Heroine 1980: వింటేజ్ లుక్‌లో సమంత, తమన్నా, సాయిపల్లవి- నెట్టింట వైరల్‌గా మారిన 1980s ఏఐ ఫోటో ట్రెండ్- ప్రాంప్ట్స్ ఇవే!
Heroine 1980: సోషల్ మీడియాలో ప్రస్తుతం '1980s ఏఐ ఫోటో ట్రెండ్' తీవ్రంగా హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత రుత్ ప్రభు, తమన్నా, సాయిపల్లవితో పాటు సౌత్ భామల 80ల కాలం నాటి వింటేజ్ లుక్స్ వైరల్ గా మారాయి. ఈ వైరల్ ట్రెండ్ వివరాలు, ఏఐ ప్రాంప్ట్స్ విశేషాలను చూసేయండి.
Heroine 1980: ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ డిజిటల్ రంగాన్ని, ప్రత్యేకించి పాప్ కల్చర్‌ను సరికొత్తగా శాసిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో '1980s రెట్రో లుక్ ఫొటో’ ట్రెండ్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరోయిన్లను ఏఐ వాడి ఆనాటి లుక్స్ లోకి మార్చి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

1980 ఫొటో ట్రెండ్
సెలబ్రిటీల నుంచి కామనర్ల వరకు ఇప్పుడు ఈ 1980 రెట్రు లుక్ అనేది ట్రెండ్ గా మారింది. ప్రస్తుత తరం స్టార్ హీరోయిన్లను 80ల నాటి క్లాసిక్ సినిమా పోస్టర్లు, అనలాగ్ ఫిల్మ్ స్టిల్స్ తరహాలో రీ-ఇమాజిన్ చేస్తూ రూపొందించిన చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దక్షిణాది ముద్దుగుమ్మలు సమంత, సాయిపల్లవి, నయనతార, కీర్తి సురేష్, తమన్నా, రష్మిక మందన్నల ఫేస్‌లను 80ల నాటి కాటన్, పట్టు చీరలు, నాటి హెయిర్‌స్టైల్స్, వింటేజ్ మేకప్‌లతో రీ-క్రియేట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
ఆకట్టుకుంటున్న రెట్రో ఏఐ లుక్స్
ఇప్పుడు ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో హీరోయిన్ల రెట్రో లుక్స్ వైరల్ గా మారాయి. కేవలం ఆర్ట్ గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా, నాటి ఫిల్మ్ గ్రెయిన్ ఎఫెక్ట్, సాఫ్ట్ లైటింగ్, వింటేజ్ కలర్ టోన్‌లతో ఈ పిక్స్ డిజైన్ చేసి ఏఐ ఇస్తుంది. దీంతో నిజంగానే ఇవి 80ల కాలంలో తీసిన ఫోటోగ్రాఫ్‌లాలా అనిపించేలా ఉన్నాయి.
నోస్టాల్జియా
సినీ రంగంలో ఏఐ టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఫ్యాన్ ఆర్ట్, పాప్ కల్చర్ పరంగా ఇది సరికొత్త విప్లవాన్ని తెచ్చిపెట్టింది. గతంలో అభిమానులు డిజిటల్ పెయింటింగ్స్ లేదా ఫోటోషాప్‌ల ద్వారా తమ అభిమాన నటీనటులను విభిన్న గెటప్‌లలో ఊహించుకునేవారు.
కానీ నేటి మిడ్‌జర్నీ, బింగ్ ఇమేజ్ క్రియేటర్, డాల్-ఈ వంటి అధునాతన ఏఐ టూల్స్ కేవలం కొద్దిపాటి టెక్స్ట్ ప్రాంప్ట్‌లతోనే అత్యంత పర్ఫెక్ట్ విజువల్స్‌ను రూపొందిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో 'నోస్టాల్జియా' (పాత జ్ఞాపకాలు) ఎప్పుడూ అత్యధిక క్లిక్స్ సాధించే అంశమే. దీంతో 80ల వింటేజ్ సౌత్ సినిమా హీరోయిన్ల లుక్స్ వైరల్ అవుతున్నాయి..
వైరల్ ఏఐ ప్రాంప్ట్స్
ఈ వింటేజ్ ఫోటోలను క్రియేట్ చేయడానికి '1980s సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టిల్, పోర్ట్రెయిట్ ఆఫ్ సౌత్ యాక్ట్రెస్, వింటేజ్ పట్టు సారీ, గ్రెయిన్ ఫిల్మ్ టెక్స్చర్, వార్మ్ కలర్ గ్రేడింగ్, హౌ ఐ లుక్ లైక్ ఇన్ 1980' వంటి ప్రత్యేకమైన ప్రాంప్ట్‌లను ఉపయోగిస్తున్నారు.
ఈ ఫోటోలను చూసిన సినీ ప్రేమికులు శ్రీదేవి, జయప్రద, విజయశాంతి, రాధ వంటి నాటి దిగ్గజ కథానాయికల వైభవాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుత నటీనటులు కూడా 80ల నాటి కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తే చూడాలని ఉందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకుంటున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


