ఆ పాట పాడినందుకు సిగ్గు పడటం లేదు.. కానీ మళ్లీ అలాంటి పాటలు పాడను: టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ కామెంట్స్

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తాను గతంలో పాడిన 'చిక్నీ చమేలీ' వంటి ఐటమ్ సాంగ్స్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తన కామెంట్స్ పై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ, ఆ పాట పాడినందుకు తాను సిగ్గుపడటం లేదని, కానీ ఇప్పుడు తన ప్రాధాన్యతలు మారాయని ఆమె స్పష్టం చేసింది.

Published on: Mar 4, 2026, 17:22:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రేయా ఘోషల్.. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, తను ఎంచుకునే పాటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా లేదా అసభ్యకరంగా ఉండే సాహిత్యం పట్ల తానూ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు ఆమె తెలిపింది. అయితే గతంలో ఆమె పాడిన చిక్నీ చమేలీ సాంగ్, దానిని ఇప్పటికీ పలు కాన్సర్ట్ లలో పాడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.

ఆ పాట పాడినందుకు సిగ్గు పడటం లేదు.. కానీ మళ్లీ అలాంటి పాటలు పాడను: టాప్ సింగర్ శ్రేయా ఘోషాల్ కామెంట్స్
ఆ పాట పాడినందుకు సిగ్గు పడటం లేదు.. కానీ మళ్లీ అలాంటి పాటలు పాడను: టాప్ సింగర్ శ్రేయా ఘోషాల్ కామెంట్స్

ఆ పాటల విషయంలో అభ్యంతరం

రాజ్ శమని పాడ్‌కాస్ట్‌లో శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. 'చిక్నీ చమేలీ' వంటి హిట్స్ తర్వాత తనకు అలాంటి తరహా పాటలే చాలా వచ్చాయని, కానీ వాటిని తాను తిరస్కరించానని చెప్పింది. "ఒకసారి నా స్నేహితుడైన కంపోజర్ ఒక పాట ఆఫర్ చేశారు. అందులో సాహిత్యం ఎంత అసభ్యంగా ఉందంటే.. ఆ పదాలను తలచుకుంటేనే నాకు సిగ్గు అనిపించింది. అందుకే ఆ పాటను పాడనని చెప్పేశాను" అని ఆమె వెల్లడించింది.

చిక్నీ చమేలీపై క్లారిటీ

ఆమె ఈ తరహా పాటలపై వ్యాఖ్యలు చేయడంతో, కొందరు నెటిజన్లు "పాడను అంటున్నారు కానీ కన్సర్ట్స్‌లో అవే పాటలు పాడుతున్నారు కదా" అంటూ ఆమెను 'హిపోక్రట్' (కపటధారి) అని ట్రోల్ చేశారు. దీనిపై శ్రేయ స్పందిస్తూ.. "చిక్నీ చమేలీ పాట పాడినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. అది నా పాట, నేను దాన్ని ఓన్ చేసుకున్నాను. అయితే ఆ సమయంలో ఆ పాటలోని కొన్ని పదాల అర్థం నాకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు నేను మెచ్యూర్ అయ్యాను. ముఖ్యంగా 5-6 ఏళ్ల చిన్న పిల్లలు ఆ పాటలు పాడుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అందుకే అలాంటి పాటలను రికార్డ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని వివరించింది.

ట్రోల్స్‌కు సమాధానం

"నేను ఆ పాటను వేదికలపై పాడుతాను ఎందుకంటే ప్రేక్షకులు దాన్ని ఇష్టపడతారు. కానీ భవిష్యత్తులో మాత్రం మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉండే సాంగ్స్ పాడను. పర్ఫార్మెన్స్ చేయడం వేరు, కొత్తగా అటువంటి పాటలను రికార్డ్ చేయడం వేరు" అని ఆమె తన వైఖరిని స్పష్టం చేసింది.

ప్రస్తుత ప్రాధాన్యతలు

శ్రేయా ఘోషల్ ప్రస్తుతం తన 'ది అన్‌స్టాపబుల్ వరల్డ్ టూర్' (The Unstoppable World Tour) కోసం సిద్ధమవుతోంది. యూకే, యూఎస్ఏ, భారత్, అబుదాబిలో ఆమె కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. ఇటీవల అమల్ మాలిక్ తో కలిసి ఆమె పాడిన 'యహీ గుజార్ దూ' పాటకు మంచి స్పందన లభిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఆమె సోనీ టీవీలో వస్తున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి జడ్జిగా కూడా ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More