Shakila Venumadhav:వేణుమాధ‌వ్‌తో బెడ్‌పై ష‌కీలా.. లైట్స్ ఆఫ్.. హస్కీ వాయిస్‌తో ఏం అడిగాడో తెలుసా? షకీలా వైరల్ కామెంట్స్

Shakila Venumadhav: సీనియర్ నటి షకీలా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో వేణు మాధవ్ తో కలిసి ఒకే బెడ్ మీద పడుకోవడం, ఆ రాత్రి అతను ఏం అడిగాడనే విషయాలను షకీలా చెప్పింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Aug 4, 2026, 13:49:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shakila Venumadhav: దివంగత వేణు మాధవ్ తన కామెడీతో కోట్లాది జనాలను నవ్వించారు. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా.. సినిమాల్లో పాత్రల ద్వారా వేణు మాధవ్ ఎప్పటికీ బతికే ఉంటారు. తాజాగా వేణు మాధవ్ గురించి షకీలా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

వేణుమాధ‌వ్‌తో బెడ్‌పై ష‌కీలా.. లైట్స్ ఆఫ్.. హస్కీ వాయిస్‌తో ఏం అడిగాడో తెలుసా? షకీలా వైరల్ కామెంట్స్
వేణుమాధ‌వ్‌తో బెడ్‌పై ష‌కీలా.. లైట్స్ ఆఫ్.. హస్కీ వాయిస్‌తో ఏం అడిగాడో తెలుసా? షకీలా వైరల్ కామెంట్స్

వేణు మాధవ్ గదికి

తాజాగా వేణు మాధవ్ గురించి షకీలా మాట్లాడిన పాత వీడియో వైరల్ అవుతోంది. ‘‘పడుకోవడానికి వేణు మాధవ్ రూమ్ కు వస్తానని అడిగా. సరే రా అమ్మ అన్నాడు. అక్కడ ఒక బెడ్ ఉంది. నేను, నా పక్కన వేణు మాధవ్, అతని పక్కన అసిస్టెంట్ పడుకున్నాం’’ అని షకీలా చెప్పుకొచ్చింది.

ఏదైనా తప్పుగా

‘‘కాసేపు అయిన తర్వాత టీవీ లైట్ లో ఏదో షాడోలాగా కనిపించింది. ఏదో డిస్టర్బెన్స్ గా అనిపించింది. ‘నేను ఒక మాట అడుగుతా ఒప్పుకుంటావా?’ అని వేణు మాధవ్ అడిగాడు. ఫ్రెండ్ అని వెళ్లా. ఏదైనా తప్పుగా అడిగితే మాత్రం ఆ ఫ్రెండ్ షిప్ ఉండదని అనుకున్నా’’ అని షకీలా తెలిపింది.

హస్కీ వాయిస్ తో

‘‘సరే అడిగి చావు అని అన్నా. నిజంగా, ఒప్పుకోను అని చెప్పకూడదని హస్కీ వాయిస్ తో అడిగాడు. లైట్స్ ఆఫ్ కు తోడు ఆ హస్కీ వాయిస్ వచ్చింది. నీ ప్రాబ్లెం ఏంటిరా? చెప్పు అని అడిగా. నాకు, అతనికి మధ్య దిండ్లు పెడుతున్నాడు. ఎందుకు ఇదంతా? అని అడిగా.

‘ఏం లేదు. నాకు పెళ్లయి ఇద్దరు బిడ్డలున్న సంగతి తెలుసు కదా’ అని అన్నాడు. హా.. తెలుసు అని చెప్పా. ‘వాళ్లు బాగుండాలంటే నేను బతికుండాలి. నువ్వు పడుకున్నాక కాలు నా మీద వేస్తావేమోనని ముందే చెప్తున్నా’ అని అన్నాడు. నేను నైట్ అంతా నవ్వా. తర్వాతి రోజు కూడా రఘు, బ్రహ్మానందానికి చెప్పి నవ్వా’’ అని షకీలా చెప్పింది.

కలిసి చేసిన సినిమాలు

షకీలా, వేణు మాధవ్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. తమ కెమిస్ట్రీతో కామెడీ ట్రీట్ అందించారు. బంగారం, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, దొంచ సచ్చినోళ్లు తదితర సినిమాల్లో షకీలా, వేణు మాధవ్ కలిసి నటించారు.

సినిమాల్లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. షూటింగ్స్ సమయంలో వేణు మాధవ్ ఎంతో సరదాగా ఉండేవారని షకీలా చాలా సార్లు గుర్తు చేసుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More