Sobhita Dhulipala: శోభిత ఓ అద్భుతం.. డూపు లేకుండా అలాంటి స్టంట్స్.. దానికి 15 ఏళ్ల సాధన కావాలి: తమిళ డైరెక్టర్ ప్రశంసలు
Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్లపై తమిళ డైరెక్టర్ పా రంజిత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన డైరెక్షన్ లో వస్తున్న వేట్టువం మూవీలో శోభిత నటించింది. ఆమె నటన, డూపు లేకుండా స్టంట్స్ చేయడంపై రంజిత్ ప్రశంసలు కురిపించారు.
Sobhita Dhulipala: కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘వేట్టువం’ (Vettuvam) సినిమాలో తెలుగు భామ శోభితా ధూళిపాళ్ల అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎలాంటి డూప్ లేదా స్టంట్ డబుల్స్ సాయం లేకుండా ప్రతి రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను శోభితా స్వయంగా చేసి చూపించడం విశేషం. దీంతో ఆమెపై డైరెక్టర్ ప్రశంసల వర్షం కుపించారు.

డూప్ అవసరం లేకుండానే.. పా రంజిత్ ప్రశంసలు
‘వేట్టువం’ సినిమా ప్రమోషనల్ టాక్‌లో భాగంగా డైరెక్టర్ పా రంజిత్.. శోభితా ధూళిపాళ్ల డెడికేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "శోభితా ధూళిపాళ్ల చాలా అద్భుతమైన నటి. ఆమె నటించిన గత సినిమాలు, వెబ్ సిరీస్ చాలా చూశాను. చాలా కాలంగా తనతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ కాంబినేషన్ కుదరడం నిజంగా గ్రేట్" అని తెలిపారు.
కెమెరా రీహార్సల్స్ కోసం మాత్రమే స్టంట్ డబుల్స్ ఉండేవారని, ఫైనల్ టేక్‌కి వచ్చేసరికి శోభితా స్వయంగా రంగంలోకి దిగి యాక్షన్ సీన్లు చేసేదని రంజిత్ చెప్పారు. సీన్స్‌లో ఎలాంటి కృత్రిమత్వం లేకుండా చూడటం కోసమే శోభితా తన 100 శాతం ఎఫర్ట్స్ పెట్టిందని కొనియాడారు.
15 ఏళ్ల సాధన కావాలి.. శోభితా ధూళిపాళ్ల రియాక్షన్
ఈ సినిమా కొరియోగ్రఫీ, యాక్షన్ సీన్ల గురించి శోభితా ధూళిపాళ్ల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ సినిమాలో మేం చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పర్ఫెక్ట్‌గా రావాలంటే కనీసం 15 నుంచి 20 ఏళ్ల ప్రాక్టీస్ ఉండాలి. కానీ మా టీమ్ సపోర్ట్, సరైన స్పిరిట్‌తో రోజూ ఎంతో కష్టపడి ఆ స్టంట్స్ పూర్తి చేశాం" అని చెప్పారు.
మోడలింగ్ నుంచి నటిగా మారిన శోభితా.. గూఢచారి, మేజర్, పొన్నియిన్ సెల్వన్, మంకీ మ్యాన్ వంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు 'వెట్టువం' సినిమాతో పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో కనిపిస్తుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
'వెట్టువం' మూవీపై పెరిగిన హైప్
తమిళంతో పాటు ఇతర భాషల్లో రూపొందుతున్న 'వేట్టువం' చిత్రాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనే ఫస్ట్ లుక్ ద్వారా గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ‘సర్పట్ట పరంపర’, ‘తంగలాన్’ లాంటి రోమాంచిత చిత్రాలను అందించిన పా రంజిత్ దర్శకత్వంలో వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ నెలకొంది.
శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాతో తన కెరీర్‌లోనే అత్యంత పవర్ ఫుల్ యాక్షన్ రోల్‌లో అలరించబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


