...
...
Next Story

OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి మూవీ.. థియేటర్లలోకి వచ్చిన 12 రోజులకే స్ట్రీమింగ్!

OTT Telugu: మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన తాజా చిత్రం 'సతీ లీలావతి' థియేటర్లలో విడుదలైన 12 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వివరాలు మీకోసం.

Published on: May 20, 2026, 10:42:19 IST
Advertisement

OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ ఓ తెలుగు మూవీ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన కేవలం 12 రోజులకే ఈ మూవీ డిజిటల్ డెబ్యూ చేయడం గమనార్హం. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సతీ లీలావతి' అప్పుడే డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది.

సతీ లీలావతి ఓటీటీ

ఓటీటీలోకి మెగా కోడలు లావణ్య త్రిపాఠి మూవీ
ఓటీటీలోకి మెగా కోడలు లావణ్య త్రిపాఠి మూవీ

మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన తొలి తెలుగు మూవీ ‘సతీ లీలావతి’. ఈ మూవీ ఇవాళ (మే 20) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా డిజిటల్ డెబ్యూ చేసింది.

12 రోజులకే

థియేటర్లలో విడుదలైన కేవలం 12 రోజుల వ్యవధిలోనే సతీ లీలావతి సినిమా ఓటీటీ బాట పట్టడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన ఒక నటుడు లేదా నటి నటించిన సినిమా ఇంత తక్కువ సమయంలో ఓటీటీలోకి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సతీ లీలావతి మే 8న థియేటర్లలో రిలీజైంది.

థియేటర్లలో ఇలా

తాతినేని సత్య దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సతీ లీలావతి సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. సమకాలీన ప్రేమకథతో, వినోదభరితంగా సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ కాంబినేషన్ సరికొత్తగా ఉంటుందని భావించినప్పటికీ, థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో థియేట్రికల్ రన్ చాలా త్వరగానే ముగిసిపోయింది.

స్ట్రీమింగ్ పై ఆశలు

సతీ లీలావతి సినిమాలో లావణ్య త్రిపాఠి సరసన దేవ్‌ మోహన్ హీరోగా నటించగా, వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక సపోర్టింగ్ కాస్ట్‌ విషయానికొస్తే.. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ హాస్యనటుడు సప్తగిరితో పాటు కోలీవుడ్ నుంచి వీటీవీ గణేష్, మొట్ట రాజేంద్రన్ వంటి అగ్ర నటీనటులు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు.

దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై ఎం. నాగ మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్ అద్భుతమైన స్వరాలను అందించారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు సన్ నెక్స్ట్‌లో ఈ వినోదాత్మక చిత్రాన్ని వీక్షించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks