ఈ వెబ్ సిరీస్ థియేటర్లలో రిలీజై ఉంటే రూ.700 కోట్లు కొల్లగొట్టేది: నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి. ఇది థియేటర్లలో రిలీజై ఉంటే బాక్సాఫీస్ దగ్గర కనీసం రూ.700 కోట్లు వసూలు చేసేదని అన్నాడు.
నటుడు ఇమ్రాన్ హష్మి ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్’లో ఒక అతిథి పాత్రలో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్‌ను థియేటర్లలో విడుదల చేసి ఉండాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్.. ఈ సిరీస్‌కు "బాక్సాఫీస్ వద్ద రూ. 600-700 కోట్లు" వసూలు చేసే సత్తా ఉందని అనడం విశేషం.

ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్‌పై ప్రశంసలు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన ఈ వెబ్ సిరీస్‌ను ఇమ్రాన్ హష్మి 'రాజకీయంగా తప్పు' అంటే కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉందని వర్ణించాడు. “మీకు తెలుసా, నేను మొదటి ఎపిసోడ్ కొంతమందితో కలిసి చూశాను.
అది మిమ్మల్ని ఆకర్షించడానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఆ తర్వాత కూడా మీరు ఆ సిరీస్ చూస్తూ ఉంటే.. 'వావ్ మీరు ఇంతకు ముందు చూడని దానికి ఇది భిన్నంగా ఉంది' అనిపిస్తుంది. దీన్ని థియేటర్లలో విడుదల చేసి ఉండాల్సింది. ఇది బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా రూ. 600 - 700 కోట్లు వసూలు చేసేది” అని ఇమ్రాన్ అన్నాడు.
షారుక్‌తో సినిమా చేయాలనే కోరిక
ఇదే సందర్భంగా షారుక్ ఖాన్‌తో కలిసి ఒక సినిమాలో నటించాలనే తన కోరికను కూడా ఇమ్రాన్ వెల్లడించాడు. “నేను మిస్టర్ ఎస్సార్కేతో నిర్మాతగా పనిచేశాను. కలిసి ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అది జరగలేదు. అయితే భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే నేను కచ్చితంగా చేస్తాను” అని ఇమ్రాన్ అన్నాడు.
ఇటీవల పీటీఐతో మాట్లాడిన ఇమ్రాన్.. ‘ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్’లో తన అతిథి పాత్రకు లభించిన ప్రజాదరణకు కారణం.. 2000ల ప్రారంభంలో తన 'లవర్ బాయ్' ఇమేజ్‌పై అభిమానుల్లో ఉన్న నోస్టాల్జియా అని చెప్పాడు.
ఈ వెబ్ సిరీస్ మూడో ఎపిసోడ్‌లో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. లక్ష్మణ్‌కు స్నేహితుడైన రాఘవ్ జుయల్ పాత్ర పోషించిన పర్వైజ్, తన ఆరాధ్యదైవం ఇమ్రాన్ ను కలుస్తాడు. ఈ సందర్భంగా రాఘవ్ పాత్ర ఊహించని విధంగా ఇమ్రాన్ ఐకానిక్ సినిమా ‘మర్డర్’లోని 'కహో నా కహో' పాటను పాడుతాడు.
“ఆ సీన్ చేయడం నాకు సరదాగా అనిపించింది. దానికి అంత గుర్తింపు లభిస్తుందని నాకు తెలియదు. కానీ ఇది గొప్ప విషయం. షోలో భాగమైన అందరి గురించి నేను సంతోషిస్తున్నాను. ఇది ఊహించని విధంగా వైరల్ అయింది. కొంతకాలంగా అభిమానులు నన్ను ఇష్టపడిన 'లవర్ బాయ్' ఇమేజ్‌ను మిస్ అవుతున్నారు. ఇది చాలా సరదాగా ఉంది” అని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నాడు.
'ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌లో లక్ష్మణ్, సాహెర్ బాంబా, బాబీ డియోల్, ఆన్యా సింగ్, మనీష్ చౌధరి, మోనా సింగ్, విజయ్‌కాంత్ కోహ్లీ, మనోజ్ పహ్వా, గౌతమి కపూర్, రజత్ బేడీ వంటి నటీనటులు నటించారు. ఏడు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


