Rajamouli Varanasi: అంటార్కిటికా మంచులో వారణాసి క్లైమాక్స్.. సెప్టెంబర్‌తో ముగింపు.. రాజమౌళి చెప్పిన సెన్సేషనల్ సీక్రెట్
Rajamouli Varanasi: వారణాసి మూవీ గురించి డైరెక్టర్ రాజమౌళి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా వెరైటీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ను అతడు పంచుకున్నాడు.
Rajamouli Varanasi: గ్లోబల్ ఫిల్మ్ మేకర్ ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi). ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చింది. అంతర్జాతీయ సినీ సర్కిల్స్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 'ఆనెసీ యానిమేషన్ ఫెస్టివల్' (Annecy Animation Festival)లో పాల్గొన్న రాజమౌళి.. అక్కడ 'వెరైటీ' (Variety)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి గురించిన క్రేజీ సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు.

'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలతో ఇండియన్ మేకింగ్ స్టాండర్డ్స్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈ సినిమాతో అంతకుమించి అనేలా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
అంటార్కిటికా మంచు నుంచి అంతరిక్షం వరకు..
ఈ వారణాసి సినిమా స్టోరీ లైన్ వింటేనే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. వేలాది సంవత్సరాల టైమ్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి నగరం అంతరిక్షం నుంచి దూసుకొచ్చే ఒక భారీ ఆస్టరాయిడ్ (గ్రహ శకలం) వల్ల ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందనే పాయింట్ చుట్టూ స్క్రిప్ట్ రెడీ చేశారు.
దీనికోసం అంటార్కిటికా లాంటి అత్యంత ప్రమాదకరమైన మంచు లోకేషన్లలో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం కోసం ఈ సినిమాను 70mm ఐమాక్స్ (IMAX) ఫిలిం కెమెరాలతో షూట్ చేస్తుండటం విశేషం.
షూటింగ్‌పై రాజమౌళి ఓపెన్ టాక్!
వారణాసి సినిమా ప్రొడక్షన్ స్టేజ్ గురించి రాజమౌళి వివరిస్తూ.. తాము ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నామని చెప్పారు. సినిమాలో హైలైట్ గా నిలిచే కళ్లు చెదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లన్నీ ఇప్పటికే అయిపోయినట్లు క్లారిటీ ఇచ్చారు.
"మేము వారణాసి సినిమాకు సంబంధించిన చాలా పెద్ద పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేసేశాం. పెద్ద యాక్షన్ షెడ్యూల్స్ అన్నీ అయిపోయాయి. ప్రస్తుతం కథను ముందుకు నడిపించే చిన్న చిన్న కనెక్టింగ్ సీన్స్, టాకీ పార్ట్ మాత్రమే షూట్ చేస్తున్నాం. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారం కల్లా మొత్తం షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేస్తాం" అని రాజమౌళి స్పష్టం చేశారు.
ఐమాక్స్ ఫార్మాట్ కోసం తాము స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని జక్కన్న తెలిపారు. తాము అనుకున్న ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఐమాక్స్ స్క్రీన్స్ పైనే బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తాయని మొదటి నుంచి నమ్మామన్నారు. మన కళ్లు సినిమాస్కోప్ ఫార్మాట్‌కు అలవాటు పడటం వల్ల స్టార్టింగ్ డేస్‌లో ఐమాక్స్ ఫ్రేమింగ్ కోసం కాస్త అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందని, ఆ తర్వాత టెక్నిక్ పట్టుకుని విజువల్ వండర్‌గా మలిచామని చెప్పుకొచ్చారు.
బాహుబలి యానిమేషన్ వరల్డ్.. ఇషాన్ శుక్లాకు జక్కన్న సపోర్ట్
వారణాసి సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ.. 'బాహుబలి' ఫ్రాంచైజీని అంతర్జాతీయ యానిమేషన్ మార్కెట్ లోకి తీసుకెళ్లేందుకు రాజమౌళి పక్కా ప్లాన్ రెడీ చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఇషాన్ శుక్లా లీడర్‌షిప్‌లో వస్తున్న 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' (Baahubali: The Eternal War) ఫీచర్ ఫిల్మ్ ద్వారా ఇండియన్ యానిమేషన్ ఇండస్ట్రీ రేంజ్‌ను మార్చబోతున్నారు.
బాహుబలి ప్రపంచానికి సంబంధించి ఇప్పటికే భారీగా బ్యాక్‌స్టోరీ రాసి ఉందని, ఇషాన్ ఈ కథను భారతీయ పురాణాల్లోని 14 లోకాల బ్యాక్‌డ్రాప్‌లోకి తీసుకెళ్లే ఐడియా చెప్పగానే తనకు విపరీతంగా నచ్చేసిందని రాజమౌళి కొనియాడారు.
ఇండియన్ స్టోరీస్‌లో ఉండే అసలైన బ్యూటీ 'కలర్' (ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్స్) అని, లైవ్ యాక్షన్‌లో చూపించలేని ఎన్నో అద్భుతాలను యానిమేషన్ ద్వారా చాలా ఈజీగా విజువలైజ్ చేయవచ్చని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి టేస్ట్ చూసిన గ్లోబల్ ఆడియన్స్ ఈ సరికొత్త యానిమేషన్ విజువల్ ట్రీట్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమోషన్ అనే విత్తనం నుంచే విజువల్స్ అనే భారీ వృక్షం పుడుతుందని జక్కన్న తన మార్క్ ఫిలాసఫీని పంచుకున్నారు.
ఐమాక్స్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన రాజమౌళి
ఈ ఇంటర్వ్యూలో హైదరాబాద్ సిటీకి ఐమాక్స్ థియేటర్లు తిరిగి రావడంపై రాజమౌళి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉన్న సినిమా పిచ్చి ప్రపంచంలో మరెక్కడా ఉండదని కొనియాడారు.
"ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ బఫ్స్ (సినిమా పిచ్చోళ్లు) మన ఆంధ్రా, తెలంగాణలోనే ఉన్నారు. వాళ్లు కేవలం తెలుగు సినిమాలనే కాదు.. హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ ఇలా ఏ లాంగ్వేజ్ కంటెంట్ అయినా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. అలాంటి ఆడియన్స్‌కు ఒక పర్ఫెక్ట్ ఐమాక్స్ థియేటర్ దక్కడం ఎంతో అవసరం. గతంలో ప్రసాద్ ఐమాక్స్ (Prasads IMAX)లో బెస్ట్ 70mm ప్రొజెక్టర్ ఉండేది. కానీ ఐమాక్స్ డిజిటల్‌గా మారాక ఆ మ్యాజిక్ మిస్ అయింది. వేరే సిటీస్ లో ఐమాక్స్ ఉండి మన దగ్గర లేకపోవడం ఒక ఫిల్మ్ లవర్‌గా నన్ను చాలా ఫ్రస్ట్రేషన్‌కు గురిచేసింది. కానీ ఫైనల్‌గా మళ్లీ హైదరాబాద్ లో ఐమాక్స్ వస్తుండటం నాకు ఎంతో హ్యాపీగా ఉంది" అని రాజమౌళి ముగించారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ వారణాసి సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7, 2027 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


