Star Maa New Serial: తెలుగు టీవీ సీరియల్స్ లో సాటిలేని స్టార్ మా ఛానెల్లోకి మరో కొత్త సీరియల్ రాబోతోంది. చాలా రోజులుగా దీని గురించి టీజ్ చేస్తూ వస్తున్న ఆ ఛానెల్ ఇప్పుడు ప్రారంభమయ్యే తేదీని వెల్లడించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర నలుగురు కూతుళ్లకు తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ పేరు గోదావరి. కోనసీమ అందాలను చూపిస్తూ సాగనుంది.
గోదావరి సీరియల్ టైమింగ్స్

స్టార్ మాలోకి అడుగుపెడుతున్న ఈ కొత్త సీరియల్ గోదావరి వచ్చే సోమవారం అంటే మే 11 నుంచి టెలికాస్ట్ కానుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 గంటలకు ఈ కొత్త సీరియల్ వస్తుంది. ఇప్పటి వరకూ ఆ సమయంలో నిండు మనసులు వస్తుండగా.. ఇప్పుడు గోదావరి పలకరించబోతోంది.
“తండ్రి లేని ఈ అక్కాచెల్లెల్ల జీవితం.. కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చుకుంటూ, ఆశలతో ముందుకు సాగిన స్ఫూర్తిదాయక ప్రయాణం.. గోదావరి గ్రాండ్ లాంచ్ మిస్ కావద్దు. మే 11 నుంచి ప్రారంభం.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
గోదావరి ప్రోమో
గోదావరి సీరియల్ లో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర నటిస్తున్నాడు. నలుగురు కూతుళ్లకు తండ్రిగా అతడు కనిపించనున్నాడు. అయితే అతని పాత్ర ఎక్కువ రోజులు సాగేలా కనిపించడం లేదు. తండ్రి కన్నుమూసిన తర్వాత ఆ నలుగురు కూతుళ్లలో ఒకరు ఎలా ఆ కుటుంబ భారాన్ని మోయనున్నారన్నది తాజా ప్రోమోలో చూపించారు.
ప్రోమో మొదట్లోనే గోదావరి, కోనసీమ అందాలను చూపిస్తూ ప్రారంభమైంది. ఆ తర్వాత లీడ్ రోల్స్ ఎంట్రీ, ప్రేమ, కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంఘర్షణతో సాగిపోయింది. నిజానికి కొన్నాళ్ల కిందటే ఈ సీరియల్ ను స్టార్ మా అనౌన్స్ చేయగా.. తాజాగా టెలికాస్ట్ తేదీని వెల్లడించింది.
గోదావరి సీరియల్ విశేషాలు
{{/usCountry}}ప్రోమో మొదట్లోనే గోదావరి, కోనసీమ అందాలను చూపిస్తూ ప్రారంభమైంది. ఆ తర్వాత లీడ్ రోల్స్ ఎంట్రీ, ప్రేమ, కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంఘర్షణతో సాగిపోయింది. నిజానికి కొన్నాళ్ల కిందటే ఈ సీరియల్ ను స్టార్ మా అనౌన్స్ చేయగా.. తాజాగా టెలికాస్ట్ తేదీని వెల్లడించింది.
గోదావరి సీరియల్ విశేషాలు
{{/usCountry}}తండ్రి లేని నలుగురు కూతుళ్ల చుట్టూ తిరిగే కథే ఈ గోదావరి. ఆ కుటుంబానికి జాహ్నవి అనే రెండో కూతురే పెద్ద దిక్కుగా ఉంటుంది. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోలో ఆ తండ్రే తన నలుగురు కూతుళ్లను పరిచయం చేస్తున్నట్లుగా చూపించారు.
మొదట అమెరికా సంబంధం అంటే చాలు పెళ్లికి రెడీ అయిపోయే మొదటి కూతురిని, తర్వాత జీవితంలో ఏం చేయాలో తెలియని మూడో కూతురిని చూపిస్తారు. ఆ తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్న రెండో కూతురు జాహ్నవిని పరిచయం చేశారు. చివరిగా అనారోగ్యంతో బాధపడుతున్న తన నాలుగో కూతురిని ఆ తండ్రి చూపిస్తాడు. కానీ నిజానికి ఆ తండ్రే వాళ్ల జీవితాల్లో లేడని ప్రోమో చివర్లో చెప్పడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది.
ఈ సీరియల్లో రాజా రవీంద్రతోపాటు అనుమిత దత్త, గంటా మౌనిక, మధురిమ, సంధ్య వరలక్ష్మిలాంటి వాళ్లు నటించారు. ఇది విజయ్ టీవీలో వచ్చే మహానది సీరియల్ కు తెలుగు రీమేక్. ఇప్పటికే ఈ తమిళ సీరియల్ కు కన్నడ, మలయాళ రీమేక్స్ టెలికాస్ట్ అవుతుండగా.. తెలుగులో గోదావరి పేరుతో స్టార్ మా తీసుకువస్తోంది.