Shraddha Kapoor Weight Gain: 8 కిలోల గజ్జెలు, కాలికి గాయం.. ఏకంగా 12 కిలోలు బరువు పెరిగిన శ్రద్ధా కపూర్!

Shraddha Kapoor Weight Gain Injury: హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన కొత్త చిత్రం ఈఠా కోసం ఏకంగా 10 నుంచి 12 కిలోల బరువు పెరిగారు. క్లైమాక్స్ పాట చిత్రీకరణ సమయంలో కాలికి తీవ్ర గాయమైనా పట్టుదలతో పూర్తి చేశారని కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ చెప్పారు. ఈ సినిమా వెనుక శ్రద్ధా పడిన కష్టంపై ఆసక్తికర విషయాలు ఇవే.

Published on: Nov 27, 2026, 22:02:32 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Shraddha Kapoor Weight Gain Injury: పాత్రకు ప్రాణం పోసేందుకు కొందరు నటీనటులు ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. ఇటీవల 'స్త్రీ 2'తో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

8 కిలోల గజ్జెలు, కాలికి గాయం.. ఏకంగా 12 కిలోలు బరువు పెరిగిన శ్రద్ధా కపూర్!
8 కిలోల గజ్జెలు, కాలికి గాయం.. ఏకంగా 12 కిలోలు బరువు పెరిగిన శ్రద్ధా కపూర్!

క్లైమాక్స్ పాట కోసం

మహారాష్ట్ర జానపద కళారూపాలైన 'తమాషా', 'లావణి' దిగ్గజ కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణగావ్‌కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'ఈఠా' (Eetha) చిత్రంలో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈఠా సినిమా క్లైమాక్స్ పాట కోసం శ్రద్ధా పడిన శ్రమ గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

క్లైమాక్స్ పాట కోసం 12 కిలోల బరువు పెరిగిన నటి

ఈఠా సినిమాలోని పాత్ర స్వభావానికి అనుగుణంగా శ్రద్ధా కపూర్ ఏకంగా 10 నుంచి 12 కిలోల బరువు పెరిగారని వైభవి మర్చంట్ తెలిపారు. సాధారణంగా హీరోయిన్లు నాజూకుగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటే, పాత్ర డిమాండ్ మేరకు ఆమె బరువు పెరగడం విశేషం.

"దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ సినిమాను రివర్స్ ఆర్డర్‌లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా సెకండాఫ్, క్లైమాక్స్ పాటను షూట్ చేశాం. అప్పటికే ఆ పాత్ర కోసం శ్రద్ధా సుమారు 10 నుంచి 12 కిలోల బరువు పెరిగారు. అదనపు బరువుతో వేగంగా స్టెప్పులు వేయడం వల్ల మోకాళ్లు, పిక్కలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. స్టామినా కూడా తగ్గుతుంది. అయినా గంటగంటకూ కఠినమైన రిహార్సల్స్, కండిషనింగ్ చేస్తూ ముందుకు సాగాం" అని వైభవి వివరించారు.

ఎండ వేడికి కాలికి తీవ్ర గాయం.. రెండు నెలలు విరామం

క్లైమాక్స్ పాట షూటింగ్ రెండో రోజున శ్రద్ధా కపూర్ తీవ్రంగా గాయపడ్డారని వైభవి గుర్తుచేసుకున్నారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు ఈ ప్రమాదం జరిగింది. పగటిపూట ఎండ తీవ్రత వల్ల వేడెక్కిన నేలపై చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడం వల్ల రాపిడి ఏర్పడి ఆమె కాలికి గాయమైంది.

"ఆ ఘటనతో యూనిట్ సభ్యులందరిలో ఆందోళన మొదలైంది. ఆరు వారాల నుంచి రెండు నెలల పాటు విరామం తీసుకుని, కఠినమైన ఫిజియోథెరపీ తర్వాత శ్రద్ధా మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసే ప్రతి లావణి పాటకు ముందు, తర్వాత వార్మ్-అప్, కూల్-డౌన్, ఫిజియో ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాం" అని వైభవి మర్చంట్ పేర్కొన్నారు.

ఒక్కో కాలికి 4 కిలోల గజ్జెలతో 25 రోజుల సాధన

అంతకుముందు పుణెలో జరిగిన 'జీ జీ రే జీ' పాట విడుదల కార్యక్రమంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ సైతం శ్రద్ధా అంకితభావాన్ని కొనియాడారు. లావణి నృత్యంలోని లోతులను అర్థం చేసుకునేందుకు ఆమె ఎంతో కష్టపడ్డారని చెప్పారు.

"ప్రతి పాట కోసం శ్రద్ధా ఒక్కో కాలికి 4 కిలోల చొప్పున మొత్తం 8 కిలోల గజ్జెలు కట్టుకుని రోజుకు 8 గంటల పాటు 25 రోజులు రిహార్సల్స్ చేశారు. దాంతో ఆమె పాదాలు వాచిపోయేవి. తొలిరోజు షూటింగ్ బాగానే జరిగింది. కానీ రెండో రోజు కండరాలు చిరగడంతో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది" అని ఉటేకర్ తెలిపారు.

డిసెంబర్ 4న థియేటర్లలోకి 'ఈఠా'

మహారాష్ట్ర సాంప్రదాయ నృత్య కళల నేపథ్యంలో సాగే 'ఈఠా' చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణ్‌దీప్ హుడా, మహ్మద్ జీషన్ అయూబ్, సిద్ధార్థ్ జాదవ్, ఇష్తియాక్ ఖాన్, అనంత్ జోషి కీలక పాత్రల్లో నటించారు. నిజ జీవిత కళాకారిణి స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శ్రద్ధా కపూర్ కెరీర్‌లోనే ఇది అత్యంత సవాలుతో కూడిన పాత్రగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.