...
...
Next Story

Shah Rukh Khan: నాగ పంచమి రోజే షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌లో 8 అడుగుల పాములు ప్రత్యక్షం.. అర్ధరాత్రి దాకా సెర్చ్ ఆపరేషన్

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ నివాసం ఉండే మన్నత్ లోకి నాగ పంచమి రోజే రెండు పాములు రావడం కలకలం రేపింది. అయితే వీటిలో ఒకదానికి రెస్క్యూ టీమ్ పట్టుకోగా.. మరొకటి తప్పించుకొని పారిపోయింది.

Published on: Aug 18, 2026, 15:50:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Shah Rukh Khan: నాగ పంచమి పండగ రోజే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బంగ్లా 'మన్నత్' దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన ఈ పండగ రోజు రాత్రి షారుఖ్ ఐకానిక్ బంగ్లాలో ఏకంగా రెండు 8 అడుగుల భారీ పాములు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం హీటెక్కింది.

అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్.. మెట్ల మధ్యలో భారీ పాము

Shah Rukh Khan: నాగ పంచమి రోజే షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌లో 8 అడుగుల పాములు ప్రత్యక్షం.. అర్ధరాత్రి దాకా సెర్చ్ ఆపరేషన్
Shah Rukh Khan: నాగ పంచమి రోజే షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌లో 8 అడుగుల పాములు ప్రత్యక్షం.. అర్ధరాత్రి దాకా సెర్చ్ ఆపరేషన్

ఆగస్టు 17 సోమవారం రాత్రి 8 గంటల సమయంలో షారుఖ్ ఖాన్ కు చెందిన మన్నత్ ప్రాపర్టీలోని మెట్ల కింద భాగంలో పనిచేసే సిబ్బంది ఈ పాములను చూశారు. రెండు భారీ పాములు తిరుగుతుండటంతో భయపడిపోయిన పనివాళ్లు వెంటనే వైల్డ్‌లైఫ్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. దీంతో స్పాట్‌కు చేరుకున్న రెస్క్యూ టీమ్ మన్నత్ కాంపౌండ్‌లో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది.

గంటల తరబడి శ్రమించిన రెస్క్యూ టీమ్ ఎనిమిది అడుగుల పొడవున్న ఒక భారీ పామును సురక్షితంగా పట్టుకుంది. అయితే చీకటి కావడంతో రెండో పాము తప్పించుకుని వెళ్లిపోయింది. దాన్ని పట్టుకోవడానికి అర్ధరాత్రి వరకు రెస్క్యూ సిబ్బంది గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పాములను జెర్రిపోతు (ధామన్ / రాట్ స్నేక్) జాతికి చెందినవిగా టీమ్ కన్ఫర్మ్ చేసింది. ఇవి విషపూరితం కాకపోయినా.. అంత పెద్ద సైజులో ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది కాసేపు షాక్‌కు గురయ్యారు.

మన్నత్‌ రెనోవేషన్.. షారుఖ్ ఫ్యామిలీ ఎక్కడుంది?

గత ఏడాది కాలంగా షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నత్‌లో రీమోడలింగ్, రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. బిల్డింగ్ స్పేస్‌ను మరింత పెంచేందుకు షారుఖ్ పెద్ద ఎత్తున కన్‌స్ట్రక్షన్ వర్క్ ప్లాన్ చేశారు.

ఇక షారుఖ్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ బాద్‌షా వరుస పెద్ద ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన షారుఖ్.. ఇప్పుడు 'కింగ్' (King) సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌లో బిగ్ స్క్రీన్లపైకి రానున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. వీళ్లతో పాటు దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ, జైదీప్ అహ్లావత్, అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe