Bhogi Raksha Bandhan Poster: గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు.. రక్షా బంధన్ సెంటిమెంట్‌తో శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Bhogi Raksha Bandhan Poster: శర్వానంద్ మూవీ భోగి నుంచి రాఖీ పండుగ సందర్భంగా వచ్చిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. అక్కచెల్లెళ్ల సెంటిమెంట్ తో ఈ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో శర్వా తాటి ముంజలు తింటూ కనిపించారు.

Published on: Aug 28, 2026, 13:32:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhogi Raksha Bandhan Poster: హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' (Bhogi) థియేట్రికల్ రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ వాయిదా పడినా, రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Bhogi Raksha Bandhan Poster: గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు.. రక్షా బంధన్ సెంటిమెంట్‌తో శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్
Bhogi Raksha Bandhan Poster: గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు.. రక్షా బంధన్ సెంటిమెంట్‌తో శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

"గంగ ఒక్కడే... ప్రాణాలు ఐదు" - రాఖీ స్పెషల్ పోస్టర్ తెచ్చిన జోష్

రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్ర యూనిట్ వదిలిన స్పెషల్ పోస్టర్ ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటోంది. "గంగ ఒక్కడే... ప్రాణాలు ఐదు" అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో శర్వానంద్ తన ఐదుగురు అక్కాచెల్లెళ్ల మధ్య కూర్చుని తాటి ముంజలు తింటూ ఎంతో సంతోషంగా గడుపుతుండటం చూడొచ్చు.

అక్కాచెల్లెళ్ల అనురాగం, ఫ్యామిలీ బాండింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ పిక్ 'భోగి' సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో క్లియర్ గ్లింప్స్ ఇచ్చింది. మాస్ యాక్షన్ మూవీగా ప్రచారం పొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

రిలీజ్ వాయిదా వెనుక అసలు కారణం ఇదే

ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రావలసిన 'భోగి' వాయిదా పడటానికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ అని మేకర్స్ స్పష్టం చేశారు. 1960ల కాలం నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక గ్రామ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది.

ఆ నాటి విజువల్ స్కేల్, పీరియడ్ వాతావరణం బిగ్ స్క్రీన్‌పై గ్రాండ్‌గా కనిపించేలా చేయడానికి చిత్ర బృందం అదనపు సమయం తీసుకుంటోంది. విజువల్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్, డైరెక్టర్ సంపత్ నంది రిలీజ్ డేట్‌ను వెనక్కి నెట్టారు. త్వరలోనే సరికొత్త వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

సంపత్ నంది - శర్వానంద్ కాంబో.. పాన్-ఇండియా రేంజ్ హంగామా

'రచ్చ', 'బెంగాల్ టైగర్', 'సీటీమార్' లాంటి మాస్ సినిమాలను అందించిన సంపత్ నంది.. ఈసారి శర్వానంద్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామాను డిజైన్ చేశారు. 'శర్వా-సంపత్ బ్లడ్ ఫెస్ట్' అనే టాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఫస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శర్వానంద్ గతంలో చేసిన 'మహా సముద్రం', 'ఒకే ఒక జీవితం', 'మనమే' సినిమాల కంటే డిఫరెంట్ రోల్‌లో ఇందులో కనిపించబోతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై లక్ష్మి రాధామోహన్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.

శర్వానంద్ ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్ సినిమాలు అందించాడు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి, ఆ తర్వాత బైకర్ సినిమాలతో శర్వా తన రేంజ్ ఏంటో చూపించాడు. భోగితో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More