...
...
Next Story

మరీ పశువుల్లాగా చేస్తున్నారు.. అలా చేయకండి: అభిమానులపై మండిపడిన సింగర్

ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ అభిమానులపై మండిపడ్డాడు. గ్వాలియర్ లో జరిగిన ఓ కాన్సర్ట్ లో మరీ పశువుల్లాగా చేస్తున్నారు.. అలా చేయకండి అని మందలించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Dec 26, 2025, 16:13:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ గ్వాలియర్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రేక్షకుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాన్సర్ట్ జరుగుతుండగా జనం బ్యారికేడ్లు దూకి స్టేజ్ మీదకు రావడంతో అతడు సీరియస్ అయ్యాడు. "పశువుల్లా ప్రవర్తించకండి" అంటూ మండిపడి షోను మధ్యలోనే ఆపేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కైలాష్ ఖేర్ సీరియస్

మరీ పశువుల్లాగా చేస్తున్నారు.. అలా చేయకండి: అభిమానులపై మండిపడిన సింగర్
మరీ పశువుల్లాగా చేస్తున్నారు.. అలా చేయకండి: అభిమానులపై మండిపడిన సింగర్

సింగర్లు కాన్సర్ట్స్ చేయడం సహజమే. వీటిలో కొన్నిసార్లు ఫ్యాన్స్ హద్దు మీరుతుంటారు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కానీ అక్కడ జరిగిన రచ్చ వల్ల అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. పాటలు పాడుతుండగా ప్రేక్షకులు అదుపు తప్పడంతో షో రసాభాసగా మారింది.

అసలేం జరిగిందంటే?

గ్వాలియర్ మేళా గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో కైలాష్ ఖేర్ పాడుతుండగా.. కొంతమంది అత్యుత్సాహంతో బ్యారికేడ్లు దూకి, క్యూ లైన్లను బ్రేక్ చేసి స్టేజ్ వైపు దూసుకొచ్చారు. అతన్ని దగ్గరగా చూడాలనే ఆత్రుతతో గందరగోళం సృష్టించారు.

పరిస్థితి చేయి దాటడంతో కైలాష్ మైక్ తీసుకుని ఆడియెన్స్‌కి గట్టిగా క్లాస్ పీకాడు. "నేను మిమ్మల్ని పొగుడుతుంటే.. మీరేంటి ఇలా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు? దయచేసి పశువుల్లా ప్రవర్తించకండి. ఎవరైనా మా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరకు వస్తే షో ఆపేస్తా" అని హెచ్చరించాడు.

కాన్సర్ట్ రద్దు చేసిన కైలాష్ ఖేర్

సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కైలాష్ ఖేర్ సీనియర్ పోలీసు అధికారులను పిలిచి పరిస్థితి చక్కదిద్దమని కోరాడు. అయినా లాభం లేకపోవడంతో.. "మీకు దండం పెడతా" అని చెప్పి షోను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe