Rao Bahadur: రావు బహదూర్ హారర్ కాదు.. థ్రిల్లర్ కాదు: మహేష్ బాబు, సత్యదేవ్ మూవీపై డైరెక్టర్ వెంకటేశ్ మహా కామెంట్స్

Rao Bahadur: సత్యదేవ్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ రావు బహదూర్ పై డైరెక్టర్ వెంకటేశ్ మహా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీ జానర్ ఏంటన్నదానిపై ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం.

Published on: Jun 27, 2026, 10:18:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rao Bahadur: టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ 'రావు బహదూర్' (Rao Bahadur) జులై 3న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి కల్ట్ క్లాసిక్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాను తెరకెక్కించారు.

Rao Bahadur: రావు బహదూర్ హారర్ కాదు.. థ్రిల్లర్ కాదు: మహేష్ బాబు, సత్యదేవ్ మూవీపై డైరెక్టర్ వెంకటేశ్ మహా కామెంట్స్
Rao Bahadur: రావు బహదూర్ హారర్ కాదు.. థ్రిల్లర్ కాదు: మహేష్ బాబు, సత్యదేవ్ మూవీపై డైరెక్టర్ వెంకటేశ్ మహా కామెంట్స్

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ గా సపోర్ట్ అందిస్తూ ప్రమోషన్స్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రీసెంట్‌గా రిలీజైన టీజర్, పోస్టర్స్ ఇంటర్నెట్‌లో విపరీతమైన క్రేజ్ జనరేట్ చేశాయి.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెంకటేష్ మహా.. రావు బహదూర్ ఏ జోనర్‌లో ఉండబోతుందో వివరిస్తూ లీక్ చేసిన డీటెయిల్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

హారర్ కాదు.. థ్రిల్లర్ కాదు.. ఇది ప్యూర్ మైండ్ గేమ్

రావు బహదూర్ సినిమా జోనర్ గురించి తాజాగా ఐడిల్ బ్రెయిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఈ సినిమాను చూసేటప్పుడు ఆడియన్స్‌కు ఒక సరికొత్త విజువల్, మెంటల్ ఎక్స్‌పీరియన్స్ దక్కుతుందని ఆయన ప్రామిస్ చేశారు.

"నేను ఈ సినిమా గురించి చెప్పే కంటే ముందుగా జోనర్ లెవెల్‌ లో చెబుతాను. ఇది హారర్ సినిమా కాదు.. అలాగని సస్పెన్స్ థ్రిల్లర్ అంతకన్నా కాదు. ఇది ఒక ప్యూర్ సైకలాజికల్ డ్రామా. అయితే ఇందులో సబ్-జోనర్స్ కింద మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా చాలా పర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేశాం. స్టోరీ పరంగా చూస్తే.. భువనం రామప్ప రావు బహదూర్ అనే ఒక విలక్షణమైన వ్యక్తి లైఫ్ జర్నీని ఈ సినిమాలో చూపించబోతున్నాం" అని వెంకటేష్ మహా స్పష్టం చేశారు.

పుస్తకం చదివిన ఫీలింగ్ కలుగుతుంది

ఈ సినిమాలో సత్యదేవ్ పోషించిన క్యారెక్టరైజేషన్ గురించి వెంకటేష్ మహా మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా మన కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరోల జర్నీకి.. ఈ సినిమాలో భువనం రామప్ప జర్నీకి అస్సలు సంబంధం ఉండదని, పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు.

ఈ క్యారెక్టర్‌కు ఉండే ఒక చిన్న కోరిక లేదా అవసరం చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ.. దానికోసం అతను చేసే ప్రయాణం మాత్రం నెక్స్ట్ లెవెల్ హీరోయిజంతో సాగుతుందన్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన నవలను లేదా పుస్తకాన్ని చదువుతున్నంత ఫీలింగ్ కలుగుతుందని జక్కన్న రేంజ్ లో హామీ ఇచ్చారు. ఒక మనిషి లోపల ఏముంది అనే విషయాన్ని బయటపెట్టి పూర్తిగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశామని, ఇది దాదాపు ఆ క్యారెక్టర్ బయోపిక్ లాగా అనిపిస్తుందని ముగించారు.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్ లాంటి సినిమా కాబోతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్‌డ్ టెక్నికల్ వాల్యూస్, పర్‌ఫెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రా అండ్ రియలిస్టిక్ విజువల్స్ పెద్ద అసెట్ కాబోతున్నాయి. జులై 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సైకలాజికల్ డ్రామా తెలుగు ఆడియన్స్‌కు ఎలాంటి కొత్త అనుభూతిని ఇస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More