రష్మిక మందన్న నెక్స్ట్ మూవీస్.. విడుదల కంటే ముందే ఆ 3 సినిమాలకు భారీ ఓటీటీ డీల్స్!

Rashmika Upcoming movies : పెళ్లి తర్వాత కూడా నటి రష్మిక మందన్న బిజీ బిజీ అయింది. విడుదలకు ముందే 3 సినిమాలు ఓటీటీకి భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

Published on: Apr 11, 2026, 12:57:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రష్మిక మందన్నకు ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. ఆమె నటించిన మూడు చిత్రాల షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఆ చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఉండగా ఓటీటీకి భారీ ధరకు అమ్ముడయ్యాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోల సరసన నటించింది శ్రీవల్లి.

రష్మిక మందన్న
రష్మిక మందన్న

ఆమె కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి.. వరుసగా అవకాశాలు దక్కించుకుంది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తొలి చిత్రం చలోతో ఎంట్రీ ఇచ్చి తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లో రష్మిక గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలోనే స్టార్ నటులతో నటించే అవకాశం లభించింది.

కన్నడ, తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలోకి అడుగుపెట్టిన రష్మిక, మలయాళ చిత్రాలలో నటించకపోవడం మినహా, మిగతా అన్ని భాషల్లోని సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. రష్మిక మందన్న విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని తెలుగింటి కోడలు అయింది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో దేవరకొండతో రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత థాయ్‌లాండ్‌కు హనీమూన్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

హీరోయిన్లకు పెళ్లి అయ్యేంత వరకు బిజీగా ఉంటారని, ఆ తర్వాత డిమాండ్ తగ్గుతుందని చెబుతుంటారు. కానీ రష్మిక ఇందుకు భిన్నం. పెళ్లి కాగానే హీరోయిన్లకు డిమాండ్ తగ్గిపోతుందని సినీ పరిశ్రమలో ఒక మాట ఉంది. కానీ రష్మిక విషయంలో ఇది అబద్ధంగా కనిపిస్తుంది. మిసెస్ విజయ్ దేవరకొండకు సినిమా అవకాశాలు అస్సలు తగ్గడం లేదు. ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

విజయ్‌తో పెళ్లి తర్వాత ఈ చూడ చక్కని జంట ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మునుపటి కంటే పది రెట్లు ఎక్కువ షేర్లు, లైక్‌లు వచ్చాయి. రష్మిక ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్తల్లోనే ఉంది. రష్మిక చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రణబాలి. ఇందులో రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఇది.

రణబాలితో పాటు రష్మిక మైసా అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇది మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా. ఇందులో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది కాకుండా రష్మిక కాక్‌టెయిల్ 2లో కూడా నటిస్తోంది. ఇందులో ఆమెది లెస్బియన్ పాత్ర అని టాక్.

ఈ మూడు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. విశేషం ఏమిటంటే, అవి ఇంకా చిత్రీకరణలో ఉండగానే ఓటీటీ నుండి భారీగా డిమాండ్ ఉంది. భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. రణబాలి, మైసా చిత్రాలను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. కాక్‌టెయిల్ 2 కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తుందని అంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More