Thriller Web Series: ఓటీటీ ప్లాట్‌ఫామ్ లపై క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, హారర్ జానర్లకు కొదవలేదు. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పకడ్బందీగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ థ్రిల్లర్లు చాలా అరుదు. అలాంటి ఒక మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ 'జేఎల్ 50' (JL50).

బాలీవుడ్ విలక్షణ నటుడు అభయ్ డియోల్, దిగ్గజ నటులు పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 4 ఎపిసోడ్ల మినీ సిరీస్ ఒక్కసారి చూడటం మొదలుపెడితే క్లైమాక్స్ వరకు స్క్రీన్ నుంచి కళ్లు తిప్పుకోనివ్వదు. ఐఎండీబీ (IMDb)లో 7.3 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది.
జేఎల్50 అసలు కథేంటి? 35 ఏళ్ల కాలప్రయాణం వెనుక రహస్యం
ఈ వెబ్ సిరీస్ కథ సీబీఐ ఆఫీసర్ శంతను (అభయ్ డియోల్) చుట్టూ తిరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని కొండ ప్రాంతంలో జరిగిన ఒక విమాన ప్రమాద కేసును దర్యాప్తు చేసేందుకు శంతను రంగంలోకి దిగుతాడు.
మొదట అది ఏదైనా ఉగ్రవాదుల హైజాక్ కేసు అని శంతను భావిస్తాడు. కానీ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడుతుంది. ఆ విమానం మరేదో కాదు.. 1984లో కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైన ‘ఫ్లైట్ JL50’ అని తెలుస్తుంది.
విడిపోయిన కాక్‌పిట్‌లో పైలట్ బిహు ఘోష్ (రితికా ఆనంద్), ప్రొఫెసర్ బిస్వజిత్ చంద్ర మిత్రా (పీయూష్ మిశ్రా) మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. తాము 35 ఏళ్లు భవిష్యత్తులోకి వచ్చేశామని తెలిసి పైలట్ బిహు షాక్ అవ్వగా, ప్రొఫెసర్ మిత్రా మాత్రం ఆనందంతో సంబరాలు చేసుకుంటాడు.
ఈ మిస్టరీని ఛేదించేందుకు శంతను క్వాంటమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ సుబ్రతో దాస్ (పంకజ్ కపూర్) సహాయం తీసుకుంటాడు. గత ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన ఒక వార్మ్‌హోల్ ప్రాజెక్ట్ ద్వారా 35 గంటలు భవిష్యత్తులోకి వెళ్లాలని మిత్రా ఆ విమానాన్ని హైజాక్ చేయగా, సాంకేతిక లోపం వల్ల అది ఏకంగా 35 ఏళ్లు ముందుకు వచ్చేసిందని తెలుస్తుంది.
ఊహించని ఎమోషనల్ ట్విస్ట్..
{{/usCountry}}ఈ మిస్టరీని ఛేదించేందుకు శంతను క్వాంటమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ సుబ్రతో దాస్ (పంకజ్ కపూర్) సహాయం తీసుకుంటాడు. గత ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన ఒక వార్మ్‌హోల్ ప్రాజెక్ట్ ద్వారా 35 గంటలు భవిష్యత్తులోకి వెళ్లాలని మిత్రా ఆ విమానాన్ని హైజాక్ చేయగా, సాంకేతిక లోపం వల్ల అది ఏకంగా 35 ఏళ్లు ముందుకు వచ్చేసిందని తెలుస్తుంది.
ఊహించని ఎమోషనల్ ట్విస్ట్..
{{/usCountry}}ఆ విమాన ప్రమాదాన్ని, హైజాక్‌ను ఆపడానికి శంతను, పైలట్ బిహు, ప్రొఫెసర్ దాస్లతో కలిసి తిరిగి 1984లోకి (గతంలోకి) టైమ్ ట్రావెల్ చేస్తాడు. ఈ క్రమంలో శంతనుకు తన గతానికి సంబంధించిన ఒక ఊహించని నిజం తెలుస్తుంది. విమానం పైలట్ బిహు మరెవరో కాదు.. తన కన్నతల్లి అని, తనను చిన్నప్పుడు అనాథాశ్రమంలో వదిలేసిన వ్యక్తి తన తాతయ్య అని తెలుసుకుని శంతను భావోద్వేగానికి గురవుతాడు. మరి గతంలోకి వెళ్లిన శంతను ఆ విమాన ప్రమాదాన్ని ఆపగలిగాడా? లేదా? అనేదే మిగతా కథ.
సినిమాగా మొదలై వెబ్ సిరీస్‌గా మారింది
శైలేంద్ర వ్యాస్ దర్శకత్వం వహించిన 'జేఎల్ 50' వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. నిజానికి దీనిని 2017లోనే ఒక ఫీచర్ ఫిల్మ్ (సినిమా)గా చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత మూడేళ్లకు, 2020లో నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌గా మలచి సోనీ లివ్‌లో విడుదల చేశారు.
విశేషమేమిటంటే, 2003లో వచ్చిన విశాల్ భరద్వాజ్ క్లాసిక్ చిత్రం 'మక్బూల్' తర్వాత, దిగ్గజ నటులు పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ కలిసి నటించారు. నిడివి తక్కువగా ఉండి, కట్టిపడేసే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి 'జేఎల్ 50' ఒక అద్భుతమైన వీకెండ్ ఛాయిస్.