Sreeleela Dating: శ్రీలీల ఆ స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందా? ఆమె తల్లి రియాక్షన్ ఇలా..

Sreeleela Dating: టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ, టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె టీమ్ తో పాటు తల్లి డాక్టర్ స్వర్ణలత తీవ్రంగా స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, వారిద్దరూ కనీసం ఒక్కసారి కూడా కలవలేదని స్పష్టం చేశారు.

Published on: May 18, 2026, 15:04:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sreeleela Dating: సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు ఒక్కోసారి ఊహించని రేంజ్ కి వెళ్తుంటాయి. సెలబ్రిటీల మధ్య ఏదో ఉందంటూ వచ్చే చిన్న గాసిప్, చూస్తూనే పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతుంది. తాజాగా టీమిండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల లవ్ స్టోరీ అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ గత ఏడాది కాలంగా డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వైరల్ అవ్వడంతో శ్రీలీల టీమ్, ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత రంగంలోకి దిగి ఈ రూమర్లకు గట్టి బ్రేక్ వేశారు.

Sreeleela Dating: శ్రీలీల ఆ స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందా? ఆమె తల్లి రియాక్షన్ ఇలా..
Sreeleela Dating: శ్రీలీల ఆ స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందా? ఆమె తల్లి రియాక్షన్ ఇలా..

అసలు ఇద్దరూ కలుసుకోనే లేదు

ఈ డేటింగ్ వార్తలపై శ్రీలీల పీఆర్ టీమ్ ప్రముఖ మీడియా సంస్థ 'పింక్‌విల్లా'తో మాట్లాడుతూ ఘాటుగా స్పందించింది. "శ్రీలీల, తిలక్ వర్మపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. నిరాధారమైనవి. అసలు వీరిద్దరూ ఇప్పటివరకు ఎప్పుడూ కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు కూడా. ఎలాంటి నిజాలు లేకుండా ఇలాంటి కల్పిత కథనాలను ప్రచారం చేయడం సరికాదు" అని శ్రీలీల టీమ్ స్పష్టం చేసింది.

అది కేవలం ఊహా జనితం: డాక్టర్ స్వర్ణలత

మరోవైపు శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత 'డెక్కన్ క్రానికల్' పత్రికతో మాట్లాడుతూ ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. "ఈ రూమర్లలో ఎంతమాత్రం నిజం లేదు. ఇలాంటి కథలు ఎలా పుడతాయో మాకు అస్సలు అర్థం కావడం లేదు. శ్రీలీల, తిలక్ వర్మ గత ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్త కేవలం కొందరి ఊహాజనితం మాత్రమే" అని ఆమె తేల్చి చెప్పారు.

సూర్యకుమార్ యాదవ్ వీడియోతో పెరిగిన సెగ

ఇంతకీ ఈ గాసిప్స్ ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చేసిన ఒక చిన్న అల్లరి పని. ఇటీవల ధర్మశాలలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల తల్లి స్వర్ణలత స్టేడియంలో కనిపించారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనికి తోడు శ్రీలీల టీమ్‌కి చెందిన ఒకరు 'తిలక్' జెర్సీ వేసుకుని మ్యాచ్‌కి వెళ్లారని, ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు రియాక్ట్ అయి, రూమర్స్ రాగానే అన్‌ఫాలో చేసుకున్నారంటూ నెటిజన్లు కథలు అల్లారు.

ఈ క్రమంలోనే హోటల్ లాబీలో సూర్యకుమార్ యాదవ్.. తిలక్ వర్మను ఆటపట్టిస్తూ.. "తిలక్ వర్మ లవ్‌లో ఉన్నాడు" అంటూ సరదాగా వ్యాఖ్యానించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో నెటిజన్లు ఆ కామెంట్స్ ని శ్రీలీలకు ముడిపెడుతూ సోషల్ మీడియాను షేక్ చేశారు.

జూన్ లో నీట్ పీజీ పరీక్ష.. చేతినిండా సినిమాలు

ప్రస్తుతం శ్రీలీల తన కెరీర్‌తో పాటు చదువుపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు స్వర్ణలత వెల్లడించారు. "శ్రీలీల ప్రస్తుతం జూన్ లో జరగబోయే నీట్-పీజీ (NEET-PG) ఎంట్రన్స్ పరీక్ష కోసం సిద్ధమవుతోంది. చదువు, సినిమాలతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది. ఇలాంటి వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడానికి ఆమెకు ఇంకా ఐదారేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం ఆమె చదువును, కెరీర్‌ను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తోంది" అని స్వర్ణలత పేర్కొన్నారు.

క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న లక్కీ బ్యూటీ

గతేడాది 'రాబిన్‌హుడ్', 'జూనియర్', 'మాస్ జాతర' సినిమాలతో సందడి చేసిన శ్రీలీల.. ఈ ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతికి విడుదలైన 'పరాశక్తి' సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది.

కోలీవుడ్ స్టార్ ధనుష్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఓ బాలీవుడ్ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తూ హిందీ చిత్రసీమలోకీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్న నటిపై ఇలాంటి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయడం పట్ల టాలీవుడ్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More