Thriller Web Series: 35 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం నేడు క్రాష్ అయితే.. మైండ్ బ్లాక్ చేసే టైమ్ ట్రావెల్ థ్రిల్లర్

Thriller Web Series: ఉత్కంఠభరితమైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'జేఎల్ 50' (JL50) ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 1984లో కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తర్వాత అదృశ్యమైన విమానం, 35 ఏళ్ల తర్వాత క్రాష్ అవ్వడం, అందులోని ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం అనే ఆసక్తికర పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Published on: Nov 20, 2026, 10:01:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Thriller Web Series: ఓటీటీ ప్లాట్‌ఫామ్ లపై క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, హారర్ జానర్లకు కొదవలేదు. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పకడ్బందీగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ థ్రిల్లర్లు చాలా అరుదు. అలాంటి ఒక మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ 'జేఎల్ 50' (JL50).

Thriller Web Series: కేవలం 4 ఎపిసోడ్ల టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చూస్తే మైండ్ బ్లోయింగ్.. 7.3 రేటింగ్ (imdb)
Thriller Web Series: కేవలం 4 ఎపిసోడ్ల టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చూస్తే మైండ్ బ్లోయింగ్.. 7.3 రేటింగ్ (imdb)

బాలీవుడ్ విలక్షణ నటుడు అభయ్ డియోల్, దిగ్గజ నటులు పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 4 ఎపిసోడ్ల మినీ సిరీస్ ఒక్కసారి చూడటం మొదలుపెడితే క్లైమాక్స్ వరకు స్క్రీన్ నుంచి కళ్లు తిప్పుకోనివ్వదు. ఐఎండీబీ (IMDb)లో 7.3 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది.

జేఎల్50 అసలు కథేంటి? 35 ఏళ్ల కాలప్రయాణం వెనుక రహస్యం

ఈ వెబ్ సిరీస్ కథ సీబీఐ ఆఫీసర్ శంతను (అభయ్ డియోల్) చుట్టూ తిరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని కొండ ప్రాంతంలో జరిగిన ఒక విమాన ప్రమాద కేసును దర్యాప్తు చేసేందుకు శంతను రంగంలోకి దిగుతాడు.

మొదట అది ఏదైనా ఉగ్రవాదుల హైజాక్ కేసు అని శంతను భావిస్తాడు. కానీ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడుతుంది. ఆ విమానం మరేదో కాదు.. 1984లో కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైన ‘ఫ్లైట్ JL50’ అని తెలుస్తుంది.

విడిపోయిన కాక్‌పిట్‌లో పైలట్ బిహు ఘోష్ (రితికా ఆనంద్), ప్రొఫెసర్ బిస్వజిత్ చంద్ర మిత్రా (పీయూష్ మిశ్రా) మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. తాము 35 ఏళ్లు భవిష్యత్తులోకి వచ్చేశామని తెలిసి పైలట్ బిహు షాక్ అవ్వగా, ప్రొఫెసర్ మిత్రా మాత్రం ఆనందంతో సంబరాలు చేసుకుంటాడు.

ఈ మిస్టరీని ఛేదించేందుకు శంతను క్వాంటమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ సుబ్రతో దాస్ (పంకజ్ కపూర్) సహాయం తీసుకుంటాడు. గత ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన ఒక వార్మ్‌హోల్ ప్రాజెక్ట్ ద్వారా 35 గంటలు భవిష్యత్తులోకి వెళ్లాలని మిత్రా ఆ విమానాన్ని హైజాక్ చేయగా, సాంకేతిక లోపం వల్ల అది ఏకంగా 35 ఏళ్లు ముందుకు వచ్చేసిందని తెలుస్తుంది.

ఊహించని ఎమోషనల్ ట్విస్ట్..

ఆ విమాన ప్రమాదాన్ని, హైజాక్‌ను ఆపడానికి శంతను, పైలట్ బిహు, ప్రొఫెసర్ దాస్‌లతో కలిసి తిరిగి 1984లోకి (గతంలోకి) టైమ్ ట్రావెల్ చేస్తాడు. ఈ క్రమంలో శంతనుకు తన గతానికి సంబంధించిన ఒక ఊహించని నిజం తెలుస్తుంది. విమానం పైలట్ బిహు మరెవరో కాదు.. తన కన్నతల్లి అని, తనను చిన్నప్పుడు అనాథాశ్రమంలో వదిలేసిన వ్యక్తి తన తాతయ్య అని తెలుసుకుని శంతను భావోద్వేగానికి గురవుతాడు. మరి గతంలోకి వెళ్లిన శంతను ఆ విమాన ప్రమాదాన్ని ఆపగలిగాడా? లేదా? అనేదే మిగతా కథ.

సినిమాగా మొదలై వెబ్ సిరీస్‌గా మారింది

శైలేంద్ర వ్యాస్ దర్శకత్వం వహించిన 'జేఎల్ 50' వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. నిజానికి దీనిని 2017లోనే ఒక ఫీచర్ ఫిల్మ్ (సినిమా)గా చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత మూడేళ్లకు, 2020లో నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌గా మలచి సోనీ లివ్‌లో విడుదల చేశారు.

విశేషమేమిటంటే, 2003లో వచ్చిన విశాల్ భరద్వాజ్ క్లాసిక్ చిత్రం 'మక్బూల్' తర్వాత, దిగ్గజ నటులు పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ కలిసి నటించారు. నిడివి తక్కువగా ఉండి, కట్టిపడేసే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి 'జేఎల్ 50' ఒక అద్భుతమైన వీకెండ్ ఛాయిస్.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More