Sonam Bajwa: నీ వల్లే నా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్: హీరోయిన్‌కు షాకిచ్చిన అమ్మాయి.. అసలేం జరిగిందంటే?

Sonam Bajwa: తెలుగులో బాబు బంగారం, ఆటాడుకుందాం రా అనే సినిమాల్లో నటించిన పంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా ఓ షాకింగ్ విషయం వెల్లడించింది. తన వల్ల ఓ అమ్మాయి ఎంగేజ్‌మెంట్ రద్దయిందని ఓ షోలో చెప్పి షాకిచ్చింది.

Published on: Apr 12, 2026, 19:44:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sonam Bajwa: పంజాబీ బ్యూటీ, సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన సోనమ్ బాజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె గ్లామర్‌కు, ఫిట్‌నెస్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సోనమ్ చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తన వల్ల ఒక అమ్మాయి నిశ్చితార్థం రద్దయిందని, ఆ చేదు అనుభవాన్ని స్వయంగా ఆ అమ్మాయే తనకు వివరించిందని సోనమ్ బాజ్వా వెల్లడించింది.

Sonam Bajwa: నీ వల్లే నా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్: హీరోయిన్‌కు షాకిచ్చిన అమ్మాయి.. అసలేం జరిగిందంటే? (Instagram/Sonam Bajwa)
Sonam Bajwa: నీ వల్లే నా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్: హీరోయిన్‌కు షాకిచ్చిన అమ్మాయి.. అసలేం జరిగిందంటే? (Instagram/Sonam Bajwa)

ఆశ్చర్యపోయిన సోనమ్.. అసలు కారణం ఇదీ

అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ (Amazon MX Player) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఫేమస్లీ ఫిట్ విత్ సోఫీ' (Famously Fit with Sophie) టాక్ షోలో సోనమ్ బాజ్వా అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా హోస్ట్ సోఫీ చౌదరితో మాట్లాడుతూ.. ఒక వింత ఘటనను పంచుకుంది.

"ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి.. 'మీరు సోనమ్ బాజ్వా కదా? మీకు ఒక విషయం చెప్పాలి. మీ వల్లే నా ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయ్యింది' అని చెప్పింది. అది విని నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయాను. ఆమెకు సారీ చెప్పాలా లేక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు" అని సోనమ్ ఆనాటి పరిస్థితిని వివరించింది.

"నీలా ఉండాలని వేధించేవాడు"

ఆ అమ్మాయి తన నిశ్చితార్థం ఎందుకు రద్దు చేసుకుందో చెబుతూ సోనమ్ బాజ్వా మరిన్ని వివరాలు వెల్లడించింది.

"నేను ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా మాజీ కాబోయే భర్తకు మీరంటే పిచ్చి. నేను కూడా చూడటానికి సోనమ్ బజ్వాలాగే ఉండాలని, నీలాంటి బాడీనే మెయింటైన్ చేయాలని నన్ను వేధించేవాడు. ఆ టార్చర్ భరించలేకే నేను అతడితో పెళ్లి వద్దనుకున్నాను. ప్రస్తుతం నేను మరొకరితో రిలేషన్‌లో ఉన్నాను. ఆయన నన్ను ఉన్నదున్నట్లుగా ప్రేమిస్తున్నారు" అని ఆ యువతి తనతో చెప్పినట్లు సోనమ్ పేర్కొన్నారు.

అభిమానం ఉండొచ్చు కానీ, అది ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉండకూడదని సోనమ్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

మోడలింగ్ నుంచి టాప్ హీరోయిన్ వరకు..

2012లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సోనమ్ బజ్వా, ఆ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించింది. అదే ఏడాది 'బెస్ట్ ఆఫ్ లక్' అనే పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమయింది.

2014లో వచ్చిన 'పంజాబ్ 1984' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత నిక్కా జైల్దార్, క్యారీ ఆన్ జట్టా-3, సర్దార్ జీ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో పంజాబీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

తెలుగు, హిందీ చిత్రాల్లోనూ సందడి

కేవలం పంజాబీకే పరిమితం కాకుండా, బాలీవుడ్‌లో 'స్ట్రీట్ డాన్సర్ 3D' వంటి సినిమాల్లో నటించింది. అలాగే తెలుగు, తమిళ భాషల్లోనూ పలు ప్రాజెక్టులు చేశారు. ఇటీవల 'హౌస్‌ఫుల్ 5', 'ఏక్ దీవానే కీ దీవానియత్' చిత్రాల్లో మెరిసిన సోనమ్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందం మాత్రమే కాదు, ఫిట్‌నెస్‌పై ఆమెకు ఉన్న శ్రద్ధ వల్లే సోనమ్ ఈ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More