ బ్లాకింగ్ చార్ట్‌బస్టర్ సాంగ్ కంపోజ్ చేసినట్లు రివీల్ చేశారు.

Sandeep Reddy Vanga: స్పిరిట్ సాంగ్ చింపేసిండు.. ఈ సినిమా తర్వాత బిజీ అవుతాడు: మ్యూజిక్ డైరెక్టర్‌పై సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: స్పిరిట్ సాంగ్ చింపేసిండు.. ఈ సినిమా తర్వాత బిజీ అవుతాడు: మ్యూజిక్ డైరెక్టర్‌పై సందీప్ రెడ్డి వంగా

సందీప్ వంగా కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఖుషీ

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏ ఈవెంట్‌కు వచ్చినా అక్కడ మ్యాటర్ నెక్స్ట్ లెవెల్‌లోనే ఉంటుంది. 'రోమాంచకం' ప్రమోషనల్ ఈవెంట్‌లో సందీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 'స్పిరిట్' మ్యూజిక్ వర్క్స్ ఎంత వేగంగా జరుగుతున్నాయో చెబుతూ.. వాసుకి వైభవ్ ఇచ్చిన పాట వింటే థియేటర్లలో ఆడియన్స్ విజిల్స్ వేయడం ఖాయమని సందీప్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పారు. రోమాంచకం మూవీ గురించి చెబుతూ వాసుకి తనకు కూడా ఓ ట్రాక్ ఇచ్చాడని, చింపేసిండు అని సందీప్ తనదైన స్టైల్లో చెప్పారు. రోమాంచకం మూవీ తర్వాత వాసుకి చాలా బిజీ అవుతాడని కూడా సందీప్ అంచనా వేశారు.

సందీప్ ఆ మాట చెప్పగానే పక్కనే ఉన్న రోమాంచకం మూవీ హీరో సుమంత్ ప్రభాస్ స్పందిస్తూ.. నాకు కూడా వినిపించిండు.. ఖతర్నాక్ ఉంది అని అనడం విశేషం. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ వంగా.. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ప్రెజెంట్ చేయడానికి గ్రాండ్‌గా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

'భద్రకాళి పిక్చర్స్' బ్యానర్‌లో డిఫరెంట్ మూవీ

సాధారణంగా వంగా బ్రదర్స్ అనగానే అందరికీ మైండ్‌లోకి వచ్చేది ఇంటెన్స్ యాక్షన్, డార్క్ వైబ్స్. కానీ ఈసారి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌లో పూర్తిగా ట్రెండ్ మార్చి ఒక ఫ్రెష్ అండ్ ఫన్నీ యూత్ ఎంటర్‌టైనర్‌గా 'రోమాంచకం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

డెబ్యూ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పిన రెండు గంటల కథ వినగానే వంగా బ్రదర్స్ ఆ కాన్సెప్ట్‌కు పూర్తిగా ఫిదా అయిపోయారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన తర్వాత సందీప్ వంగా ఎంతలా ఎగ్జైట్ అయ్యారంటే.. డైరెక్టర్‌కు ఆస్కార్ అవార్డు ఇచ్చినంత రేంజ్‌లో ఒక బీర్ బాటిల్ చేతికి ఇచ్చి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

పీక్స్‌లో ప్రభాస్ లైనప్, బాక్సాఫీస్ క్రేజ్

ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ లైనప్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీగా ఉంది. 'సలార్', 'కల్కి 2898 AD' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత ప్రభాస్ చేస్తున్న 'స్పిరిట్' మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. సందీప్ వంగా టేకింగ్‌లో ప్రభాస్ మాస్ అండ్ ఇంటెన్స్ అవతార్ ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ గ్యాప్‌లో వాసుకి వైభవ్ కంపోజిషన్ గురించి సందీప్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపింది. స్పిరిట్ మూవీ ఆడియో ట్రాక్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ఈ ఒక్క అప్‌డేట్‌తో క్లారిటీ వచ్చేసిందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More