Saptagiri: టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సప్తగిరి తెలుసు కదా? అతడు ఈ మధ్య పురుష: అనే మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఓ చిన్న సినిమా అనే నోరు జారాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పాడు.
అది అలా వచ్చేసింది అంతే.. నిజంగా సారీ..

కమెడియన్ సప్తగిరి నటించిన లేటెస్ట్ మూవీ ‘పురుష:’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ.. ఇంతకీ రాజా సాబ్ చిన్న సినిమానా పెద్ద సినిమానా అని అడగడంతో సప్తగిరి ముందు నవ్వాడు. నన్ను పట్టుకున్నావా అక్కా అని తనదైన స్టైల్లో అన్నాడు.
ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ మధ్య కొన్ని చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నానని చెబుతూ కొన్ని సినిమాలు పేర్లు చెప్పాను. అందులో రాజా సాబ్ ను కలిపేశాను. రియల్లీ సారీ.. క్షమించండి అని అన్నాడు.
మారుతి ఫోన్ చేశారు
అప్పుడే యాంకర్ జోక్యం చేసుకుంటూ మారుతి గారు ఫోన్ చేశారా అని ప్రశ్నించింది. దీనికి సప్తగిరి స్పందిస్తూ.. “చేశారు.. సారీ చెప్పు తమ్ముడు అని అన్నారు. అప్పుడే అన్నకు సారీ చెప్పాను. ఇప్పుడు మీడియా ముఖంగా కూడా సారీ అడుగుతున్నాను. రాజా సాబ్ చిన్న బడ్జెట్ సినిమా అన్నందుకు క్షమించండి” అని సప్తగిరి మరోసారి క్షమాపణ కోరాడు.
అసలు ఏం జరిగిందంటే?
సప్తగిరి నటిస్తున్న ఇదే పురుష: మూవీ ప్రమోషన్లలో భాగంగా సప్తగిరి కొన్ని రోజుల కిందట మీడియాతో మాట్లాడాడు. ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు అన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ.. నేను ఈ మధ్య సరస్వతి, రాజా సాబ్ కొక్కొరోకోలాంటి చిన్న సినిమాల్లో నటించాను. చిన్న సినిమాలు కాబట్టి జనాలకు పెద్దగా నేను కనిపించలేదు.. పెద్ద సినిమాల్లో నటిస్తే వాళ్లు గుర్తు పెట్టుకుంటారు అని అన్నాడు.
ఈ కామెంట్స్ కాస్తా తీవ్ర దుమారం రేపాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేశారు. రాజా సాబ్ ను చిన్న సినిమా, తక్కువ బడ్జెట్ సినిమా అంటావా అంటూ సప్తగిరితో ఆడుకున్నారు. ఏకంగా డైరెక్టర్ మారుతి కూడా రంగంలోకి దిగడంతో సప్తగిరి చివరికి క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలికాడు.
ది రాజా సాబ్ ఫెయిల్యూర్
{{/usCountry}}ఈ కామెంట్స్ కాస్తా తీవ్ర దుమారం రేపాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేశారు. రాజా సాబ్ ను చిన్న సినిమా, తక్కువ బడ్జెట్ సినిమా అంటావా అంటూ సప్తగిరితో ఆడుకున్నారు. ఏకంగా డైరెక్టర్ మారుతి కూడా రంగంలోకి దిగడంతో సప్తగిరి చివరికి క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలికాడు.
ది రాజా సాబ్ ఫెయిల్యూర్
{{/usCountry}}నిజానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ జనాలకు అస్సలు ఎక్కలేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. తర్వాత జియోహాట్‌స్టార్ ఓటీటీలో రికార్డులు తిరగరాసే వ్యూస్ సంపాదించినా.. థియేటర్లలో మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది.