స్టార్ మాలో ఈ రెండు సీరియల్స్ ఇక రోజూ 45 నిమిషాల పాటు.. గుడ్ న్యూస్ చెప్పిన గుండె నిండా గుడి గంటలు టీమ్.. కొత్త టైమ్ ఇదే

స్టార్ మా ఛానెల్ అభిమానులకు  గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో వచ్చే రెండు సీరియల్స్ గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు ఇక నుంచి రోజూ 45 నిమిషాల పాటు వస్తాయని వెల్లడించింది. సీరియల్స్ నటీనటులతోనే ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలు రిలీజ్ చేసింది.

Feb 13, 2026, 15:27:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ మా సీరియల్స్ ను అభిమానించే ప్రేక్షకులకు ఆ ఛానెల్ ఓ పండగలాంటి న్యూస్ చెప్పింది. ఈ ఛానెల్లో మంచి ఆదరణ సంపాదిస్తున్న రెండు సీరియల్స్ గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు 30 నిమిషాలు కాకుండా 45 నిమిషాల పాటు టెలికాస్ట్ అవుతాయని చెప్పడం విశేషం. మరి ఆ మారిన టైమింగ్స్ ఏంటో చూడండి.

స్టార్ మాలో ఈ రెండు సీరియల్స్ ఇక రోజూ 45 నిమిషాల పాటు.. గుడ్ న్యూస్ చెప్పిన గుండె నిండా గుడి గంటలు టీమ్.. కొత్త టైమ్ ఇదే
స్టార్ మాలో ఈ రెండు సీరియల్స్ ఇక రోజూ 45 నిమిషాల పాటు.. గుడ్ న్యూస్ చెప్పిన గుండె నిండా గుడి గంటలు టీమ్.. కొత్త టైమ్ ఇదే

గుండె నిండా గుడి గంటలు ఇక 45 నిమిషాలు..

స్టార్ మా ఛానెల్ టాప్ 5 సీరియల్స్ లో ఒకటైన గుండె నిండా గుడి గంటలు ఇక నుంచి రోజూ 45 నిమిషాల పాటు రానుంది. సోమవారం అంటే ఫిబ్రవరి 16 నుంచి రోజుకు 30 నిమిషాలు కాకుండా 45 నిమిషాలు వస్తుందని ఆ సీరియల్ టీమ్ ద్వారానే స్టార్ మా వెల్లడించింది.

ఇందులో ప్రధాన పాత్రలైన మీనా, బాలుతోపాటు మనోజ్, రోహిణి, రవి, శృతి, సత్యం, ప్రభావతి ఈ విషయం చెప్పి డ్యాన్సులు వేయడం ఈ వీడియోలో చూడొచ్చు. “మన ఈవెనింగ్స్ ఇప్పుడు మరింత స్పెషల్.. ఈ సోమవారం నుంచి గుండె నిండా గుడి గంటలు 45 నిమిషాల మెగా ఎంటర్టైన్మెంట్ రైడ్” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది. అంటే సోమవారం నుంచి రాత్రి 9 గంటల నుంచి 9.45 గంటల వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది.

గుండె నిండా గుడి గంటలు విశేషాలు

సత్యం, ప్రభావతి.. వాళ్లు ముగ్గురు కొడుకులు, కోడళ్లు, కూతురి చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ఛానెల్లో దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 600కుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇందులో బాలు పాత్రలో విష్ణుకాంత్, మీనా పాత్రలో అమూల్య గౌడ నటించారు. ఈ జంట నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఓ కుటుంబం కలిసే ఉండాలన్న సందేశంతో సాగిపోతున్న సీరియల్ ఇది.

పొదరిల్లు సీరియల్ కూడా..

ఇక స్టార్ మాలో ఈ మధ్యే అడుగుపెట్టిన మరో సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ కూడా సోమవారం నుంచే రోజుకు 45 నిమిషాల పాటు టెలికాస్ట్ అవుతుంది. అంటే రాత్రి 9.45 గంటల నుంచి 10.30 గంటలకు వరకు ఈ సీరియల్ వస్తుందని స్టార్ మా తెలిపింది.

“మనందరికీ సూపర్ ఎక్సైటింగ్ న్యూస్. పొదరిల్లును ఇప్పుడు 45 నిమిషాల ప్యూర్ ఎంటర్టైన్మెంట్ గా మార్చబోతున్నాం” అనే క్యాప్షన్ తో వీడియోను ట్వీట్ చేసింది. అసలు ఆడదిక్కు లేని ఓ కుటుంబంలోకి ఓ అమ్మాయి కోడలిగా అడుగుపెట్టి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది అన్నదే ఈ పొదరిల్లు సీరియల్ కథ.

“ఎక్స్‌ట్రా టైమ్, ఎక్స్‌ట్రా సందడి, ఎక్స్‌ట్రా మజా.. 45 నిమిషాల ఎపిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు.. మీ ముందుకు” అనే క్యాప్షన్ తో మరో ట్వీట్ కూడా చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More