Bhogi Climax: భోగి క్లైమాక్స్ షూటింగ్.. 22 రోజులు.. 800 మంది జూనియర్ ఆర్టిస్టులు.. శర్వానంద్ మూవీ రచ్చ
Bhogi Climax: శర్వానంద్ లీడ్ రోల్లో నటిస్తున్న భోగి మూవీ గురించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఆగస్ట్ 18న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ క్లైమాక్స్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ షూటింగ్ అప్డేటే ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతోంది.
Bhogi Climax: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా నుంచి మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఏకంగా 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో 22 రోజుల పాటు నాన్ స్టాప్‌గా సాగిన భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను మేకర్స్ సక్సెస్‌ఫుల్ గా కంప్లీట్ చేశారు. పక్కా ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్‌తో రూపొందిన ఈ సీక్వెన్స్ థియేటర్లలో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.

3 నెలల ప్రీ-ప్రొడక్షన్.. 800 మందితో క్లైమాక్స్ ఫైట్!
ఈ భోగి సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నే నేతృత్వంలో దాదాపు మూడు నెలల పాటు శ్రమించి ఒక భారీ విలేజ్ సెట్ వేశారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చాలా రియలిస్టిక్‌గా డిజైన్ చేశారు.
శర్వానంద్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో, ఇంటెన్స్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో ఈ ఫైట్ సీన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ కె.కె. రాధామోహన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సీక్వెన్స్‌ను నిర్మించారు.
1960ల పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్.. తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్ కథ
'భోగి' సినిమా కథాంశం 1960వ దశకం ఆరంభంలో సాగుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక ఊహాజనిత గ్రామంలో నడిచే రా అండ్ రస్టిక్ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
గతంలో 'రచ్చ', 'బెంగాల్ టైగర్', 'సీటీమార్' లాంటి మాస్ బ్లాక్‌బస్టర్లను అందించిన సంపత్ నంది.. ఈసారి శర్వానంద్ మార్క్ ఎమోషన్స్‌కు తనదైన మాస్ ఎలివేషన్స్ తోడు చేసి ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు.
అనుపమ, డింపుల్ హయాతి గ్లామర్.. భీమ్స్ మాస్ మ్యూజిక్
ఈ సినిమాలో శర్వానంద్ సరసన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, గ్లామరస్ యాక్ట్రెస్ డింపుల్ హయాతి ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి క్యారెక్టర్లు కథలో చాలా కీలకమైన మలుపులు తిప్పుతాయని తెలుస్తోంది.
ఇక మాస్ పాటలకు, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా 'ధమాకా', 'తిలక్' లాంటి సినిమాలతో చార్ట్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన భీమ్స్, 'భోగి' కోసం కూడా మైండ్ బ్లాకింగ్ ఆడియో ట్రాక్స్ సిద్ధం చేసినట్లు సమాచారం.
ఆగస్టు 28న పాన్-ఇండియా గ్రాండ్ రిలీజ్
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.
నారీ నారీ నడుమ మురారి, బైకర్ సినిమాలతో ఈ ఏడాది రెండు వరుస హిట్స్ కొట్టిన తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అపారమైన అంచనాలు నెలకొన్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


