స్టేజ్‌పైనే కాన్పు.. రాయితో బొడ్డుతాడు కోసి- ప్రెగ్నెంట్‌గా శ్రద్ధా కపూర్ నటన హైలెట్- రష్మిక మూవీ థియేటర్‌లో ఈత టీజర్!

Shraddha Kapoor Eetha Teaser Released: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన బయోపిక్ చిత్రం ‘ఈత’ (Eetha) ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. నృత్య ప్రదర్శన ఇస్తూ స్టేజ్ పైనే ప్రసవ వేదన అనుభవించి, బిడ్డకు జన్మనిచ్చిన ఒక వీర వనిత కథలో శ్రద్ధా నటన నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.

Published on: Jun 19, 2026, 13:31:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shraddha Kapoor Eetha Teaser Released: 'స్త్రీ 2' లాంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్ మరో అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితరాలైన శ్రద్ధా కపూర్.. తాజాగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఈత’ (Eetha).

స్టేజ్‌పైనే కాన్పు.. రాయితో బొడ్డుతాడు కోసి- ప్రెగ్నెంట్‌గా శ్రద్ధా కపూర్ నటన హైలెట్- రష్మిక మూవీ థియేటర్‌లో ఈత టీజర్! (X)
స్టేజ్‌పైనే కాన్పు.. రాయితో బొడ్డుతాడు కోసి- ప్రెగ్నెంట్‌గా శ్రద్ధా కపూర్ నటన హైలెట్- రష్మిక మూవీ థియేటర్‌లో ఈత టీజర్! (X)

రష్మిక మూవీ థియేటర్లలో

లక్ష్మణ్ ఉటేక‌ర్ పర్యవేక్షణలో రాహుల్ మోడీ తెరకెక్కిస్తున్న ఈత సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను రష్మిక మందన్నా'కాక్‌టెయిల్ 2' సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జూన్ 19న అంటే ఇవాళ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈత టీజర్ చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు శ్రద్ధా కపూర్ నటనకు, ఆమె చూపించిన అంకితభావానికి ఫిదా అవుతున్నారు.

ఒళ్లు గగుర్పొడిచే టీజర్.. అసలు కథేంటంటే?

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి, తమాషా జానపద నృత్య కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గాంకర్ యథార్థ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 1940 నుంచి 1990 వరకు ఆమె జీవితంలో సాగిన కళా ప్రస్థానం, ఎదుర్కొన్న తీవ్రమైన పోరాటాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

గర్భవతిగా ఉండి

తాజాగా వైరల్ అవుతున్న ఈత టీజర్‌లో శ్రద్ధా కపూర్ గర్భవతిగా ఉండి స్టేజ్ పైన నిండుగా అలంకరించుకుని నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది. డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలవుతుంది. అయినప్పటికీ కళపై ఉన్న అపారమైన గౌరవంతో ప్రదర్శనను ఆపకుండా పూర్తి చేస్తుంది.

ఆ వెంటనే బ్యాక్‌స్టేజ్‌కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి, అక్కడ దొరికిన ఒక పదునైన రాయితోనే స్వయంగా బొడ్డుతాడును కోసేసుకుంటుంది. ఆ రక్తాన్ని తుడ్చుకుని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్లీ స్టేజ్ పైకి వచ్చి చిరునవ్వుతో డ్యాన్స్ కంటిన్యూ చేస్తుంది. ఈ హృదయ విదారక, ఉద్వేగభరిత సీన్ థియేటర్లలో చూసిన వారందరినీ షాక్‌కు గురిచేయడమే కాకుండా కళ్లవెంట నీళ్లు తెప్పిస్తోంది.

నెటిజన్ల ప్రశంసల జల్లు

థియేటర్లలో ఈత టీజర్ చూసిన ప్రేక్షకులు ఆ క్లిప్పింగ్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ శ్రద్ధా కపూర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఈత టీజర్ అద్భుతంగా ఉంది. లక్ష్మణ్ ఉటేక‌ర్ చేతిలో మరో బ్లాక్‌బస్టర్ సినిమా పడినట్లే. శ్రద్ధా కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్, రిచ్ విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి" అని ఒక నెటిజన్ ఎక్స్‌ (ట్విట్టర్)లో కొనియాడారు.

"ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం, టీజర్ చూస్తుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి" అంటూ మరికొందరు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు.

పాత్ర కోసం 15 కిలోల బరువు.. షూటింగ్‌లో గాయం

ఈ పవర్‌ఫుల్ బయోపిక్ కోసం శ్రద్ధా కపూర్ ప్రాణం పెట్టి పనిచేసింది. విఠాబాయి యువతిగా ఉన్నప్పటి పాత్రలో పర్‌ఫెక్ట్‌గా సరిపోవడం కోసం శ్రద్ధా కపూర్ ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది. నౌవారి చీర కట్టుకుని, భారీ ఆభరణాలు ధరించి అజయ్-అతుల్ సంగీత దర్శకత్వంలో వచ్చే ఒక వేగవంతమైన లావణి జానపద నృత్యం చేస్తున్న సమయంలో శ్రద్ధా తీవ్రమైన గాయానికి గురైంది.

దోల్కి దరువులకు తగినట్లుగా వేగంగా స్టెప్పులు వేసే క్రమంలో బరువంతా ఎడమ కాలిపై పడటంతో బ్యాలెన్స్ తప్పి కండరాలకు గాయమైంది (Muscle Tear). అప్పట్లో ఈ గాయంపై శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "టెర్మినేటర్ లాగా నడుస్తున్నా. కండరాల గాయం అయింది కానీ త్వరలోనే తగ్గిపోతుంది. కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మామూలు మనిషిని అయిపోతాను" అని సరదాగా పోస్ట్ పెట్టింది.

ఈత రిలీజ్ డేట్

కాగా, ఈ ప్రతిష్టాత్మక ఈత చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణదీప్ హుడా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాఖీ పండుగ కానుకగా ఆగస్టు 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More