Sanjay Dutt: 'బస్ కర్నా బే'.. ఫొటోగ్రాఫర్లపై సంజయ్ దత్ ఫైర్.. వీడియో వైరల్.. ధురంధర్ 2 సక్సెస్ జోష్‌లో సీనియ‌ర్ హీరో

Sanjay Dutt: ధురంధర్ 2 సక్సెస్ జోష్ లో ఉన్న సీనియర్ హీరో సంజయ్ దత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ‘బస్ కర్నా బే’ అంటూ ఫొటోగ్రాఫర్లపై చిరాకు పడ్డాడు. తన ఫ్యామిలీతో కలిసి అతను డిన్నర్ కోసం బయటకు వెళ్లినప్పుడు ఇది జరిగింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Mar 28, 2026, 05:59:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ 'ధురంధర్: ది రివెంజ్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన భార్య మాన్యత దత్, పిల్లలు షహ్రాన్, ఇక్రాతో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం వెళ్లాడు. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లపై సంజయ్ దత్ ఫైర్ అయ్యాడు.

సంజయ్ దత్ (Instagram/@bollywoodreporter.in)
సంజయ్ దత్ (Instagram/@bollywoodreporter.in)

సంజయ్ దత్ ఆగ్రహం

సంజయ్ దత్ కుటుంబం రెస్టారెంట్‌కు చేరుకోగానే ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. కంటిన్యూగా కెమెరాలు క్లిక్ మనిపిస్తూ, నటుడిని పిలుస్తూ ఇబ్బంది పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన సంజయ్ దత్, "బస్ కర్నా బే" (ఇక ఆపండి) అంటూ వారిపై విసుక్కున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

అరే భాయ్

డిన్నర్ ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు కూడా ప్యాపరాజీలు సంజయ్ దత్ ఫ్యామిలీని వదల్లేదు. కెమెరాలతో వెంబడిస్తుండటంతో.. "అరే భాయ్, రెండు నిమిషాలు ఆపండి. ఇప్పుడు చాలు" అంటూ సంజయ్ దత్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో సెలబ్రిటీల ప్రైవసీపై చర్చ మళ్లీ మొదలైంది.

ధురంధర్ 2లో

బయట గొడవలు ఎలా ఉన్నా, 'ధురంధర్ 2'లో సంజయ్ దత్ నటనకు మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో SSP చౌదరి అస్లాం పాత్రలో సంజయ్ దత్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,128 కోట్లకు పైగా వసూలు చేసింది.

వివాదాలు దాటి విజయ తీరాలకు

కొన్ని గల్ఫ్ దేశాలలో ధురంధర్ 2 సినిమాపై నిషేధం విధించడమే కాకుండా, విమర్శకులు దీనిని "ప్రచార చిత్రం" అని పిలిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 ప్రభంజనం ఆగలేదు. రణ్‌వీర్‌ సింగ్, ఆర్.మాధవన్ వంటి స్టార్ల నటన ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చింది.

9వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు

ధురంధర్ 2 వసూళ్లలో 9వ రోజున స్వల్ప తగ్గుదల కనిపించింది. సాధారణంగా పెద్ద సినిమాలకు రెండో వారంలో ఉండే ట్రెండ్ ప్రకారమే కలెక్షన్లు తగ్గాయి. సక్నిల్క్ ప్రకారం 9వ రోజున ధురంధర్ 2 ఇండియాలో రూ.41.55 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

సంజయ్ దత్ ప్రాజెక్టులు

ధురంధర్ 2 విజయం తర్వాత సంజయ్ దత్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. 'ఆఖ్రీ సవాల్', 'రాజా శివాజీ', ‘బాప్’, 'KD – ది డెవిల్' వంటి సినిమాల్లో ఆయన నటిస్తున్నాడు. రీసెంట్ గా ‘కేడీ ది డెవిల్’ సినిమాలో నుంచి రిలీజైన ఓ పాట కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బూతు పదాలు, అసభ్యకరమైన స్టెప్పులతో ఈ సాంగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More