Rajamouli: వారణాసి మూవీ షూటింగ్ మొత్తం ఎన్ని రోజులో తెలుసా? రాజమౌళి చెప్పిన సీక్రెట్ ఇదే.. ఆర్ఆర్ఆర్ కంటే బిగ్గర్!

Rajamouli: తాను అనుకున్న విధంగా సినిమా తెరకెక్కించడం కోసం దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎక్కువ టైమ్ తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. అలాంటి పర్ఫెక్షనిస్ట్ అయిన రాజమౌళి ఇక వారణాసి షూటింగ్ మొత్తానికి ఎన్ని రోజులు తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు. స్వయంగా జక్కన్ననే ఈ సీక్రెట్ బయటపెట్టారు.

Published on: Oct 24, 2026, 18:43:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rajamouli: లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న 'వారణాసి' (Varanasi) గురించి జక్కన్న క్రేజీ సీక్రెట్ చెప్పారు. రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంపై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

వారణాసి మూవీ షూటింగ్ మొత్తం ఎన్ని రోజులో తెలుసా? రాజమౌళి చెప్పిన సీక్రెట్ ఇదే.. ఆర్ఆర్ఆర్ కంటే బిగ్గర్! (x)
వారణాసి మూవీ షూటింగ్ మొత్తం ఎన్ని రోజులో తెలుసా? రాజమౌళి చెప్పిన సీక్రెట్ ఇదే.. ఆర్ఆర్ఆర్ కంటే బిగ్గర్! (x)

బ్రెజిల్ లో రాజమౌళి

బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక '50వ సావోపాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' (Mostra de São Paulo)కు రాజమౌళి హాజరయ్యారు. అక్కడ అవార్డు కూడా అందుకున్నారు. అదే వేదికపై వారణాసి మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను జక్కన్న వెల్లడించారు. బ్రెజిల్ దేశానికి రాజమౌళి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే 6 రెట్లు పెద్దది

ఈ ఫెస్టివల్‌లో ప్రేక్షకులతో ముచ్చటించిన రాజమౌళి.. 'వారణాసి' చిత్రం స్కేల్ పరంగా తన గత ఇండస్ట్రీ హిట్ 'ఆర్‌ఆర్‌ఆర్‌' కంటే ఐదు నుంచి ఆరు రెట్లు పెద్దది అని సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమా కోసం తాను మునుపెన్నడూ లేనంతగా పేపర్ వర్క్ (ప్రీ-ప్రొడక్షన్) చేశానని, పూర్తి సన్నద్ధతతోనే సెట్స్‌పైకి వెళ్లానని చెప్పారు.

వారణాసి షూటింగ్ టైమ్

"మేము ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని 315 రోజుల్లో చిత్రీకరించాం. కానీ 'వారణాసి' దానికంటే చాలా పెద్ద సినిమా అయినప్పటికీ, పక్కా ప్లానింగ్ వల్ల కేవలం 275 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేస్తున్నాం. దీనివల్ల మాకు 40 రోజుల విలువైన సమయం కలిసి వచ్చింది" అని ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి సీక్రెట్ బయటపెట్టారు.

వారణాసి సినిమాలో ఆఫ్రికా జంగిల్స్, అంటార్కిటికా వంటి అద్భుతమైన లోకేషన్స్ ఉండబోతున్నాయని, 6-7 సినిమాలను కలిపి ఒకే సినిమాగా చూపిస్తే ఎలా ఉంటుందో 'వారణాసి' అలా ఉంటుందని జక్కన్న క్లారిటీ ఇచ్చారు.

ఇంకో 10 రోజులే!

వారణాసి సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను కూడా రాజమౌళి రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్ 2026 ఆఖరి నాటికి ఈ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని, ఆ తర్వాత చిత్ర బృందం పూర్తిగా గ్రాఫిక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనుందని తెలిపారు.

ఈ వారణాసి చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం (రుద్ర పాత్రతో పాటు మైథాలజీ సీక్వెన్స్‌లో శ్రీరాముడిగా) చేస్తుండగా.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం బ్రెజిల్‌లో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వెళ్లడంపై రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే 'వారణాసి' చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై కంటే థియేటర్లలోనే భారీ రెస్పాన్స్ రావాలని గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ గ్లోబల్ అడ్వెంచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు థియేటర్లలోనే, ముఖ్యంగా ఐమాక్స్ (IMAX 1.43:1 ఫార్మాట్) స్క్రీన్స్‌పై అనుభూతి చెందాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారణాసి చిత్రాన్ని ఉగాది పండుగ కానుకగా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్నట్లు డేట్ లాక్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More