Sindhu Rajamouli: సినిమాల్లోకి పీవీ సింధు.. రాజమౌళి మూవీలో నటించేందుకు సిద్ధంగా బ్యాడ్మింటన్ ఛాంపియన్.. ఆ ట్వీట్ వైరల్!
Sindhu Rajamouli: బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్ పట్టి, భారత్ కు ఎన్నో పతకాలు అందించిన ఛాంపియన్ పీవీ సింధు.. ఇప్పుడు యాక్టింగ్ కు సై అంటోంది. లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించేందుకు సిద్దంగా ఉన్నానని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Sindhu Rajamouli: భారత క్రీడారంగంలో రికార్డుల వీరురాలు పీవీ సింధు, భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారింది. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంపై ఉన్న హైప్‌కు ఈ ట్విట్టర్ సంభాషణ మరింత గ్లామర్ జోడించింది.

రాజమౌళి ట్వీట్
జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించి కంబ్యాక్ ఇచ్చిన పీవీ సింధును అభినందిస్తూ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. "జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు శుభాకాంక్షలు.. వాట్ ఏ ఛాంపియన్స్ కంబ్యాక్.. భారతదేశం నీ గురించి గర్విస్తోంది" అని రాజమౌళి పోస్ట్ చేశారు.
సింధు రిప్లే
రాజమౌళి ట్వీట్ కు పీవీ సింధు సరదాగా రియాక్టయింది. "థ్యాంక్యూ సో మచ్ రాజమౌళి సార్. మీ 'వారణాసి' సినిమా కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీ సినిమాలో ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర అవసరమైతే, మీ కొత్త హీరోయిన్‌గా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నా" అని నవ్వుతున్న ఎమోజీలతో సింధు ట్వీట్ చేసింది.
'వారణాసి' లో గ్లోబల్ కామియోస్ ఉంటాయా?
సాధారణంగా రాజమౌళి సినిమాల్లో ప్రతీ క్యారెక్టర్‌కు ఒక బలమైన నేపథ్యం ఉంటుంది. పీవీ సింధు చేసిన ఈ సరదా ఆఫర్‌ను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రాజమౌళి సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించిన విషయాన్ని టాలీవుడ్ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
ఏదేమైనా ఆఫ్రికన్ అడవులు, అంటార్కిటికా, వారణాసి నేపథ్యంలో సాగే ఈ ఆల్-టైమ్ బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ వారణాసిలో స్పోర్ట్స్ స్టార్స్ లేదా గ్లోబల్ ఐకాన్స్ చిన్న రోల్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వారణాసి రిలీజ్ డేట్
ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా బ్రాండ్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ లేదా బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. గ్లోబల్ పాప్ కల్చర్‌లో భాగంగా మారింది. 2027 ఏప్రిల్ 7న వారణాసి మూవీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, అప్ డేట్స్ ఇప్పటికే తెగ వైరల్ గా మారాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


