ఒకే ఓటీటీలోకి రెండు తమిళ బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఒకటేమో స్పోర్ట్స్ డ్రామా, మరొకటి జెన్ జెడ్ రొమాన్స్.. తెలుగులోనూ

రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న రెండు తమిళ సినిమాలో ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇందులో ఒకటి రూరల్ స్పోర్ట్స్ డ్రామా, మరొకటి జెన్ జెడ్ రొమాన్స్ థ్రిల్లర్. మరి ఈ సినిమాలు ఏవీ? ఎప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయో చూసేయండి. 

Published on: Nov 8, 2025, 15:30:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను థియేటర్లలో ఎంటర్ టైన్ చేసిన రెండు తమిళ సినిమాలు ఇప్పుడు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఆ రెండు సినిమాలే బైసన్, డ్యూడ్. బైసన్ సినిమాలో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరో. మరోవైపు డ్యూడ్ మూవీలో ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేశాయి.

ఓటీటీలోకి తమిళ సినిమాలు (x)
ఓటీటీలోకి తమిళ సినిమాలు (x)

ఒకే రోజు రిలీజ్

తమిళ సినిమాలు బైసన్, డ్యూడ్ రెండు ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అక్టోబర్ 17న థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చాయి. బైసన్ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. దీనికి మారి సెల్వరాజ్ డైరెక్టర్. డ్యూడ్ ఏమో న్యూ ఏజ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చింది. దీనికి కీర్తిశ్వరణ్ డైరెక్టర్.

ఒకే ఓటీటీలోకి

బైసన్, డ్యూడ్ రెండు తమిళ సినిమాలు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇవి త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. సౌత్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన నెట్‌ఫ్లిక్స్ ఇక్కడ చిత్రాల ఓటీటీ రైట్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే బైసన్, డ్యూడ్ సినిమాల ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది.

ఓటీటీలోకి ఎప్పుడంటే?

బైసన్, డ్యూడ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏదో తెలిసింది కానీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సాధారణంగా సౌత్ సినిమాలు థియేటర్లో రిలీజైన నాలుగు వారాల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బైసన్, డ్యూడ్ వచ్చే వారం ఓటీటీ డెబ్యూ చేసే అవకాశముంది.

తెలుగులోనూ

తమిళ సినిమాలైన బైసన్, డ్యూడ్ తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ డబ్ అయి థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే.

థియేటర్లో బైసన్, డ్యూడ్ ఒకే రోజు రిలీజై పోటీపడ్డాయి. మరి ఓటీటీలోనూ ఒకే రోజు రిలీజ్ అవుతాయా? అన్నది చూడాలి. ఈ రెండింటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒకటే. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఈ రెండు సినిమాలను ఒకే రోజు స్ట్రీమింగ్ కు తీసుకొస్తుందా? లేదా మధ్యలో ఒకట్రెండు రోజులు గ్యాప్ తీసుకుంటుందా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More