Tamannaah: తమన్నా కాళ్లు పట్టుకోడానికి కూడా సిద్ధమే- నాలో కామం లేదు, మిల్కీ బాడీ అంటే మాత్రం! వివాదంపై నటుడు అన్ను కపూర్

Annu Kapoor About Tamannaah Bhatia Dood Badan Controversy: తమన్నాపై గతేడాది నటుడు అన్ను కపూర్ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. తమన్నా శరీరాన్ని అని పొగిడిన అన్ను కపూర్ తను కామంతో అనలేదని స్పష్టం చేశారు. తమన్నా బాధపడి ఉంటే కాళ్లు పట్టుకోడానికైనా సిద్ధమే అని అన్ను కపూర్ చెప్పారు.

Published on: Apr 24, 2026, 17:32:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Annu Kapoor On Tamannaah Bhatia Dood Badan Controversy: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీనియర్ నటుడు అన్ను కపూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. తాను అన్న మాటల్లో ఎలాంటి అశ్లీలత లేదని, కేవలం భాష మార్పిడి వల్లే రచ్చ జరిగిందంటూ ఆయన సమర్థించుకున్నారు.

తమన్నా కాళ్లు పట్టుకోడానికి కూడా సిద్ధమే- నాలో కామం లేదు, మిల్కీ బాడీ అంటే మాత్రం! వివాదంపై నటుడు అన్ను కపూర్
తమన్నా కాళ్లు పట్టుకోడానికి కూడా సిద్ధమే- నాలో కామం లేదు, మిల్కీ బాడీ అంటే మాత్రం! వివాదంపై నటుడు అన్ను కపూర్

అసలేం జరిగిందంటే?

గతేడాది ఒక ఇంటర్వ్యూలో 'స్త్రీ-2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' సాంగ్ గురించి అన్ను కపూర్ మాట్లాడుతూ.. తమన్నా అందాన్ని ఉద్దేశించి "మాషా అల్లా.. ఏం దూదియా బదన్ (పాల లాంటి శరీరం)" అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

సీనియర్ నటుడు అయి ఉండి, కూతురి వయసున్న నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నెటిజన్లు అప్పట్లో ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ ట్రోలింగ్‌తో నెట్టింట పెద్ద యుద్ధమే నడిచింది.

ఇంగ్లీషులో అంటే ఒప్పా? హిందీలో అంటే తప్పా?

తాజాగా సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ను కపూర్ ఈ తమన్నా బాడీ కామెంట్స్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. "నేను అన్న మాటల వల్ల కొందరు నన్ను తిట్టారు. అదే విషయాన్ని ఇంగ్లీషులో 'మిల్కీ బాడీ' అని ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ హిందీలో అన్నందుకే అందరికీ సమస్యగా మారింది. మన భాషలో అంటే అది బూతులా కనిపిస్తుందా?" అని ఆయన ప్రశ్నించారు. తమన్నా వయసు 30 ఏళ్ల లోపే ఉండొచ్చని, తన పిల్లలు కూడా అదే వయసులో ఉన్నారని, ఒక తండ్రిలాగే తాను ఆమెను అభినందించానని చెప్పుకొచ్చారు.

నా మనసులో కామం లేదు

ఒకరి అందాన్ని మెచ్చుకోవడమంటే వారిపై వ్యామోహం ఉన్నట్టు కాదని అన్ను కపూర్ కుండబద్దలు కొట్టారు. "నేను ఆమె శరీరాకృతిని చూసి అభినందించాను తప్ప, నా మనసులో ఎలాంటి కామం లేదు. రోల్స్ రాయిస్ కారును చూసి బాగుందని మెచ్చుకుంటాం.. అంత మాత్రాన ఆ కారు మనకే కావాలని కోరుకోం కదా! ఇదీ అంతే" అని వింత పోలిక తెచ్చారు అన్ను కపూర్.

అంతేకాదు, ఒకవేళ తన మాటల వల్ల తమన్నా నిజంగా బాధపడి ఉంటే, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్ను కపూర్ స్పష్టం చేశారు. తన ఉద్దేశం తప్పు కానప్పుడు భయపడాల్సిన పని లేదని అన్ను కపూర్ ధీమా వ్యక్తం చేశారు.

పిల్లల గురించి వింత వాదన

ఇదిలా ఉంటే, మరోవైపు అదే ఆజ్ కీ రాత్ పాట గురించి తమన్నా స్పందిస్తూ.. "పిల్లలు ఈ పాట వింటూ నిద్రపోతున్నారు" అని అనగా, దానికి అన్ను కపూర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు పిల్లలు అంటే ఎవరు? ఏ వయసు వారు? అని ప్రశ్నిస్తూ.. ఆమె డ్యాన్స్ చాలా ప్రశాంతంగా, పాజిటివ్‌గా ఉందని, అలాంటి మంచి పనిని ఎవరైనా అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణపై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. తమన్నాపై అన్ను కపూర్ చేసిన వ్యాఖ్య ఏమిటి?

తమన్నా డ్యాన్స్ చేసిన 'ఆజ్ కీ రాత్' పాటను ఉద్దేశించి "దూదియా బదన్" (పాల మేని ఛాయ) అని అన్ను కపూర్ వ్యాఖ్యానించారు.

2. ఈ వివాదంపై అన్ను కపూర్ వివరణ ఏమిటి?

భాష మార్పిడి వల్లే రచ్చ జరిగిందని, ఇంగ్లీషులో 'మిల్కీ బాడీ' అంటే లేని తప్పు హిందీలో అంటే ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు.

3. తమన్నాకు క్షమాపణలు చెబుతానని అన్ను కపూర్ అన్నారా?

అవును, ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల తమన్నా మనస్తాపానికి గురైతే, ఆమె పాదాలు తాకి క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More