ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా ట్రైలర్ సోమవారం (నవంబర్ 10) రిలీజ్ అయింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కడం విశేషం.

Published on: Nov 10, 2025, 19:03:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీకు స్పోర్ట్స్ డామాలు అంటే ఇష్టమా? అయితే ఓటీటీలోకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. దీని పేరు రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్. సోమవారం (నవంబర్ 10) ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ ట్రైలర్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' వెబ్ సిరీస్ ట్రైలర్ చివరకు ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఈ సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్‌లో మానవ్ కౌల్, జీషన్ ఆయుబ్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని ఆటంకాలను సమర్థంగా అధిగమించి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిజమైన నాయకులుగా ఎలా మారారో ఈ ట్రైలర్ చూపించింది. డిసెంబర్‌ 9న సోనీ లివ్ ఓటీటీలో ప్రీమియర్‌ కానుంది.

ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ ట్రైలర్‌తో పాటు మేకర్స్ ఈ సిరీస్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ట్రైలర్‌లో జీషన్ ఆయూబ్ పాత్ర కశ్మీర్‌లో మొట్టమొదటి ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేయడానికి పడే శ్రమను చూపించారు. మొదట్లోనే అతడు డీఎఫ్‌వో టోర్నమెంట్ గురించి ఆరా తీయడం, దాని కోసం ఎన్నో అడ్డంకులను అధిగమించి కశ్మీర్ టీమ్ ను తయారు చేయడం ఇందులో చూడొచ్చు.

స్పోర్ట్స్ డ్రామా సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించిన జీషన్ ఆయూబ్, మానవ్ కౌల్ తమ పాత్రలకు సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు వీరు ప్రధాన బలమని చెప్పొచ్చు.

నాకు చాలా ముఖ్యమైనది

కశ్మీర్‌కు చెందిన మానవ్ కౌల్.. ఈ కథ తనకు చాలా ముఖ్యమైనదని అన్నాడు. “నేను కశ్మీరీని కాబట్టి ఈ కథ నాకు చాలా అర్థవంతమైంది. 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' కథ ఫుట్‌బాల్‌కు మించినది. ఇది మానవ స్ఫూర్తి గురించి, కఠినమైన పరిస్థితుల్లో కూడా మార్పు సాధ్యమేననే నమ్మకం గురించి చెబుతుంది. ఆశ అంటే ఇదే. ఇది పట్టుదల, కలలు, ఏదైనా సాధించగలమని నమ్మే ధైర్యం గురించి చెబుతుంది” అని అన్నాడు.

మహ్మద్ జీషన్ ఆయూబ్ మాట్లాడుతూ.. “ఈ కథ స్నేహం, విశ్వాసం, సంపూర్ణ నమ్మకానికి సంబంధించిన ఓ సెలబ్రేషన్ లాంటిది. ఇది నిజమైనది. లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ వ్యక్తులు నిర్మించింది కేవలం ఒక ఫుట్‌బాల్ క్లబ్ మాత్రమే కాదు.. ప్రజల్లో మళ్లీ నమ్మకం చిగురించడానికి కారణం” అని అన్నాడు.

మహేష్ మత్తాయి, రాజేష్ మాపుస్కర్ డైరెక్ట్ చేసిన ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’లో అభిషాంత్ రాణా, మువజ్జం భట్, ప్రియా చౌహాన్, అన్మోల్ ఠాకరియాదిల్లాన్, అఫ్నాన్ ఫాజ్లీ, షాహీమ్ భట్ లాంటి వాళ్లు నటించారు. డిసెంబర్ 9 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ సిరీస్ చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More