స్మృతి మంధానాను కాబోయే భర్త మోసం చేశాడా? మరో అమ్మాయితో చాట్.. వైరల్ అవుతున్న పోస్ట్.. సోషల్ మీడియాలో రచ్చ
స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ పెళ్లి ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలుసు కదా. అయితే దీని తర్వాత వచ్చిన వార్తలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. స్మృతిని పలాష్ మోసం చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటం విశేషం.
ఫిల్మ్‌మేకర్, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్, ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానల పెళ్లి వాయిదా పడిన విషయం తెలుసు కదా. ఆదివారం అంటే నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో వీళ్ల పెళ్లి జరగాల్సింది. అయితే ఇటు స్మృతి తండ్రి, అటు పలాష్ ఇద్దరూ అనారోగ్యం బారిన పడటంతో వాయిదా వేశారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.

అయితే స్మృతి మరుసటి రోజే పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులను ఇన్‌స్టా నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమెను పలాస్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
వైరల్ అయిన రెడిట్ స్క్రీన్‌షాట్‌లు
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా తర్వాత మేరీ డి’కోస్టా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రెడిట్‌లో కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు. అవి పలాష్ ముచ్చల్‌తో తాను చేసిన చాటింగ్ అంటూ ఆ యూజర్ పేర్కొన్నారు. ఆ అకౌంట్ ప్రస్తుతం డీయాక్టివేట్ అయినప్పటికీ, ఆ స్క్రీన్‌షాట్‌లు మాత్రం వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.
మే 2025 నాటి ఈ సందేశాలలో.. మేరీని పలాష్ స్విమ్మింగ్‌కు వెళ్లమని అడగడం కనిపిస్తుంది. ఆమె అతని రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి లేదా అతను ప్రేమలో ఉన్నాడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. పలాష్ ఆ ప్రశ్నలను తప్పించుకున్నట్లుగా వాటిలో కనిపిస్తోంది. అంతేకాదు ఆమెను కలవడానికి ఒప్పించడానికి ప్రయత్నించాడు.
నెటిజన్ల రియాక్షన్ ఇలా..
ఈ స్క్రీన్‌షాట్‌లు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. స్మృతికి మద్దతుగా చాలా మంది కామెంట్స్ చేశారు. "ఇవి చదవగానే అసహ్యం వేసింది. మనుషులు ఇంత సిగ్గులేకుండా ఉంటారా" అని ఒకరు కామెంట్ చేశారు. "ఇతను తన చేతిపై ఆమె ఇనీషియల్స్, జెర్సీ నంబర్ టాటూ వేయించుకున్నాడు. ఆమె ఎప్పుడూ తనను అనుమానించకుండా మోసం చేసుకునేందుకు ఇలా చేసినట్లున్నాడు" అని మరొకరు విమర్శించారు.
ఇలాంటి అబద్ధాల కోరు, మోసగాడి నుంచి స్మృతి తప్పించుకున్నందుకు ఆమె అదృష్టవంతురాలు అని ఇంకో యూజర్ అన్నారు. ఈ రోజుల్లో ప్రేమ ఓ జోక్ మాత్రమే.. చాలా మంది ఇన్‌స్టాలో నటిస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు.
స్మృతి ఇప్పటికే తన సోషల్ మీడియా నుండి నిశ్చితార్థం, ప్రపోజల్ వీడియోలను తొలగించింది. అటు స్మృతి టీమ్మేట్ జెమీమా కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోను డిలీట్ చేసింది. పలాష్ మాత్రం తన ఖాతాలో స్మృతితో ఉన్న పోస్ట్‌లన్నింటినీ అలాగే ఉంచాడు. పెళ్లి వాయిదా పడటంపై పలాష్ సోదరి పలక్ ముచ్చల్ మాత్రమే అధికారిక ప్రకటన చేసింది. "స్మృతి తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా స్మృతి, పలాష్ వివాహం నిలిపివేశాం. ఈ సమయంలో కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము" అని ఆమె కోరింది. స్మృతి లేదా పలాష్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


