అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాబోతున్న 'కెన్నెడీ' సినిమా పరిశ్రమలో తనపై ఉన్న ముద్రను మారుస్తుందని, భవిష్యత్తులో తనకు మంచి పాత్రలు రావడానికి ఇది దోహదపడుతుందని సన్నీ లియోనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఆమె 'చార్లీ' (Charlie) అనే పాత్రలో కనిపించనుంది. రాహుల్ భట్ పోషిస్తున్న ఉదయ్ శెట్టి (మాజీ పోలీస్ ఆఫీసర్, కాంట్రాక్ట్ కిల్లర్) ప్రపంచంలోకి ఆమె పాత్ర ప్రవేశిస్తుంది. తన పాత్ర చాలా మిస్టరీగా, సున్నితంగా ఉంటూనే ఎంతో బలంగా ఉంటుందని సన్నీ వివరించింది.
ఫోన్ రాగానే భయమేసింది..

ఈ సినిమాలో అవకాశం రావడం గురించి సన్నీ లియోనీ ఆసక్తికర విషయాలు పంచుకుంది. అనురాగ్ కశ్యప్ మొదట సన్నీ భర్త, ఆమె మేనేజర్ అయిన డానియల్ వెబర్‌ను సంప్రదించాడు. అయితే సన్నీతోనే నేరుగా మాట్లాడాలని డానియల్ సూచించడంతో అనురాగ్ ఆమెకు కాల్ చేశాడు.
"ఆయన నాకు ఫోన్ చేసి 'ఒక పాత్ర ఉంది, ఆడిషన్‌కు వస్తావా?' అని అడుగుతారని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ ఆఫర్ వినగానే మైండ్ బ్లాక్ అయ్యింది. ఫోన్ పెట్టేశాక చాలా భయంతోపాటు నెర్వస్ గానూ ఫీలయ్యాను. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా పెద్దది, గొప్పది" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ తెలిపింది.
ఇప్పటికీ కలలాగే ఉంది..
"ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల లాంటిది. ఇప్పటికీ అది కలగానే అనిపిస్తోంది. చాలా రోజులు నేను నమ్మలేకపోయాను. సెట్‌కి వెళ్లేంత వరకు నేను ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నానని నమ్మలేకపోయాను" అని సన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
కెరీర్ మలుపు తిరుగుతుందా?
'బేబీ డాల్', 'లైలా మై లైలా', 'చార్ బోతల్ వోడ్కా' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయిన సన్నీ లియోనీ.. 'కెన్నెడీ' సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 20న జీ5లో విడుదల కానుంది.
"నేను కలిసిన చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు ఈ సినిమా నా ఇమేజ్ను మారుస్తుందని చెప్పారు. ఇది నన్ను నటిగా మరో మెట్టు ఎక్కిస్తుందని, దీని ద్వారా నాకు మరింత మంచి పని దొరుకుతుందని ఆశిస్తున్నాను" అని ఆమె పేర్కొంది.
అనురాగ్ కశ్యప్‌తో సాన్నిహిత్యం
{{/usCountry}}"నేను కలిసిన చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు ఈ సినిమా నా ఇమేజ్ను మారుస్తుందని చెప్పారు. ఇది నన్ను నటిగా మరో మెట్టు ఎక్కిస్తుందని, దీని ద్వారా నాకు మరింత మంచి పని దొరుకుతుందని ఆశిస్తున్నాను" అని ఆమె పేర్కొంది.
అనురాగ్ కశ్యప్‌తో సాన్నిహిత్యం
{{/usCountry}}బిగ్ బాస్, స్ప్లిట్స్ విల్లా, జిస్మ్ 2, మస్తీజాదే వంటి ప్రాజెక్టులు చేసిన సన్నీ.. అనురాగ్ కశ్యప్‌తో పనిచేయడం ఇదే తొలిసారి. "అనురాగ్ సార్‌తో నాకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. మేము మా గతం గురించి, జీవితంలోని అనేక విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆయన దగ్గర నేను సురక్షితంగా ఉన్నానని, నా మాటలకు విలువ ఉందని అనిపించింది. మానసికంగా ఆ కంఫర్ట్ ఉండటం వల్ల నేను స్క్రీన్ మీద బాగా నటించగలిగాను. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి కంఫర్ట్ ఇస్తారు" అని సన్నీ చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో మోహిత్ తకల్కర్, మేఘా బర్మన్, అమీర్ దల్వీ, అభిలాష్ తప్లియల్, కరిష్మా మోడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కెన్నెడీ మూవీ కథ
'కెన్నెడీ' ఒక నియో-నోయిర్ క్రైమ్ మూవీ. ఇది ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మిడ్ నైట్ స్క్రీనింగ్స్' విభాగంలో ప్రదర్శితమైంది. ఈ కథ ఉదయ్ శెట్టి అలియాస్ కెన్నెడీ (రాహుల్ భట్) చుట్టూ తిరుగుతుంది. అతను బయటకు క్యాబ్ డ్రైవర్‌గా కనిపిస్తూనే, అవినీతి పోలీస్ కమిషనర్ రషీద్ ఖాన్ కోసం రహస్యంగా హత్యలు చేస్తుంటాడు. తన కొడుకును కోల్పోయిన బాధ, విచ్ఛిన్నమైన కుటుంబం అతన్ని వెంటాడుతుంటాయి. తన గతం నుంచి పారిపోలేని ఆ నగరంలో అతను విముక్తి కోసం వెతుకుతుంటాడు.