Varanasi: వారణాసి ఓ టైమ్ ట్రావెల్ స్టోరీ.. అంటార్కిటికా నుంచి ప్రాచీన రోమ్ వరకు..: మహేష్ మూవీ స్టోరీ చెప్పిన రాజమౌళి
Varanasi Story: వారణాసి స్టోరీ ఏంటో చెప్పేశాడు డైరెక్టర్ రాజమౌళి. మహేష్ బాబుతో భారీ స్థాయిలో తీస్తున్న ఈ సినిమా ఓ టైమ్ ట్రావెల్ స్టోరీ అని, అంటార్కిటికా నుంచి ప్రాచీన రోమ్ వరకు కథ సాగనున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Varanasi: ఇండియన్ సినిమా దశ దిశ మార్చేసిన దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’ నుంచి ఊహించని క్రేజీ లీక్ బయటకొచ్చింది. ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్‌లో 'టైమ్ ట్రావెల్' కాన్సెప్ట్‌తో పాటు ప్రాచీన రోమ్, అంటార్కిటికా బ్యాక్‌డ్రాప్ ఉండబోతోందని రాజమౌళి స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు రాజమౌళి పూనకాలు తెప్పించారు.

ప్రపంచాన్ని చుట్టేసే కథ.. ప్రాచీన రోమ్‌లోకి మహేష్ బాబు
ఇటీవల సౌనామి (Tsounami)కి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో రాజమౌళి వారణాసి సినిమా కథాంశం, విజువల్ స్కేల్ గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ప్రయాణం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో ప్రారంభమై అంటార్కిటికా, ఆఫ్రికా అడవుల గుండా సాగుతుందని వెల్లడించారు.
అంతేకాకుండా టైమ్ ట్రావెల్ ఆర్క్ ద్వారా వీక్షకులను ప్రాచీన రోమ్ సామ్రాజ్య కాలానికి తీసుకెళ్తుందని, చివరకు కథ మళ్లీ వారణాసిలోనే ముగుస్తుందని స్పష్టం చేశారు.
ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ కథను చెప్పడానికి కాదని, సినిమా విజువల్ గ్రాండియర్, బిగ్ స్కేల్ ఎలా ఉండబోతోందో చూపించడానికేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
80 శాతం షూటింగ్ కంప్లీట్.. భారీ యాక్షన్ సీన్లు ఫినిష్
'వారణాసి' ప్రొడక్షన్ అప్‌డేట్ ఇస్తూ రాజమౌళి ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చారు. "మేము ఇప్పటికే సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తి చేశాం. మిగిలిన 20 శాతం పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కథలోని బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పుడు కేవలం కొన్ని చిన్న సీన్లు, ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాయి" అని రాజమౌళి వివరించారు.
ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ (VFX) పనులు కూడా షూటింగ్‌తో పాటు సమాంతరంగా రన్ అవుతున్నాయని, అవుట్‌పుట్ వేగంగా రెడీ అవుతోందని చెప్పారు.
మహేష్ బాబు గ్లోబల్ లుక్..
హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ 'గ్లోబ్‌ట్రాటర్' (Globetrotter) ఈవెంట్‌లో మహేష్ బాబు ఫస్ట్ లుక్, క్యారెక్టర్ డీటైల్స్ రివీల్ చేయగా సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ఈ సినిమాలో 'మందాకిని' అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తోంది. జులై 18న ఆమె 44వ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన రోసీ అండ్ ఫియర్స్ లుక్ గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అయింది.
మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కుంభ అనే ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది.
'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డులు అవుట్.. ఏప్రిల్ 7, 2027న గ్లోబల్ రిలీజ్
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంతో ఆస్కార్ సాధించి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన రాజమౌళి.. ఈసారి అంతకు మించిన ఇంటర్నేషనల్ కంటెంట్‌తో వస్తున్నారు. 93 ఏళ్ల ఫ్రెంచ్ లెజెండరీ డైరెక్టర్ కోస్టా-గవ్రాస్ సైతం బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను వరుసగా 8 గంటల పాటు చూసి అభినందించడం రాజమౌళి అంతర్జాతీయ క్రేజ్‌కు నిదర్శనం.
ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపుదిద్దుకుంటున్న 'వారణాసి' చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్రొడక్షన్ టీమ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


