ఈ రోజు నుంచే స్టార్ మాలో సరికొత్త సీరియల్.. టెలికాస్ట్ టైమ్ ఇదే..

స్టార్ మాలోకి సోమవారం (డిసెంబర్ 8) నుంచి సరికొత్త సీరియల్ అడుగుపెట్టనుంది. ఈ సీరియల్ పేరు పొదరిల్లు. కొన్ని రోజులుగా వెరైటీ ప్రమోషన్లతో ఈ సీరియల్ ను ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నం చేసింది ఆ ఛానెల్.

Published on: Dec 8, 2025, 13:55:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ మా మరో కొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈరోజు అంటే డిసెంబర్ 8 నుంచే ఈ సీరియల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలుగు టీవీ సీరియల్స్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న స్టార్ మా.. ఈ తాజా సీరియల్ తో మరింత దూకుడు పెంచనుంది. మరి ఆ సీరియల్, టెలికాస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.

ఈ రోజు నుంచే స్టార్ మాలో సరికొత్త సీరియల్.. టెలికాస్ట్ టైమ్ ఇదే..
ఈ రోజు నుంచే స్టార్ మాలో సరికొత్త సీరియల్.. టెలికాస్ట్ టైమ్ ఇదే..

పొదరిల్లు సీరియల్ టెలికాస్ట్ టైమ్

స్టార్ మాలోకి సోమవారం (డిసెంబర్ 8) అడుగుపెట్టనున్న సీరియల్ పేరు పొదరిల్లు. ఈ కొత్త సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరడంతో దాని స్థానంలో స్టార్ మా ఈ కొత్త సీరియల్ ను టెలికాస్ట్ చేస్తోంది. కొన్నాళ్లుగా ఈ పొదరిల్లు సీరియల్ ప్రోమోలను రిలీజ్ చేస్తూ ప్రమోట్ చేస్తోంది.

గత వారం కూడా ఓ ప్రోమోను తీసుకొచ్చింది. ఎలాగైనా తనతోపాటు తన అన్న, తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేయాలని కలలు కనే ఓ యువకుడు.. పెళ్లిపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ అమ్మాయి అసలు ఆడదిక్కే లేని ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సీరియల్ కథగా కనిపిస్తోంది.

“తను ఊహించుకున్న జీవితం ఒకటి.. కానీ పరిస్థితులు ఆమెను తీసుకెళ్లిన దారి మరోటి. ఇలాంటి పరిస్థితుల్లో మహాలక్ష్మి ఎలా ముందుకు వెళ్తుంది? తెలుసుకోవాలంటే తప్పక చూడండి” అనే క్యాప్షన్ తో స్టార్ మా ఈ సీరియల్ టెలికాస్ట్ తేదీని అనౌన్స్ చేసింది.

పొదరిల్లు.. వెరైటీగా ప్రమోషన్లు

స్టార్ మా ఈ కొత్త సీరియల్ పొదరిల్లు ప్రమోషన్లను వెరైటీగా చేసింది. ఇప్పటికే ఆ ఛానెల్లో వస్తున్న గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి సీరియల్స్ నటుల ద్వారా కూడా ఈ సీరియల్ ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. “తను సవాలు చేసినట్టే, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటిని బృందావనంలా చక్రి మారుస్తాడా? తెలుసుకోవాలంటే వేచి ఉండండి” అనే క్యాప్షన్ తో ఆ ఛానెల్ మరో ట్వీట్ చేసింది.

జీవితంపై ఎంతో స్పష్టత ఉన్న మహాలక్ష్మి అనే అమ్మాయి.. దానికోసం తన ఇంటి నుంచి బయటకు వస్తుంది. అయితే అనుకోకుండా ఆమె చక్రి అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. బృందావనంలాంటి ఇంట్లోకి వెళ్తున్నానన్న ఆమె సంతోషం వెంటనే ఆవిరి అవుతుంది. ఆడదిక్కు లేక ఐదుగురు మగాళ్లు ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టే ఆమె జీవితం ఏం కాబోతుందన్నది ఈ పొదరిల్లు సీరియల్లో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More