Tamanna Fine Jewellery Brand: సొంత జ్యూవెలరీ బ్రాండ్ పరిచయం చేసిన తమన్నా- లక్మే ఫ్యాషన్ వీక్‌‌లో గ్లామర్ ఫొటోలు!

Tamanna Lakme Fashion Week Own Brand: ముంబైలో జరుగుతున్న లక్మే ఫ్యాషన్ వీక్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తనదైన శైలిలో మెరిశారు. డిజైనర్ భూమిక శర్మ రూపొందించిన 'ఆఫ్టర్‌గ్లో' కలెక్షన్‌ కోసం ర్యాంప్‌పై నడిచిన తమన్నా తన సొంత జ్యువెలరీ బ్రాండ్‌ను కూడా తొలిసారిగా పరిచయం చేశారు.

Published on: Mar 22, 2026, 13:01:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఫ్యాషన్ ప్రపంచంలో మరోసారి తన ముద్ర వేశారు. ముంబైలో జరుగుతున్న లక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ భూమిక శర్మ కోసం ఆమె షో స్టాపర్‌గా వ్యవహరించారు.

సొంత జ్యూవెలరీ బ్రాండ్ పరిచయం చేసిన తమన్నా- లక్మే ఫ్యాషన్ వీక్‌‌లో గ్లామర్ ఫొటోలు!
సొంత జ్యూవెలరీ బ్రాండ్ పరిచయం చేసిన తమన్నా- లక్మే ఫ్యాషన్ వీక్‌‌లో గ్లామర్ ఫొటోలు!

'బాహుబలి' వంటి భారీ చిత్రాల నుంచి ఇటీవలి 'స్త్రీ 2', 'జైలర్' చిత్రాల్లోని స్పెషల్ సాంగ్స్ వరకు తన నటనతో, డ్యాన్స్‌తో అలరిస్తున్న తమన్నా.. ఈ వేడుకలో తన ఫ్యాషన్ ఫిలాసఫీని పంచుకున్నారు.

సౌకర్యమే ప్రధానం: తమన్నా

ఫ్యాషన్ అంటే కేవలం ట్రెండ్స్ మాత్రమే కాదని, వ్యక్తిగత సౌకర్యం (Personal Comfort) కూడా ముఖ్యమని తమన్నా స్పష్టం చేశారు. "భూమిక శర్మ రూపొందించిన ఈ దుస్తుల్లో ర్యాంప్‌పై నడవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను వేసుకున్న డ్రెస్సుల్లో ఇది అత్యంత సౌకర్యవంతమైనది. నేను తరచుగా చెప్పేలా, బట్టలైనా, నగ లైనా నాకు 'కాజువల్ గ్లామర్' అంటేనే ఇష్టం. ప్రతిరోజూ ధరించగలిగేలా, సౌకర్యంగా ఉండటమే నా ప్రాధాన్యత" అని తమన్నా పేర్కొన్నారు.

ఎరుపు రంగులో సరికొత్త వైవిధ్యం

ఈ షోలో భూమిక శర్మ తన సరికొత్త కలెక్షన్ 'ఆఫ్టర్‌గ్లో' (Afterglow)ను ఆవిష్కరించారు. తమన్నా ధరించిన రాయల్ బ్లూమ్ ప్రింట్‌తో కూడిన కోర్సెట్, మెరిసే సీక్విన్స్ స్కర్ట్, ఎంబ్రాయిడరీ దుపట్టా అందరినీ ఆకర్షించాయి.

సాధారణంగా ఎరుపు రంగు దుస్తులు అంటే కేవలం పెళ్లిళ్లకే పరిమితం అనే ముద్ర ఉంటుంది. కానీ, ఈ అవుట్‌ఫిట్ ఆ మూస పద్ధతిని బ్రేక్ చేసిందని తమన్నా ప్రశంసించారు. ఇది చూడటానికి ఎంతో మోడ్రన్‌గా, ఫెమినిన్‌గా ఉందని బ్యూటిపుల్ తమన్నా అభిప్రాయపడ్డారు.

తమన్నా సొంత నగల బ్రాండ్ అరంగేట్రం

ఈ ఫ్యాషన్ షో తమన్నాకు మరో రకమైన ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. తమన్నా స్వయంగా డిజైన్ చేసిన తన సొంత జ్యువెలరీ లైన్‌ (Jewellery Line) నగలను తొలిసారిగా ఇక్కడే ధరించారు. "నా సొంత బ్రాండ్ నగలను ఇలా ఇండియన్ అవుట్‌ఫిట్‌తో ధరించడం ఇదే మొదటిసారి. ఇది నాకు చాలా స్పెషల్" అని తమన్నా ఆనందం వ్యక్తం చేశారు. దీంతో తమన్నా తన సొంత నగల బ్రాండ్‌ను పరిచయం చేశారు.

ఆఫ్టర్‌గ్లో: సంప్రదాయం, వ్యక్తిత్వం

డిజైనర్ భూమిక శర్మ మాట్లాడుతూ.. 'ఆఫ్టర్‌గ్లో' కలెక్షన్ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆధునిక ఆలోచనలు కలిగిన మహిళల కోసం రూపొందించామని తెలిపారు. తెలుపు, బేజ్ రంగులతో పాటు ఎరుపు, టీల్ రంగుల కలయికతో ఈ దుస్తులను తీర్చిదిద్దారు.

సౌకర్యాన్ని, గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ తమన్నా చేసిన ఈ ర్యాంప్ వాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా అందాన్ని నెటిజన్స్ పొగుడుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More