గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ముదిరిన బాలు, మీనా గొడవ.. మంట పెట్టిన ప్రభావతి.. మళ్లీ బకరా అయిన మనోజ్
గుండె నిండా గుడి గంటలు మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ లో బాలు, మీనా మధ్య గొడవ ముదురుతుంది. రాజేష్ విషయంలో వీళ్లు గొడవ పడతారు. అటు మరోసారి మనోజ్‌ను బకరాను చేసిన లక్ష కొట్టేస్తుంది రోహిణి. తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 616వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజేష్ కు సాయం విషయంలో బాలు, మీనా మధ్య గొడవ మరింత ముదురుతుంది. దానికి ప్రభావతి మరింత ఆజ్యం పోస్తుంది. అటు తన రూమ్ కోసం మనోజ్ ను మరోసారి మోసం చేసి రూ.లక్ష కొట్టేస్తుంది రోహిణి.

రాజేష్‌కు ఏదో రకంగా సాయం చేస్తానన్న బాలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ రాజేష్ కు సాయం చేయలేకపోతున్నానని ఫ్రెండ్స్ దగ్గర బాలు ఫీలయ్యే సీన్ తో మొదలవుతుంది. నువ్వు డబ్బు ఇస్తావన్న ఆశతో వాడున్నాడని, అలా చెప్పకపోయినా బాగుండేదని వాళ్లు అంటారు. అందులో నీ ఒక్కడి డబ్బే లేదు కదా.. పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ కు సాయం చేయడం కుదరదని చెబుతారు. అలా చేయాలని ప్రయత్నిస్తేనే మీనాతో గొడవ జరిగిందని బాలు చెబుతాడు. అయితే ఎలాగైనా రాజేష్ కు సాయం చేస్తానని అతడు అంటాడు.
రోహిణిని నిలదీసిన మనోజ్.. ఇద్దరి మధ్య గొడవ
ఇటు రోహిణికి విద్య ఫోన్ చేస్తుంది. రూ.లక్ష అడ్వాన్స్ ఇవ్వాల్సిందేనని, లేదంటే చేజారిపోతుందని అంటుంది. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం కదా అని రోహిణి అంటుంది. ఈ క్రమంలోనే రోహిణి నోటి వెంట దుబాయ్ దుకాణం అనే పదం వస్తుంది. అది విని మనోజ్ ఆమెను నిలదీస్తాడు.
దీంతో ఆమె వెంటనే తన ఫ్రెండ్ వాళ్ల ఆయన దుబాయ్ లో షాప్ పెట్టాడని, కాస్త డబ్బు సాయం చేయాలని అంటుంది. కానీ మనోజ్ మాత్రం ఇవ్వనంటాడు. కల్పన ఇచ్చిన డబ్బు ఉంది కదా.. నువ్వు మాత్రం ఎవరికి పడితే వాళ్లకు ఇచ్చి మోసపోతావా అంటూ మనోజ్ పై మండిపడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.
డబ్బు కోసం బాలు, రోహిణి ప్రయత్నాలు
ఇటు రోహిణి.. కిచెన్ లో ఉన్న శృతి, మీనా దగ్గరికి.. అటు మనోజ్.. మేడ మీద ఉన్న బాలు, రవి దగ్గరికి వెళ్తారు. ఇటు బాలు, అటు రోహిణి తమ డబ్బు అవసరం గురించి చెప్పుకుంటారు. ఈ విషయంలో తమ మధ్య గొడవ జరిగిందని రోహిణి, మీనా, బాలు, మనోజ్ అంటారు.
అటు రవి, ఇటు శృతి వాళ్లకు సలహా ఇస్తారు. వడ్డీకి డబ్బు ఇస్తే వాళ్లకు బాధ్యత తెలుస్తుందని వాళ్లు చెబుతారు. దీంతో మనోజ్ మళ్లీ ఆలోచనలో పడతాడు. కానీ బాలు మాత్రం ఫ్రెండ్ కు వడ్డీకి డబ్బివ్వడం సరి కాదని వాదిస్తాడు. ఇటు రోహిణి కూడా మనోజ్‌ను వడ్డీకి డబ్బు అడగాలని అనుకుంటుంది.
వడ్డీకి రోహిణికి డబ్బు ఇచ్చిన మనోజ్
తర్వాత రోహిణి, మనోజ్ మళ్లీ రూమ్ లోకి వెళ్తారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో గొడవ సద్దుమణుగుతుంది. పదే పదే కల్పన పేరు మధ్యలో తీసుకురావద్దని మనోజ్ అంటాడు. చివరికి రూ.3 వడ్డీకి డబ్బు ఇస్తానని చెబుతాడు. అలా అయితే ఎవరైనా భయపడి అసలు కూడా త్వరగా ఇస్తారని అంటాడు. రోహిణి దానికి సరే అంటుంది. మనోజ్ ను మళ్లీ బురిడీ కొట్టించి తనకు అవసరమైన రూ.లక్ష తీసుకుంటుంది.
రాజేష్‌కు మీనా సలహా
ఇటు రాజేష్ దగ్గరికి వెళ్తుంది మీనా. మీకు డబ్బు ఇవ్వాలన్న విషయంలోనే తనకు, బాలుకి మధ్య గొడవ జరిగిందని చెబుతుంది. తల్లిదండ్రులకు షష్టిపూర్తి చేయాలన్న ఆలోచన మంచిదే కానీ.. దాని కోసం అనవసర ఆడంబరాలకు వెళ్లడం సరి కాదని అంటుంది. మనం ఎంత కష్టపడితే రూ.లక్ష సంపాదిస్తాం.. అలాంటప్పుడు ఒక్క రోజులో దానిని ఖర్చు చేస్తే మళ్లీ సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుందని క్లాస్ పీకుతుంది. మీనా చెప్పినదాంట్లోనూ నిజం ఉందని రాజేష్ గ్రహిస్తాడు.
ఆ తర్వాత బాలు ఎలాగోలా రూ.లక్ష సర్ది రాజేష్ కు ఇవ్వడానికి వెళ్తాడు. కానీ జరిగిన విషయం చెప్పి మీనా తీసుకోవద్దని చెప్పింది రా అని అంటాడు. దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇంటికి వెళ్లి మీనాతో గొడవ పడతాడు. అది విని ప్రభావతి దానికి మరింత ఆజ్యం పోస్తుంది. దీంతో ఇద్దరి మధ్యా మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ మొదలవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












