370 Biryani Joke Controversy: స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరెపై కేసు.. రూ.370 బిర్యానీ జోక్‌పై ఎన్‌సీడబ్ల్యూ సీరియస్

370 Biryani Joke Controversy: గురుగ్రామ్‌లో జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోలో మహిళల ఆత్మగౌరవాన్ని, సమ్మతిని (Consent) కించపరుస్తూ మాట్లాడిన కమెడియన్లు ప్రణిత్ మోరే, హిమాన్షు జంగ్లా, సెజల్ పవార్‌లపై జాతీయ మహిళా కమిషన్ (NCW), మహారాష్ట్ర సైబర్ పోలీసులు తీవ్ర చర్యలు చేపట్టారు.

Published on: Jun 11, 2026, 21:19:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

370 Biryani Joke Controversy: కామెడీ పేరిట మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, మృతదేహాలను కూడా అగౌరవపరిచేలా మాట్లాడిన ముగ్గురు స్టాండప్ కమెడియన్లు ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడ్డారు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ కామెడీ షోలో ప్రణిత్ మోరే, హిమాన్షు జంగ్లా, డాక్టర్ సెజల్ పవార్ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫుల్ ఫైర్ అయ్యారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్పందించగా, మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.

స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరె.. రూ.375 బిర్యానీ జోక్‌పై ఎన్‌సీడబ్ల్యూ సీరియస్!
స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరె.. రూ.375 బిర్యానీ జోక్‌పై ఎన్‌సీడబ్ల్యూ సీరియస్!

370 Biryani Controversy | వివాదాస్పద 'రూ.370 బిర్యానీ జోక్'

ఈ రచ్చకు కారణం హిమాన్షు జంగ్లా చేసిన ఒక అభ్యంతరకరమైన జోక్. "డేటింగ్‌కు వెళ్లినప్పుడు ఒక మహిళపై రూ.370 ఖర్చు పెడితే, దానికి ప్రతిఫలంగా ఆమెతో ఫిజికల్ రిలేషన్ పొందే హక్కు పురుషుడికి ఉంటుంది" అనే అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు.

మహిళల సమ్మతిని (Consent) అస్సలు పట్టించుకోకుండా, లైంగిక వేధింపులను వినోదంగా మార్చిన ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. మరో క్లిప్‌లో సెజల్ పవార్ అనే మహిళా కమెడియన్.. వైద్య విద్యార్థులు ఉపయోగించే మృతదేహాలపై (Cadavers) అత్యంత అసభ్యంగా మాట్లాడటం మరీ దారుణం.

NCW Action | రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్

ఈ వైరల్ వీడియోలపై ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ చాలా సీరియస్ అయ్యారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ప్రవర్తనను కామెడీగా చూపించడం సమాజ భద్రతపై ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.

"మహిళలపై జరిగే లైంగిక దాడులను, వారి సమ్మతి లేని ప్రవర్తనను కామెడీ పేరిట జనరలైజ్ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల సొసైటీలో లింగ వివక్ష మరింత పెరుగుతుంది" అని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది.

ఈ కేసుపై జూన్ 22న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విచారణ జరగనుంది. అంతేకాకుండా ఈ ఘటనపై హర్యానా డీజీపీకి లేఖ రాసి, 7 రోజుల్లోగా పూర్తి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సబ్మిట్ చేయాలని ఆదేశించారు. షో ఆర్గనైజర్లు, వేదిక యాజమాన్యం పాత్రపై కూడా ఎంక్వయిరీ జరపాలని కమిషన్ కోరింది.

సైబర్ పోలీస్ కేసు.. కమెడియన్ల క్షమాపణ!

సోషల్ మీడియాలో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను వ్యాప్తి చేసినందుకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం కింద కేసు బుక్ చేసి, విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.

కంటెంట్ క్రియేటర్లు సామాజిక బాధ్యతతో ఉండాలని, చట్టపరమైన పరిమితులను దాటకూడదని పోలీసులు హెచ్చరించారు. తీవ్ర వ్యతిరేకత, పోలీసుల కేసులు రావడంతో కమెడియన్లు ముగ్గురూ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు.

హెచ్‌టీ విశ్లేషణ

కామెడీ పేరుతో హద్దులు దాటడం కంటెంట్ క్రియేటర్లకు ముఖ్యంగా స్టాండప్ కమెడియన్లకు ఓ అలవాటుగా మారిపోయింది. 'క్రియేటివ్ ఫ్రీడమ్' పేరుతో సమాజాన్ని, ముఖ్యంగా మహిళలను కించపరిచే ఇలాంటి జోక్స్ సోషల్ మీడియాలో చాలా త్వరగా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి.

కమెడియన్లు తాము చేసే జోక్స్ వల్ల సమాజంపై పడే ప్రభావం గురించి ముందుగా ఆలోచించాలి. ఇప్పుడు ఎన్‌సీడబ్ల్యూ రంగంలోకి దిగడంతో, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ చేసే వాళ్లకు ఇది ఒక పెద్ద హెచ్చరికగా నిలుస్తుంది.

People Also Ask (FAQs)

ఎన్‌సీడబ్ల్యూ ఎవరికి సమన్లు జారీ చేసింది? విచారణ ఎప్పుడు?

స్టాండప్ కమెడియన్లు ప్రణిత్ మోరే, హిమాన్షు జంగ్లా, సెజల్ పవార్‌లకు సమన్లు జారీ చేసింది. జూన్ 22న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విచారణ జరగనుంది.

'రూ.370 బిర్యానీ జోక్' వివాదం ఏంటి?

హిమాన్షు జంగ్లా డేటింగ్ సమయంలో మహిళలపై రూ.375 ఖర్చు పెడితే ఫిజికల్ రిలేషన్ పొందే హక్కు ఉంటుందనేలా మాట్లాడాడు. ఇది మహిళల సమ్మతిని కించపరిచేలా ఉండటంతో వివాదమైంది.

కమెడియన్లపై ఏ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది?

మహారాష్ట్ర నోడల్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More