Sobhita Dhulipala Bold: శోభిత బోల్డ్ ఫొటోషూట్.. పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. కవర్ పేజీపై..

Sobhita Dhulipala Bold: శోభితా ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్ వైరల్ అవుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఆమె చేసిన ఈ ఫొటోషూట్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకుంది.

Published on: Oct 12, 2026, 20:20:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sobhita Dhulipala Bold: తెలుగు ఆడియన్స్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న మన తెలుగు గ్లామరస్ నటి శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత మళ్లీ తన బోల్డ్ అండ్ స్టైలిష్ అవతార్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత తొలిసారిగా ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' (The Hollywood Reporter India) కవర్ పేజీ కోసం ఆమె చేసిన గ్లామరస్ ఫోటోషూట్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్ లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Sobhita Dhulipala Bold: శోభిత బోల్డ్ ఫొటోషూట్.. పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. కవర్ పేజీపై..
Sobhita Dhulipala Bold: శోభిత బోల్డ్ ఫొటోషూట్.. పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. కవర్ పేజీపై..

'ఇండియన్ నోయిర్' (Indian Noir) ఫేస్‌గా పేరు తెచ్చుకున్న శోభిత.. ఈ ఫోటోషూట్‌లో తన గ్లామర్ అండ్ స్టైలింగ్ సెన్స్‌తో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.

ఫ్యాషన్ ప్రపంచాన్ని ఫిదా చేస్తున్న శోభితా డిఫరెంట్ లుక్స్

ఈ స్పెషల్ షూట్ కవర్ పేజీ కోసం శోభిత ధరిం‌చిన డిజైనర్ అవుట్‌ఫిట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షార్ట్ గ్రే ఫాక్స్ ఫర్ జాకెట్, బ్లాక్ బ్రీఫ్స్, షీర్ టైట్స్ కాంబినేషన్‌తో పాటు గోల్డ్ బెల్ట్, క్రిస్టల్ పెండెంట్‌తో ఆమె కనిపించిన తీరు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మెస్సీ హెయిర్ స్టైల్, స్మోకీ ఐస్, నూడ్ లిప్స్‌తో చాలా ఇంటెన్స్‌గా పోజులిచ్చారు.

మరో లుక్‌లో కట్-అవుట్స్‌తో కూడిన బ్లాక్ హాల్టర్ టాప్, ష్రెడెడ్ మిడీ స్కర్ట్, డార్క్ ప్లమ్ బాడీసూట్, ఓవర్‌సైజ్డ్ గ్రే బ్లేజర్‌లో ఎంతో అందంగా కనిపించారు. ఈ కవర్ షూట్‌లోనే షోస్టాపర్‌గా నిలిచిన మెజెంటా వన్-షోల్డర్ డ్రేప్, క్రిస్టల్ ఫ్రింజ్డ్ థై-హై బూట్స్, షార్ట్ వేవీ బాబ్ హెయిర్‌కట్‌లో శోభిత లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు.. పా రంజిత్ ‘వెట్టువమ్’తో..

తెలుగు అమ్మాయైన శోభితా ధూళిపాళ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న సంక్లిష్టమైన పాత్రలను ఎంచుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యారు. హిట్ వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' (Made in Heaven), అడవి శేష్ 'మేజర్' (Major), మణిరత్నం విజువల్ వండర్ 'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan)తో పాటు హాలీవుడ్ యాక్షన్ మూవీ 'మంకీ మ్యాన్' (Monkey Man)తో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.

ప్రస్తుతం ఆమె కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వెట్టువమ్' (Vettuvam) అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై తనకు ఎంతో నమ్మకం ఉందని, తన నటనను మొత్తం ఈ పాత్ర కోసం ధారపోశానని, ఇలాంటి పవర్ ఫుల్ రోల్ కోసం తాను ఎప్పటినుంచో దేవుడిని ప్రార్థిస్తున్నానని శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లి తర్వాత కూడా తన ప్రొఫెషనల్ లైఫ్‌ను, ఫ్యాషన్ షూట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ శోభితా దూసుకుపోతుండటం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More