Rajamouli Varanasi: వారణాసి టైమ్ ట్రావెల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. తండ్రీకొడుకుల ఎమోషన్, అడ్వెంచర్: రాజమౌళి

Rajamouli Varanasi: దర్శకధీరుడు రాజమౌళి.. తన రాబోయే చిత్రం 'వారణాసి' కథా నేపథ్యాన్ని తొలిసారి వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రం కేవలం టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ మాత్రమే కాదని, దీని వెనుక బలమైన తండ్రీకొడుకుల ప్రేమ, ఎమోషన్ ఉందో వివరించారు.

Published on: Oct 26, 2026, 17:47:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rajamouli Varanasi: తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక వరకు తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్' (RRR) వంటి సంచలన విజయం తర్వాత తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి.

Rajamouli Varanasi: వారణాసి టైమ్ ట్రావెల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. తండ్రీకొడుకుల ఎమోషన్, అడ్వెంచర్: రాజమౌళి
Rajamouli Varanasi: వారణాసి టైమ్ ట్రావెల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. తండ్రీకొడుకుల ఎమోషన్, అడ్వెంచర్: రాజమౌళి

తాజాగా బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (São Paulo International Film Festival) పాల్గొన్న రాజమౌళి.. అక్కడ బ్రెజిలియన్ యూట్యూబ్ ఛానెల్ 'ALMANAQUE21'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో 'వారణాసి' సినిమా కథా నేపథ్యం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. అంటార్కిటికా, ఆఫ్రికా నుంచి పౌరాణిక కాలం వరకు సాగే ఈ ఎపిక్ విజువల్ వండర్‌లో రామాయణంలోని రామ-కుంభకర్ణ యుద్ధ ఘట్టం కూడా ఉండనుందని క్లారిటీ ఇచ్చారు.

మాటలు చెప్పలేని కథనం.. అందుకే ఆ విజువల్స్ చూపించాం

'ఆర్ఆర్ఆర్' లేదా తన మునుపటి సినిమాలాగా 'వారణాసి' కథను మాటల్లో ఎందుకు వివరించలేదో రాజమౌళి వివరిస్తూ.. "కొన్ని సినిమాల కథల పరిధి ఎంత విస్తృతంగా ఉంటుందంటే, మాటలు ఆ కథకు పూర్తి న్యాయం చేయలేవు. అందుకే 'వారణాసి' ప్రపంచం ఎలా ఉండబోతోందో ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మాటలు చెప్పకుండానే గతంలో ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశాం. ఆ వీడియో ద్వారా ప్రేక్షకులు ఏ తరహా విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించబోతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది" అని వ్యాఖ్యానించారు.

టైమ్ ట్రావెల్ వెనుక ఉన్న అసలైన ఎమోషన్

ఈ సినిమా కేవలం టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ మాత్రమేనా అన్న ప్రశ్నకు రాజమౌళి పవర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

"ఇది విభిన్న ప్రపంచాల గుండా సాగే ఒక ఎపిక్ అడ్వెంచర్. అంటార్కిటికా మంచు ఖండం, ఆఫ్రికా దట్టమైన అడవులు, పురాతన వారణాసి నగరం నుంచి పౌరాణిక కాలం వరకు కథ రకరకాల టైమ్ జోన్లలో ప్రయాణిస్తుంది. పురాణాల్లోని రాక్షసులు, దేవతలు, వింత జీవులు ఈ ప్రయాణంలో కనిపిస్తారు. అయితే ఈ మొత్తం అడ్వెంచర్‌కు అసలైన డ్రైవింగ్ ఫోర్స్ మాత్రం తండ్రీకొడుకుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అలాగే ఒక పురుషుడు-స్త్రీ మధ్య ఉండే గాఢమైన ప్రేమ ఎమోషన్. ఆ మానవీయ సంబంధాలే ఈ భారీ అడ్వెంచర్‌ను ముందుకు నడిపిస్తాయి" అని జక్కన్న వెల్లడించారు.

రామాయణ ఘట్టం, నటీనటుల పాత్రలు

'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' (Rudhra) పాత్రలో కనిపిస్తుండగా, గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడిగా ‘కుంభ’ పాత్రలో నటిస్తున్నారు. ఇక గతంలో విడుదల చేసిన గ్లింప్స్‌లో మహేష్ బాబు శ్రీరాముడి లుక్‌లో కనిపిస్తారనే సంకేతాలు రావడంపై క్లారిటీ వచ్చింది.

ఇటీవల 'ఎంపైర్ ఫిల్మ్ పాడ్‌కాస్ట్'లో మాట్లాడిన రాజమౌళి, భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై తనకు పూర్తి సంతృప్తి లేదని, 'వారణాసి'లో శ్రీరాముడు, కుంభకర్ణుడి నడుమ సాగే ఒక పవర్‌ఫుల్ యుద్ధ ఘట్టాన్ని అత్యంత గ్రాండ్‌గా చూపించబోతున్నట్లు తెలిపారు.

విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచిల స్క్రీన్‌ప్లేతో, శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ భారీ విజువల్ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న (ఉగాది పండుగ కానుకగా) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More