SS Rajamouli: నీలోని కుంభను నిద్ర లేపదలచుకోలేదు.. హ్యాపీ బర్త్‌డే పృథ్వీ: వారణాసి విలన్‌కు రాజమౌళి విషెస్

SS Rajamouli: రాజమౌళి తన వారణాసి మూవీలో కుంభ అనే విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కు తనదైన్ స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పారు. తన ఎక్స్ అకౌంట్ ద్వారా జక్కన్న చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Published on: Oct 16, 2026, 15:47:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

SS Rajamouli: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'వారణాసి' (Varanasi) సినిమాపై రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ నుంచి ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

SS Rajamouli: నీలోని కుంభను నిద్ర లేపదలచుకోలేదు.. హ్యాపీ బర్త్‌డే పృథ్వీ: వారణాసి విలన్‌కు రాజమౌళి విషెస్
SS Rajamouli: నీలోని కుంభను నిద్ర లేపదలచుకోలేదు.. హ్యాపీ బర్త్‌డే పృథ్వీ: వారణాసి విలన్‌కు రాజమౌళి విషెస్

తాజాగా మలయాళ వర్సటైల్ యాక్టర్-డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఆయనకు అదిరిపోయే బర్త్‌డే విషెస్ తెలిపారు.

కుంభ అంటూ బర్త్ డే విషెస్

ఈ సందర్భంగా ఆయనను సినిమాలో నటిస్తున్న విలన్ పాత్ర పేరు 'కుంభ' (Kumbha) అని సంబోధించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. “హ్యాపీ బర్త్‌డే పృథ్వీ. నీలోని కుంభను ఈరోజు నిద్రలేపాలని అనుకోవడం లేదు. ప్రపంచంపై తనదైన ముద్ర వేయడానికి కుంభ సిద్ధంగా ఉన్నాడు” అంటూ రాజమౌళి తనదైన స్టైల్లో విషెస్ చెప్పారు.

రామాయణ, మహాభారత కాలం నాటి పురాతన అవశేషాల కోసం సాగే ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీలో పృథ్వీరాజ్ రోల్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది.

కాలాన్ని జయించిన దుష్ట శక్తిగా 'కుంభ' పాత్ర

'వారణాసి' చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కాలాలను దాటుకుని బతికి ఉన్న ఒక భయంకరమైన దుష్ట శక్తిగా కనిపించనున్నారు. ప్రపంచం ఒక భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ విలన్ పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు పోషిస్తున్న 'రుద్ర' (Rudra) పాత్రను తన స్వార్థం కోసం ఎలా మోసం చేస్తుంది? రామాయణ, మహాభారత కాలం నాటి రహస్యాలను ఎలా బయటికి లాగుతుంది? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వీల్‌చైర్‌లో కూర్చున్న మ్యాడ్ సైంటిస్ట్ లుక్‌లో పృథ్వీరాజ్ కనిపించి అంచనాలను పెంచేశారు. గ్లోబల్ డామినేషనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సైకో విలన్ ప్లాన్లను హీరో రుద్ర ఎలా తిప్పికొడతాడనేది హై-వోల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా గ్రే షేడ్స్ ఉన్న 'మందాకిని' (Mandakini) పాత్రలో నటిస్తూ హీరోకు సాయం చేయనుంది.

అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి మేకింగ్

'బాహుబలి', ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మరింత పెద్ద ప్లానింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమా కోసం ఒక సరికొత్త కల్పిత భాషను కూడా క్రియేట్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. జార్జియా అడవులు, కెన్యా వైల్డ్ లైన్స్ వంటి విభిన్న దేశాల్లో భారీ షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఆర్కిటిక్ ప్రాంతం వాతావరణాన్ని తలపించే విజువల్స్‌ను వేరే ప్రాంతంలో ఎంతో ప్రాక్టికల్‌గా రీక్రియేట్ చేసి ప్రశంసలు అందుకున్నారు.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్, వరల్డ్ క్లాస్ టెక్నికల్ వాల్యూస్‌తో రాబోతున్న ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రామాయణంలోని 'కుంభకర్ణుడు' పాత్రకు ఈ 'కుంభ' పాత్రకు ఏదైనా లింక్ ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రకరకాల థియరీలను డిస్కస్ చేస్తున్నారు. అవన్నీ వచ్చే ఏడాది తేలనున్నాయి. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా మూవీ రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More