Varanasi: వారణాసి నుంచి ప్రియాంకా చోప్రా కొత్త లుక్ చూశారా? అప్పుడు చీర, ఇప్పుడు పూర్తిగా మోడ్రన్ డ్రెస్‌లో..

Varanasi: వారణాసి నుంచి ప్రియాంకా చోప్రా కొత్త లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. శనివారం (జులై 18) ఆమె బర్త్ డే సందర్భంగా రాజమౌళి ఈ సరికొత్త మందాకిని లుక్ రిలీజ్ చేస్తూ.. ఆమె నవ్వితే గ్రేస్, నవ్వకపోతే ఫైర్ అనే క్యాప్షన్ ఉంచడం విశేషం.

Published on: Jul 18, 2026, 10:10:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Varanasi: గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లేటెస్ట్ అడ్వెంచరస్ డ్రామా 'వారణాసి' నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన 'ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ' పోర్టల్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ విజువల్స్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు పీసీ ఫస్ట్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Varanasi: వారణాసి నుంచి ప్రియాంకా చోప్రా కొత్త లుక్ చూశారా? అప్పుడు చీర, ఇప్పుడు పూర్తిగా మోడ్రన్ డ్రెస్‌లో..
Varanasi: వారణాసి నుంచి ప్రియాంకా చోప్రా కొత్త లుక్ చూశారా? అప్పుడు చీర, ఇప్పుడు పూర్తిగా మోడ్రన్ డ్రెస్‌లో..

'మందాకిని'గా ప్రియాంక చోప్రా ఊరమాస్ యాక్షన్ అవతార్

మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్‌ వారణాసిలో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ ప్రెజెంట్ చేసిన స్పెషల్ పిక్‌లో పీసీ కంప్లీట్ యాక్షన్ అవతార్‌లో రఫ్ అండ్ టఫ్ లుక్‌తో కనిపిస్తూ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించింది.

హాలీవుడ్ సిరీస్ 'సిటాడెల్', 'క్వాంటికో' లతో ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్షన్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. రాజమౌళి విజన్‌లో అంతకుమించిన వైల్డ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ మూవీ నుంచి కొన్నాళ్ల కిందట వచ్చిన ఫస్ట్ లుక్ లో ఎల్లో కలర్ చీరలో, చేతిలో గన్ పట్టుకొని కనిపించిన ప్రియాంక.. ఇప్పుడు మోడ్రన్ లుక్ తో అదరగొట్టింది.

ఈ పిక్ బయటకు వచ్చిన నిమిషాల్లోనే ఇంటర్నెట్‌ను షేక్ చేయడం స్టార్ట్ చేసింది. గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం మెస్మరైజ్ చేసేలా ఉన్న పీసీ మేకోవర్, ఆమె కళ్లల్లో కనిపిస్తున్న ఫైర్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రియాంక, చాలా ఏళ్ల తర్వాత ఇండియన్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇంతటి భారీ యాక్షన్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

నవ్వితే గ్రేస్.. నవ్వకపోతే ఫైర్

తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి తన మందాకిని పాత్ర కొత్త లుక్స్ ను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనికి ఆయన పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె నవ్వితే గ్రేస్.. నవ్వకపోతే ఫైర్ అంటూ రెండు వేర్వేరు లుక్స్ ను జక్కన్న పోస్ట్ చేయడం విశేషం. అది చూసిన ఫ్యాన్స్ ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు.

రాజమౌళి - మహేష్ బాబు కాంబో.. కలెక్షన్ల జాతర పక్కా

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినాను ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లతో ప్రూవ్ చేసిన రాజమౌళి.. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ పోషిస్తున్న ఈ 'వారణాసి' మూవీ ఇండియన్ సినీ హిస్టరీలోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మహేష్ బాబు అల్ట్రా మోడ్రన్ ఇంటర్నేషనల్ లుక్, రాజమౌళి నెక్స్ట్ లెవెల్ మేకింగ్ స్టైల్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ కాబోతున్నాయి.

ఈ విజువల్ వండర్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్, వీఎఫ్ఎక్స్ కంపెనీలు వర్క్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. గ్లోబల్ సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ మూవీని 2027 ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ ప్రమోషన్స్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More