...
...
Next Story

అందుకే ఈ సినిమాలో కిస్ సీన్లు పెట్టలేదు.. ఇంటర్వెల్ సీన్ చాలా ఫీలింగ్ కలుగుతుంది: సిద్దూ జొన్నలగడ్డ కామెంట్స్

సిద్దూ జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన నెక్ట్స్ మూవీ తెలుసు కదాలో కిస్ సీన్లు అస్సలు లేవని, ఇందులో ఫిజికల్ ఇంటిమసీ కంటే ఎమోషనల్ ఇంటిమసీ ఉంటుందని చెప్పాడు. ఇంటర్వెల్ సీన్ లో చాలా ఫీలింగ్ కలుగుతుందని తెలిపాడు.

Published on: Oct 13, 2025, 21:28:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన నెక్ట్స్ మూవీ తెలుసు కదా. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సోమవారం (అక్టోబర్ 13) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రొమాంటిక్ మూవీ అయినా కూడా ఇందులో ఒక్క కిస్ సీన్ కూడా లేదని అతడు అనడం విశేషం.

ఫిజికల్ ఇంటమసీ కాదు..

అందుకే ఈ సినిమాలో కిస్ సీన్లు పెట్టలేదు.. ఇంటర్వెల్ సీన్ చాలా ఫీలింగ్ కలుగుతుంది: సిద్దూ జొన్నలగడ్డ కామెంట్స్
అందుకే ఈ సినిమాలో కిస్ సీన్లు పెట్టలేదు.. ఇంటర్వెల్ సీన్ చాలా ఫీలింగ్ కలుగుతుంది: సిద్దూ జొన్నలగడ్డ కామెంట్స్

సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ తెలుసు కదా. సిద్దూ నటించిన చివరి సినిమా జాక్ దారుణంగా బోల్తా కొట్టిన నేపథ్యంలో అతడు ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ తెలుసు కదా సినిమా గురించి ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు చాలానే ఉన్నట్లున్నాయి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.

దీనికి సిద్దూ జొన్నలగడ్డ స్పందిస్తూ.. రొమాంటిక్ మూవీ అయినప్పుడు ఉంటాయి కదా అని మొదట స్పందించాడు. కానీ ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. నిజానికి ఇందులో ఒక్క కిస్ సీన్ కూడా లేదని చెప్పడంతో అక్కడి ఆడియెన్స్ అరిచారు. సినిమాను ప్రారంభించే సమయంలోనే నీరజ దగ్గరికి వెళ్లి ఇందులో కిస్ సీన్లు ఉండొద్దని చెప్పినట్లు సిద్దూ వెల్లడించాడు. ఈ సినిమాలో ఫిజికల్ ఇంటిమసీ కంటే ఎమోషనల్ ఇంటిమసీ ఎక్కువని చెప్పాడు. ఒక్క కిస్ సీన్ లేకపోయినా.. ఇంటర్వెల్ సీన్ లో మీకు చాలా ఎక్కువ ఫీలింగ్ కలుతుందని సిద్దూ చెప్పాడు.

ఇక మరో జర్నలిస్ట్ స్పందిస్తూ.. ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు అని ప్రశ్నించారు. దీనికి సిద్దూ స్పందిస్తూ.. ఇది కేవలం రెండో సినిమానే అని, టిల్లూ స్క్వేర్ లో కాసేపు మాత్రమే ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అన్నాడు.

తెలుసు కదా మూవీ గురించి..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe