Palash Muchhal: స్మృతి మంధానా మాజీ లవర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. చిక్కుల్లో పలాశ్.. కేసు పెట్టింది ఆమె ఫ్రెండే..

Palash Muchhal: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో పెళ్లి రద్దు చేసుకుని వార్తల్లో నిలిచిన సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. స్మృతి చిన్ననాటి స్నేహితుడిని కులం పేరుతో దూషించారనే ఆరోపణలపై సాంగ్లీలో ఆయనపై కేసు నమోదైంది.

Published on: May 6, 2026, 10:50:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Palash Muchhal: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయని పాలక్ ముచ్చల్ సోదరుడు పలాశ్ ముచ్చల్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో వివాహం రద్దు కావడంతో ఆ మధ్య వార్తల్లో నిలిచిన ఆయన.. ఇప్పుడు ఏకంగా క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. తన స్నేహితుడిని కులం పేరుతో దూషించడమే కాకుండా, ఆర్థికంగా మోసం చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఆయనపై వచ్చాయి.

Palash Muchhal: స్మృతి మంధానా మాజీ లవర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. చిక్కుల్లో పలాశ్.. కేసు పెట్టింది ఆమె ఫ్రెండే..
Palash Muchhal: స్మృతి మంధానా మాజీ లవర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. చిక్కుల్లో పలాశ్.. కేసు పెట్టింది ఆమె ఫ్రెండే..

సమస్య ఎక్కడ మొదలైంది?

స్మృతి మంధానా చిన్ననాటి స్నేహితుడు, మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన విజ్ఞాన్ ప్రకాష్ మానే అనే వ్యక్తి పలాశ్ ముచ్చల్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి.

ఒక సినిమా నిర్మాణం కోసం పలాశ్ తన వద్ద రూ. 25 లక్షలు అప్పుగా తీసుకున్నారని, అయితే ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటివరకు డబ్బులు తిరిగి ఇవ్వలేదని విజ్ఞాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

టోల్ ప్లాజా వద్ద వాగ్వాదం.. అట్రాసిటీ కేసు

గతేడాది నవంబర్ 22న సాంగ్లీ-అష్టా రోడ్డులోని ఒక టోల్ ప్లాజా వద్ద ఈ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తన డబ్బులు తిరిగి ఇవ్వమని కోరినప్పుడు, పలాశ్ తనను కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించారని విజ్ఞాన్ ఆరోపించారు.

"పలాశ్ నన్ను నమ్మించి రూ. 25 లక్షలు తీసుకున్నాడు. కానీ తీరా అడిగితే మోసం చేశాడు. డబ్బుల గురించి మాట్లాడటానికి వెళ్తే నన్ను కులం పేరుతో నీచంగా దూషించాడు. ఆ మాటలు నేను కెమెరా ముందు కూడా చెప్పలేను. అతని మనస్తత్వం చాలా దారుణం" అని విజ్ఞాన్ మానే మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సాంగ్లీ పోలీసులు పలాశ్ ముచ్చల్‌పై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(1)తో పాటు ఐపీసీ సెక్షన్లు 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ సాగుతోంది.

వ్యక్తిగత జీవితంలోనూ సంక్షోభం

పలాశ్ ముచ్చల్, స్మృతి మంధానల నిశ్చితార్థం ముగిసి, గత ఏడాది నవంబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా స్మృతి తండ్రికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది.

అదే సమయంలో పలాశ్ కూడా ముంబైలోని ఆసుపత్రిలో చేరడం, ఆ తర్వాత వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చర్చనీయాంశమైంది. పలాశ్ స్మృతిని మోసం చేశారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి.

ఈ పుకార్లపై స్పందిస్తూ పలాశ్ గతంలోనే ఒక నోట్ విడుదల చేశారు. "నా వ్యక్తిగత బంధం నుంచి నేను తప్పుకుంటున్నాను. ఆధారాలు లేని వార్తలతో ఒకరిని జడ్జ్ చేయకండి" అని ఆయన పేర్కొన్నారు. అయితే అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఇప్పుడు పలాశ్ చట్టపరంగా ఇబ్బందుల్లో పడ్డారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. పలాశ్ ముచ్చల్‌పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదైంది?

ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతో పాటు ఇతర క్రిమినల్ సెక్షన్ల కింద మహారాష్ట్రలోని సాంగ్లీలో కేసు నమోదైంది.

2. పలాశ్ ముచ్చల్ ఎవరిని దూషించారని ఆరోపణలు వచ్చాయి?

క్రికెటర్ స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాష్ మానేను కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

3. పలాశ్ ముచ్చల్, స్మృతి మంధాన పెళ్లి ఎందుకు రద్దు అయింది?

పెళ్లి రద్దుకు గల ఖచ్చితమైన కారణాలు బయటకు రాకపోయినప్పటికీ, కుటుంబ సభ్యుల అనారోగ్యం, వ్యక్తిగత విభేదాల వల్లే వారు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More