స్టార్ మాలోకి సరికొత్త సీరియల్.. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకుంటున్న ఛానెల్.. ఆరోజు నుంచే ప్రారంభం

స్టార్ మాలోకి సరికొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు పొదరిల్లు. అయితే అన్ని సీరియల్స్‌లా కాకుండా ఈ కొత్త సీరియల్ ను ఆ ఛానెల్ వెరైటీగా ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే టెలికాస్ట్ అవుతున్న కొన్ని సీరియల్స్ నటీనటులతో ఓ ప్రోమో చేయడం విశేషం.

Published on: Dec 2, 2025, 18:48:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్ కు ఓ ప్రత్యేకత ఉంది. టాప్ 10 సీరియల్స్ లో తొలి ఆరు స్థానాలు ఆ ఛానెల్ కు చెందినవే ఉంటాయి. దీంతోపాటు ఎప్పటికప్పుడు సరికొత్త సీరియల్స్ తీసుకొస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు పొదరిల్లు అనే మరో సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

స్టార్ మాలోకి సరికొత్త సీరియల్.. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకుంటున్న ఛానెల్.. ఆరోజు నుంచే ప్రారంభం
స్టార్ మాలోకి సరికొత్త సీరియల్.. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకుంటున్న ఛానెల్.. ఆరోజు నుంచే ప్రారంభం

పొదరిల్లు సీరియల్ టెలికాస్ట్

స్టార్ మా ఛానెల్లోకి వస్తున్న కొత్త సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ వచ్చే సోమవారం (డిసెంబర్ 8) నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం (డిసెంబర్ 2) ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఎలాగైనా తనతోపాటు తన అన్న, తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేయాలని కలలు కనే ఓ యువకుడు.. పెళ్లిపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ అమ్మాయి అసలు ఆడదిక్కే లేని ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సీరియల్ కథగా కనిపిస్తోంది.

“తను ఊహించుకున్న జీవితం ఒకటి.. కానీ పరిస్థితులు ఆమెను తీసుకెళ్లిన దారి మరోటి. ఇలాంటి పరిస్థితుల్లో మహాలక్ష్మి ఎలా ముందుకు వెళ్తుంది? తెలుసుకోవాలంటే తప్పక చూడండి” అనే క్యాప్షన్ తో స్టార్ మా ఈ సీరియల్ టెలికాస్ట్ తేదీని అనౌన్స్ చేసింది. అయితే ఏ సమయానికి వస్తుందన్నది మాత్రం చెప్పలేదు. ఉదయం నుంచీ వరుసగా ఈ సీరియల్ ప్రోమోలతో తన ఎక్స్ అకౌంట్ ను నింపేసింది స్టార్ మా ఛానెల్.

పొదరిల్లు.. వెరైటీగా ప్రమోషన్లు

స్టార్ మా ఈ కొత్త సీరియల్ పొదరిల్లు ప్రమోషన్లను వెరైటీగా చేస్తోంది. ఇప్పటికే ఆ ఛానెల్లో వస్తున్న గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి సీరియల్స్ నటుల ద్వారా కూడా ఈ సీరియల్ ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. “తను సవాలు చేసినట్టే, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటిని బృందావనంలా చక్రి మారుస్తాడా? తెలుసుకోవాలంటే వేచి ఉండండి” అనే క్యాప్షన్ తో ఆ ఛానెల్ మరో ట్వీట్ చేసింది.

జీవితంపై ఎంతో స్పష్టత ఉన్న మహాలక్ష్మి అనే అమ్మాయి.. దానికోసం తన ఇంటి నుంచి బయటకు వస్తుంది. అయితే అనుకోకుండా ఆమె చక్రి అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. బృందావనంలాంటి ఇంట్లోకి వెళ్తున్నానన్న ఆమె సంతోషం వెంటనే ఆవిరి అవుతుంది. ఆడదిక్కు లేక ఐదుగురు మగాళ్లు ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టే ఆమె జీవితం ఏం కాబోతుందన్నది ఈ పొదరిల్లు సీరియల్లో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More