Baahubali 3: బాహుబలి 3 కూడా ఉంది- జక్కన్న లేని టైమ్ చూసి చెప్పిన రానా, అనుష్క- చేతివేళ్లతో కన్ఫర్మ్ చేసిన ప్రభాస్!
Rana Anushka Prabhas Confirms Baahubali 3: బాహుబలి 3 కూడా ఉండనుందని తాజాగా రానా, అనుష్క చేసిన కామెంట్స్, దానికి ప్రభాస్ ఇచ్చిన చేతివేళ్ల సైగలు కన్ఫర్మ్ చేశాయి. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో జక్కన్న లేని టైమ్ చూసి బాహుబలి 3పై రానా చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది.
Rana Anushka Prabhas Confirms Baahubali 3: టాలీవుడ్ సంచలనం ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన 'బాహుబలి' దృశ్యకావ్యం భారతీయ సినిమా చరిత్రను ఎలా తిరగరాసిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, పాన్-ఇండియా అనే కొత్త మార్కెట్‌కు ఈ సినిమా గట్టి పునాది వేసింది.

ముగ్గురి కెరీర్‌ను మార్చిన సినిమా
రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి చిత్రం ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అయితే, 'బాహుబలి 2' ముగిసినప్పటి నుంచి ప్రతి సినిమా అభిమాని మనసులో ఒకటే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.. 'బాహుబలి 3' ఉంటుందా? ఉండదా? అని. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇవాళ ఓటీటీలోకి 'బాహుబలి: ది టార్చ్ బేరర్' అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ ఓటీటీ డాక్యుమెంటరీ వీడియోలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ముగ్గురూ కలిసి కూర్చుని ముచ్చటిస్తూ, బాహుబలి మూడో భాగంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ పవర్‌ఫుల్ ఫ్రాంచైజీలో పార్ట్ 3 రావడం ఖాయమని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పండగ చేసుకుంటున్నారు. ఆ వైరల్ వీడియోలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ భలే ట్విస్ట్ ఇచ్చారు.
రాజమౌళి లేని గ్యాప్‌లో రానా లీక్!
"ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెప్పవచ్చో లేదో నాకు తెలియదు. కానీ.. ఇక్కడ రాజమౌళి (జక్కన్న) గారు లేరు, శోభు గారు లేరు కాబట్టి నా మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నా. ప్రపంచం ఇంకా దీనికి సిద్ధంగా లేకపోవచ్చు, కానీ బాహుబలి ఉండబోతోంది..." అని రానా నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అనుష్క, రానా ఇద్దరూ ఒకేసారి బాహుబలి అని అంటుండగా.. మధ్యలో కూర్చున్న ప్రభాస్ తన చేతి వేళ్లను (3 ఫింగర్స్‌తో పార్ట్ 3 అన్నట్లుగా) పైకి లేపి చూపించబోయారు. వెంటనే ప్రభాస్ చేతులను అనుష్క, రానా కిందకు లాగి ఒక్కసారిగా నవ్వేశారు. ఆ వీడియో చివర్లో "ది లెగసీ కంటిన్యూస్" (వారసత్వం కొనసాగుతుంది) అనే క్యాప్షన్ పడింది.
సోషల్ మీడియాలో పూనకాలు.. ఫ్యాన్స్ హంగామా
దీంతో బాహుబలి 3పై అభిమానుల అనుమానాలు కాస్తా నమ్మకాలుగా మారిపోయాయి. ఈ చిన్న క్లిప్ బయటకు రాగానే నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హల్‌చల్ చేస్తున్నారు. బాహుబలి 3 అధికారికంగా ఖరారైపోయిందని పోస్టులు పెడుతున్నారు.
"భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద చిత్రానికి మూడో భాగం రాబోతోంది, ఇది అఫీషియల్" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. "స్వయంగా బాహుబలి (ప్రభాస్) నుంచే ఈ సైగ రావడంతో ఒళ్లు గగుర్పొడిచింది" అని మరొకరు రాసుకొచ్చారు.
ఓటీటీ సిరీస్ రూపంలోనా
జక్కన్న మళ్లీ మెగాఫోన్ పట్టి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తే, ఇది భారతీయ సినిమా పరిశ్రమలోనే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? కథ ఏ దిశగా సాగుతుంది? ఇది వెండితెరపై వస్తుందా లేక ఓటీటీ సిరీస్ రూపంలోనా అనే విషయాలపై దర్శకుడు రాజమౌళి లేదా నిర్మాత శోభు యార్లగడ్డ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


