...
...
Next Story

సెల్ఫీ తీసుకోబోయిన అభిమాని.. చేతుల్లో నుంచి మొబైల్ లాక్కొన్న షారుక్ ఖాన్.. తీవ్ర విమర్శలు

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓ అభిమాని తనతో సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లగా.. అతని చేతుల్లో నుంచి మొబైల్ లాక్కున్న వీడియో వైరల్ కావడంతో పలువురు షారుక్ ను విమర్శిస్తున్నారు.

Published on: Jan 19, 2026, 22:01:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల రియాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘జాయ్ అవార్డ్స్ 2026’ కార్యక్రమానికి వెళ్లాడు. ఈ ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందులో ఓ అభిమానితో కింగ్ ఖాన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్టేజ్ మీద సెల్ఫీ.. షారుఖ్ ఏం చేశాడంటే?

సెల్ఫీ తీసుకోబోయిన అభిమాని.. చేతుల్లో నుంచి మొబైల్ లాక్కొన్న షారుక్ ఖాన్.. తీవ్ర విమర్శలు
సెల్ఫీ తీసుకోబోయిన అభిమాని.. చేతుల్లో నుంచి మొబైల్ లాక్కొన్న షారుక్ ఖాన్.. తీవ్ర విమర్శలు

వైరల్ అవుతున్న వీడియోలో.. షారుక్ ఖాన్ వేదికపై ఉండగా అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ తీసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. వెంటనే షారుక్ నవ్వుతూ ఆ వ్యక్తి చేతిలోని ఫోన్‌ను సున్నితంగా పక్కకు తీసి, ఎదురుగా ఉన్న ప్రొఫెషనల్ కెమెరామెన్ వైపు చూడమని సైగ చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ట్రోఫీ అందించి, అధికారిక ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ ఫోటోలకు పోజులిచ్చాడు. మరో వ్యక్తి కూడా సెల్ఫీకి ప్రయత్నించగా, షారుక్ అతన్ని కూడా కెమెరా వైపు చూడమని సూచించాడు.

అహంకారమా? ప్రోటోకాలా?

షారుక్ ఖాన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది షారుక్ అహంకారం అని విమర్శిస్తుంటే, మెజారిటీ నెటిజన్లు మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.

"అవార్డు తీసుకునేటప్పుడు స్టేజ్ మీద సెల్ఫీలు దిగడం పద్ధతి కాదు. అక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వారి వైపు చూస్తేనే మంచి ఫోటోలు వస్తాయి. షారుక్ కేవలం ప్రోటోకాల్ పాటించారు. ఆ వ్యక్తికి కూడా అదే నేర్పించారు" అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

"ఆస్కార్ లేదా ఐఫా వంటి పెద్ద వేదికలపై ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటారా? షారుక్ తన విధిని నిర్వర్తించారు అంతే" అని మరికొందరు సమర్థిస్తున్నారు.

జాయ్ అవార్డ్స్ సందడి..

షారుక్ ఖాన్ తదుపరి మూవీ ‘కింగ్’ (King). సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారుక్ కూతురు సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe