రజనీకాంత్‌తో చేతులు కలపనున్న షారుక్ ఖాన్.. బాలీవుడ్ నటుడి కామెంట్స్‌తో బజ్

రజనీకాంత్ తో కలిసి షారుక్ ఖాన్ నటించబోతున్నాడా? జైలర్ 2 మూవీలో ఈ అరుదైన కలయిక సాధ్యం కానుందా? తాజాగా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. అతడు ఏమన్నాడో చూడండి.

Published on: Dec 25, 2025, 16:27:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘జైలర్ 2’ గురించి ఒక సెన్సేషనల్ వార్త బయటకొచ్చింది. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించే ఛాన్స్ ఉందంటూ వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి హింట్ ఇచ్చాడు. అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ వార్తతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

రజనీకాంత్‌తో చేతులు కలపనున్న షారుక్ ఖాన్.. బాలీవుడ్ నటుడి కామెంట్స్‌తో బజ్
రజనీకాంత్‌తో చేతులు కలపనున్న షారుక్ ఖాన్.. బాలీవుడ్ నటుడి కామెంట్స్‌తో బజ్

రజనీతో షారుక్

తలైవా రజనీకాంత్ మళ్లీ 'టైగర్ ముత్తువేల్ పాండ్యన్'గా బాక్సాఫీస్ వేట మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలున్న 'జైలర్ 2'లో షారుక్ ఖాన్ కూడా ఉంటాడన్న వార్త ఇప్పుడు ఆ అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లింది. దీనికి కారణమైన వార్త ఏంటో ఇక్కడ చూడండి.

మిథున్ చక్రవర్తి హింట్.. ఫ్యాన్స్ డీకోడింగ్

ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి మెయిన్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా అతని మాటల మధ్యలో షారుక్ ఖాన్ గురించి ఒక చిన్న హింట్ వదిలాడట.

మేకర్స్ ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినా.. మిథున్ మాటలను పట్టుకుని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. రజనీ, షారుక్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ కాంబినేషన్ అవుతుంది.

సినిమాలో స్టార్లే స్టార్లు

కేవలం షారుక్ మాత్రమే కాదు, ఈ జైలర్ సీక్వెల్‌లో నటించబోయే స్టార్స్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ మూవీలో ఎవరెవరు ఉండే అవకాశం ఉందో చెబుతూ ఓ లిస్ట్ బయటకు వచ్చింది.

ఇందులో మోహన్‌లాల్ (మలయాళం), శివరాజ్‌కుమార్ (కన్నడ), విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య, సంతానం, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడులాంటి స్టార్ నటీనటులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

మొదటి పార్ట్ లాగే.. ఈ సీక్వెల్‌లో కూడా పాన్ ఇండియా స్టార్స్ అందరికీ బలమైన పాత్రలు, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్లు ఉంటాయని తెలుస్తోంది.

నెల్సన్ ముందున్న సవాల్

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మొదటి పార్ట్‌లో మాస్ ఎలిమెంట్స్‌ని, తనదైన డార్క్ కామెడీని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు. ఇప్పుడు ఇంతమంది స్టార్లను హ్యాండిల్ చేయడం అతనికి పెద్ద సవాల్. అయితే కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. బలమైన కథ, పవర్ పాలిటిక్స్, మైండ్ గేమ్స్ ఈసారి ఎక్కువగా ఉంటాయట. మిథున్ చక్రవర్తి విలనిజం కూడా చాలా కొత్తగా ఉండబోతోందని టాక్.

ఒకవేళ షారుక్ ఖాన్ ఎంట్రీ నిజమైతే.. 'జైలర్ 2' కేవలం సినిమాగా కాకుండా ఒక 'సినిమాటిక్ ఈవెంట్' లా మారుతుందనడంలో సందేహం లేదు. జైలర్ మూవీ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకుపైగానే వసూలు చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More