Shreya Ghoshal: లైకులు, వ్యూస్ అన్నీ కొనేయొచ్చు.. కానీ, పాట అసలైన గెలుపు అక్కడే ఉంటుంది: స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్
Shreya Ghoshal On Song Success: సోషల్ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్ పాట విజయాన్ని నిర్ణయించలేవని ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ అభిప్రాయపడ్డారు. తన అప్ కమింగ్ 'అన్‌స్టాపబుల్' టూర్ విశేషాలను పంచుకుంటూ, సంగీత రంగంలో మారుతున్న ట్రెండ్స్‌పై శ్రేయా ఘోషనల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన మధురమైన గొంతుతో దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను అలరిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ఒక పాట హిట్టా కాదా అనేది యూట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్ లైకులను బట్టి లెక్కేస్తున్నారు.

అయితే, శ్రేయా ఘోషల్ మాత్రం దీనితో ఏకీభవించడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రేయా ఘోషల్ పాట అసలైన విజయం ఎక్కడ ఉంటుందో తనదైన శైలిలో వివరించారు.
అవన్నీ కొనుక్కోవచ్చు.. కానీ ప్రేక్షకుల ప్రేమను కాదు!
"ఈ రోజుల్లో లైకులు, వ్యూస్ అనేవి చాలా మోసపూరితమైనవి. ఎందుకంటే డబ్బు ఉంటే దేన్నైనా కొనేయొచ్చు (హర్ చీజ్ ఖరీదీ జా సక్తీ హై). కానీ, నేను ఒక కచేరీలో (కాన్సర్ట్) పాడుతున్నప్పుడు.. అక్కడి ప్రేక్షకులు నాతో కలిసి ఆ పాటను పాడుతుంటే, ఆ పాటను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకుంటే.. అదే ఆ పాట సాధించిన అసలైన విజయం" అని శ్రేయా ఘోషల్ పేర్కొన్నారు.
మొదటిసారి పాడిన పాటను కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని, మళ్లీ పాడమని కోరినప్పుడే ఒక కళాకారుడికి దక్కే అతిపెద్ద గౌరవం అని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చారు. కచేరీలలో కనిపించే ఆ 'మల్టిప్లిసిటీ ఎఫెక్ట్' మాత్రమే పాట సక్సెస్‌కు నిజమైన కొలమానం అని శ్రేయా వివరించారు.
సోషల్ మీడియా మ్యాజిక్
లైకులు, వ్యూస్ వెంట తాను పడనని చెబుతూనే, సోషల్ మీడియా వల్ల సంగీత రంగంలో వచ్చిన మార్పులను శ్రేయా ఘోషల్ ప్రశంసించారు. "సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 2013లో వచ్చిన 'బేషరమ్' సినిమాలోని 'దిల్ కా జో హాల్ హై' పాట పదేళ్ల తర్వాత ఇప్పుడు ట్రెండ్ అవ్వడం, అలాగే 'సూపర్ 30'లోని 'జుగ్రాఫియా' పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదంతా సోషల్ మీడియా మ్యాజిక్" అని ఆమె కొనియాడారు.
ఇప్పుడు సంగీతం కేవలం కొందరి చేతుల్లో లేదని, ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వల్ల శ్రోతలే ఏది మంచి సంగీతమో నిర్ణయించే ప్రజాస్వామ్యం ఏర్పడిందని శ్రేయా ఘోషల్ తెలిపారు.
‘అన్‌స్టాపబుల్’ టూర్: ఒక వ్యక్తిగత ప్రయాణం
త్వరలో ప్రారంభం కాబోతున్న 'ది అన్‌స్టాపబుల్ టూర్' (The Unstoppable Tour) గురించి శ్రేయ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. "గత మూడు నాలుగేళ్లుగా చేసిన 'ఆల్ హార్ట్స్ టూర్' అద్భుతంగా సాగింది. దాదాపు 50 నగరాల్లో షోలు అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. అయితే, ఈసారి ఏదో కొత్తగా చేయాలని భావించాం. అందుకే 'అన్‌స్టాపబుల్' టూర్‌ను సరికొత్తగా డిజైన్ చేశాం" అని శ్రేయా ఘోషల్ తెలిపారు.
సరికొత్త అనుభూతి
"ఇందులో నేను గాయనిగా ఎదిగిన ప్రయాణం, నా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను పాటల ద్వారా ప్రేక్షకులకు వివరిస్తాను. ఇది నా వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించిన కథ" అని స్టార్ సింగర్ శ్రేయా ఘోషనల్ వెల్లడించారు. ఈ టూర్‌లో ప్రేక్షకులకు అస్సలు ఊహించని సరికొత్త అనుభూతి కలుగుతుందని ఆమె హామీ ఇచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


