...
...
Next Story

Sunny Leone Daughter:పదేళ్లకే డబ్బు సంపాదిస్తున్న సన్నీ లియోన్ దత్త పుత్రిక-తల్లి చిరాకు నుంచి పుట్టిన ఐడియాతో ఆవిష్కరణ!

Sunny Leone Daughter Nisha Kaur Weber Boo Box Patent Rights: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కుమార్తె నిషా కేవలం పదేళ్ల వయసులోనే ఒక అద్భుతమైన వస్తువును కనుగొని, దానికి పేటెంట్ కూడా సాధించింది. ‘బూ బాక్స్’ అని పిలిచే ఈ చిన్న ఆవిష్కరణ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని సన్నీ లియోన్ తెలిపింది.

Published on: Mar 3, 2026, 11:30:48 IST
Advertisement

బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తన తాజా యూట్యూబ్ వ్లాగ్ కోసం నటి సన్నీ లియోన్ ముంబై నివాసానికి వెళ్లారు. అక్కడ జరిగిన చిట్ చాట్‌లో సన్నీ లియోన్ తన కుమార్తె నిషా గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు.

పదేళ్లకే డబ్బు సంపాదిస్తున్న సన్నీ లియోన్ దత్త పుత్రిక-తల్లి చిరాకు నుంచి పుట్టిన ఐడియాతో ఆవిష్కరణ!
పదేళ్లకే డబ్బు సంపాదిస్తున్న సన్నీ లియోన్ దత్త పుత్రిక-తల్లి చిరాకు నుంచి పుట్టిన ఐడియాతో ఆవిష్కరణ!

నిషా కౌర్ వెబర్ (Nisha Kaur Weber) కేవలం 10 ఏళ్ల వయసులోనే ఒక కొత్త వస్తువును కనిపెట్టడమే కాకుండా, దానికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా పొందిందని బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ గర్వంగా వెల్లడించారు.

ఏమిటీ ‘బూ బాక్స్’?

నిషా కనిపెట్టిన ఈ వస్తువు పేరు ‘బూ బాక్స్’ (Boo box). ఇది ఒక టూ-ఇన్-వన్ టిష్యూ హోల్డర్. సాధారణ టిష్యూ బాక్స్‌లకు భిన్నంగా దీనికి ఒక చిన్న చెత్త బుట్ట (Mini trash bin) కూడా కలిపి ఉంటుంది. అంటే టిష్యూ వాడుకున్న వెంటనే, పక్కనే ఉన్న బిన్‌లో వేసేయవచ్చు. దీనివల్ల ఇల్లంతా టిష్యూలు పడకుండా చాలా శుభ్రంగా ఉంటుంది.

ఈ ఆవిష్కరణ గురించి సన్నీ లియోన్ వివరిస్తూ.. "నిషా చాలా తెలివైనది. ఈ ప్రాజెక్ట్‌ను మొదటి నుంచి చివరి వరకు తనే స్వయంగా పూర్తి చేసింది" అని తెలిపారు. ఇది విన్న ఫరా ఖాన్ సరదాగా స్పందిస్తూ.. "నేను ఇంటికి వెళ్లి నా పిల్లలకు బుద్ధి చెప్పాలి" అని నవ్వేశారు.

ఓ చిన్న సమస్య నుంచి పుట్టిన ఆలోచన!

ముంబైలోని దుమ్ము ధూళి కారణంగా చాలా మంది పిల్లలలాగే నిషాకు కూడా అలర్జీ సమస్య ఉండేది. టిష్యూలు వాడుతూ అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండటంతో సన్నీ తరచూ విసుక్కునేవారట.

నిషా ఇప్పటికే ఈ ఆవిష్కరణ ద్వారా డబ్బు సంపాదిస్తోందని, త్వరలోనే ఆమె దగ్గర చాలా డబ్బు ఉంటుందని, తన తమ్ముళ్లు అషర్, నోవా ఆమెను అడిగి తీసుకోవాల్సి వస్తుందని, వారు అసూయపడుతున్నారని సన్నీ లియోన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

లాతూర్ నుంచి దత్తత

అయితే సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ 2017లో మహారాష్ట్రలోని లాతూర్ నుంచి నిషాను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత వారికి సరోగసీ ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు.

జీ5 ఓటీటీలో

ఇక సన్నీ కెరీర్ విషయానికి వస్తే, ఆమె చివరిగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘కెన్నెడీ’ చిత్రంలో మెరిశారు. ప్రస్తుతం జీ5 (Zee5)లో కెన్నెడీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe