Siddu Jonnagadda Web Series: సిద్దూ జొన్నలగడ్డతో వెబ్ సిరీస్‌పై వెంకీ అట్లూరీ క్రేజీ అప్డేట్.. బ్యాంక్ హైస్ట్ స్టోరీతో..

Siddu Jonnagadda Web Series: వెంకీ అట్లూరి, సిద్దూ జొన్నలగడ్డ వెబ్ సిరీస్ పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న వెంకీ.. తాజా ఇంటర్వ్యూలో తన నెక్ట్స్ వెబ్ సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Published on: Aug 8, 2026, 08:44:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Siddu Jonnagadda Web Series: 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఓటీటీ వెబ్ సిరీస్‌పై ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సిద్దూ జొన్నలగడ్డ, క్యూట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ వెబ్ సిరీస్‌పై డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా స్పందిస్తూ రిలీజ్ టైమ్‌లైన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

Siddu Jonnagadda Web Series: సిద్దూ జొన్నలగడ్డతో వెబ్ సిరీస్‌పై వెంకీ అట్లూరీ క్రేజీ అప్డేట్.. బ్యాంక్ హైస్ట్ స్టోరీతో..
Siddu Jonnagadda Web Series: సిద్దూ జొన్నలగడ్డతో వెబ్ సిరీస్‌పై వెంకీ అట్లూరీ క్రేజీ అప్డేట్.. బ్యాంక్ హైస్ట్ స్టోరీతో..

థియేట్రికల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సమపాళ్లలో..

ఒకేసారి థియేట్రికల్ సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నారనే ప్రశ్నకు వెంకీ అట్లూరి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "మొదటిగా చెప్పాలంటే నాకు ఖాళీగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఖాళీగా కూర్చుంటే మైండ్‌లోకి లేనిపోని అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు పెరుగుతాయి" అని ఆయన అనడం విశేషం.

వెబ్ సిరీస్ చేయడం అనేది తనకు ఒక కొత్త స్పేస్ అని, అది సరికొత్త దృక్పథాన్ని ఇస్తుందని చెప్పారు. "జిమ్‌లో వర్కవుట్ చేసినట్లే, వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ చేయడం అనేది నాకో కేవలం ఒక క్రియేటివ్ ఎక్సర్‌సైజ్ లాంటిది" అని వెంకీ అట్లూరి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఈ ఏడాది రిలీజ్ లేదు.. నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా వెంకీ అట్లూరి డిజిటల్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

గతంలో వచ్చిన వార్తల ప్రకారం ఈ డిజిటల్ సిరీస్ 2026లోనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై వెంకీ అట్లూరి స్పందిస్తూ, ఈ సిరీస్ 2026లో రావడం లేదని స్పష్టం చేశారు.

ఔట్‌పుట్ ఎంతో అద్భుతంగా వస్తోందని, క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. బ్యాంక్ హైస్ట్ స్టోరీతో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తుందని వెల్లడించారు.

స్టార్ బాయ్ - వెంకీ అట్లూరి మేజిక్

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' లాంటి సంచలన విజయాలతో యంగ్ ఆడియన్స్‌లో ఊపేస్తున్న సిద్దూ జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న తొలి డిజిటల్ ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండటం ప్రాజెక్ట్‌కి మరింత ప్లస్ అయింది.

ప్రస్తుతం సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ పూర్తి చేసిన వెంకీ.. మూవీ రిలీజ్ కోసం చూస్తున్నారు. ఆగస్ట్ 14న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

ఇక 2027 ప్రారంభంలోనే వెంకీ వెబ్ సిరీస్ ను డిజిటల్ స్ట్రీమింగ్‌కి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నారు. సిద్దూ జొన్నలగడ్డ మార్క్ కామెడీ, వెంకీ అట్లూరి ట్రెండీ డైలాగ్స్ ఈ సిరీస్‌ను ఓటీటీలో సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలబెడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More