Star Maa Serials: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లే స్టార్ మా ఛానెల్.. ఇప్పుడు మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్ పేరు ‘ఏ దేవి వరమో నీవు’. వచ్చే సోమవారం అంటే జులై 6 నుంచి ఈ సీరియల్ ప్రారంభం కానుంది.
ఏ దేవి వరమో నీవు సీరియల్ విశేషాలు

స్టార్ మా ఛానెల్ చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు. పుట్టగానే తల్లికి దూరమైన ఓ కూతురు 25 ఏళ్ల తర్వాత మళ్లీ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్తే ఏం జరుగుతుంది అన్న ఆసక్తికర కథతో ఈ సీరియల్ రాబోతోంది.
ఈ సరికొత్త సీరియల్ ను వచ్చే సోమవారం అంటే జులై 6 నుంచి రాత్రి 8.30 గంటలకు స్టార్ మా టెలికాస్ట్ చేయబోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది.
ఏ దేవి వరమో నీవు స్టోరీ ఇదే
స్టార్ మా ఛానెల్ గత కొన్నాళ్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ప్రమోషనల్ వీడియోలు, ఇతర కంటెంట్ చూస్తే.. అంజలి అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆమె పుట్టినప్పటి నుంచే ఓ అనాథాశ్రమంలో పెరుగుతుంది. తనకు ఎవరూ లేరు అని అనుకున్న ఆమె.. అక్కడి వారితోనే బాగా కలిసిపోతుంది. అయితే పాతికేళ్ల తర్వాత ఆమెకు తన తల్లి ఉందన్న విషయం తెలుస్తుంది.
ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తన కూతురిని ఆ తల్లి ఆదరిస్తుందా లేక ఆ తల్లి ప్రశాంతతను ఆ కూతురు చెడగొడుతుందా అన్నదే ఈ ఏ దేవి వరమో సీరియల్ కథ. ఈ సీరియల్ రాకతే ఇంతకాలం 45 నిమిషాల నిడివితో వస్తున్న గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు సీరియల్స్ మళ్లీ 30 నిమిషాలకు పరిమితం కానున్నాయి.
ఆ రెండు సీరియల్స్ టైమ్ మారింది
{{/usCountry}}ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తన కూతురిని ఆ తల్లి ఆదరిస్తుందా లేక ఆ తల్లి ప్రశాంతతను ఆ కూతురు చెడగొడుతుందా అన్నదే ఈ ఏ దేవి వరమో సీరియల్ కథ. ఈ సీరియల్ రాకతే ఇంతకాలం 45 నిమిషాల నిడివితో వస్తున్న గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు సీరియల్స్ మళ్లీ 30 నిమిషాలకు పరిమితం కానున్నాయి.
ఆ రెండు సీరియల్స్ టైమ్ మారింది
{{/usCountry}}ఇక స్టార్ మాలోనే వస్తున్న మరో రెండు సీరియల్స్ టైమ్ కూడా మారింది. జులై 6 నుంచే ఈ మార్పు కూడా అమల్లోకి రానుంది. టాప్ సీరియల్స్ లో ఒకటైన ఇంటింటి రామాయణం వచ్చే సోమవారం నుంచి సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ సీరియల్ నిండు మనసులు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం అవుతుందని స్టార్ మా వెల్లడించింది.
ఇప్పటికే టీఆర్పీ రేటింగ్స్ విషయంలో తెలుగులో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న స్టార్ మా.. ఈ సరికొత్త సీరియల్ తోపాటు ఇప్పటికే ఉన్న సీరియల్స్ టైమ్ మార్పుతో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.